వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీ పరీక్షల్లో రీజనింగ్: Directions (దిశ-స్థానం)

|
Google Oneindia TeluguNews

‘Directions' అను విషయము రీజనింగ్ విభాగంలో ఒక ముఖ్యమైన అంశము. సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో ఈ విషయముపై ప్రశ్నలు ఉంటాయి. Civils, Groups, SI/constable, Bank PO's/Clerks, Staff Selection Commission పరీక్షలలో ఈ విషయం ముఖ్య భూమిక పోషిస్తుంది.

గ్రూప్స్‌లో Directions శీర్షిక మీద ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడగవచ్చు. Staff Selection Commission(SSC) పరీక్షల్లో రెండు ప్రశ్నలు అడగవచ్చు. Civils (C SAT-2) మరియు Bank పరీక్షల్లో ఈ విషయంపై ప్రశ్నలు నేరుగా (డైరెక్ట్ క్వశ్చన్స్) అడగవచ్చు, లేదా Data Sufficiency అను విషయంలో చేర్పి అడగవచ్చు.

మొత్తంగా చూసుకుంటే ఈ విషయంలో నుండి ఏ పోటీ పరీక్షల్లో అయిన ఒక ప్రశ్న ఖచ్ఛితంగా వస్తుంది. కావున పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులు ఈ విషయంలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

Directions (దిశ-స్థానము) విషయములోని వివిధ అంశాలను పరిశీలిద్దాం:

1. దిక్కులు 4, తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణం

పటంలో దిక్కులు:

how to prepare competition tests

2. మూలలు 4. ఆగ్నేయం, నైరుతి, వాయువ్య మరియు ఈశాన్యం.

పటంలో మూలలు:

how to prepare competition tests

3. ఉదయం సూర్యుని వైపు తిరిగి చూస్తే, చూసే వైపు తూర్పు. వీపు వైపు పడమర, ప్రక్కలకు చేతులు చాచిన కుడివైపు దిక్కు దక్షిణం మరియు ఎడమ వైపు దిక్కు ఉత్తరం.

4. ప్రక్క, ప్రక్క దిక్కులు పరస్పర లంబాలు. వాటి మధ్య కోణము 90 డిగ్రీలు. తూర్పు వైపునకు నిలబడి ఉన్న ఒక మనిషి కుడి వైపునకు 90 డిగ్రీలు(లంబంగా) తిరిగితే కనబడే దిక్కు దక్షిణం. ఒక వేళ ఎడమవైపునకు 90డిగ్రీలు తిరిగి ఉంటే కనబడే దిక్కు ఉత్తరం.

5. తూర్పుకు ఎదురు దిక్కు పడమర. ఉత్తరానికి ఎదురు దిక్కు దక్షిణం. ఎదురెదురు దిక్కులు ఒకే రేఖలో అంత్యములలో ఉంటాయి.

6. తూర్పు వైపునకు నిలబడియున్న ఒక మనిషి 180డిగ్రీలు ఎటువైపుకు తిరిగినా కనబడే దిక్కు పడమర.

7. తూర్పుకు అభిముఖంగా నిలబడిన వ్యక్తి కుడివైపునకు 45డిగ్రీలు తిరిగితే ఎదురుగానున్న మూల ఆగ్నేయం. ఎడమకు 45డిగ్రీలు తిరిగితే ఎదురుగా ఉన్న మూల ఈశాన్యం.

8. సవ్యదిశలో తిరుగుట అంటే వ్యక్తి ఏ దిశలో నున్నప్పటికీ కుడివైపునకు తిరగడం. అపసవ్యదిశలో తిరుగుట అంటే ఎడమ వైపునకు తిరగడం.

Position - స్థానము

ఎత్తు వారి నిలబడిన వ్యక్తుల క్రమము, పెట్టెలో అమర్చిన పుస్తకాల క్రమము, వృత్తాకారంలో నిలబడి ఉన్న వ్యక్తుల క్రమము, వరుసలో నిలబడి ఉన్న వ్యక్తుల క్రమములో నున్న ఒక వ్యక్తి ఎడమ నుంచి లేదా కుడి నుంచి లేదా అభిముఖంగా లేదా ‘n'వ స్థానంలో నున్నదిలపై ప్రశ్నలు ఉంటాయి.

1. ఉత్తరం నుంచి స్థితిజ సమాంతరంగా నడుస్తున్న ఒక వ్యక్తి నీడ కుడి వైపున ఉంటే ఆ సమయం ఏది?

జ. ఉదయం పూట వస్తువు నీడ పడమర వైపు ఉంటుంది. సాయంత్రం అయితే తూర్పు వైపు ఉంటుంది. మధ్యాహ్నం నీడ పరిమాణం చాలా తక్కువగా వస్తువుకు అతి దగ్గరలో ఉంటుంది. దక్షిణాభిముఖంగా (ఉత్తరం నుంచి క్షితిజ సమాంతరం) వస్తున్న వ్యక్తి కుడివైపు పడమర, నీడ పడమర వైపున ఉందంటే అప్పుడు ఉదయకాలం.

2. పడమర వైపు నడుస్తున్న వ్యక్తి 225డిగ్రీలు సవ్యదిశలో తిరిగితే తనకెదురుగానున్న దిక్కు ఏది?

జ. సవ్య దిశ అంటే గడియారపు ముల్లు దిశ. కుడివైపునకు తిరుగుట సవ్యదిశ. పడమర నుండి 180డిగ్రీలు ఎటువైపు తిరిగినా తూర్పు దిశ వస్తుంది. తూర్పు నుండి 45డిగ్రీలు కుడి వైపునకు తిరిగితే ఆగ్నేయ మూల ఉంటుంది. (180 డిగ్రీలు+45డిగ్రీలు=225డిగ్రీలు)

3. సలీం దక్షిణాభిముఖంగా 20మీ. నడచి ఎడమ వైపు 45 డిగ్రీలు తిరిగి 25మీ నడచి 45డిగ్రీలు ఎడమకు తిరిగి నిలబడిన అతడు ఏ దిక్కును చూస్తున్నట్లు? బయలుదేరిన ప్రదేశం నుండి ఎంత దూరంలోనున్నాడు.

జ. దక్షిణం నుంచి 45డిగ్రీలు ఎడమకు తిరిగితే ఎదురుగా ఆగ్నేయమూల. ఆగ్నేయమూల నుండి 45డిగ్రీల ఎడమకు తిరిగితే తూర్పుదిశ.

how to prepare competition tests

4. α, β, γ, θలు నలుగురు వృత్తాకారంలో ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు అదే క్రమంలో అభిముఖంగా నిలబడి ఉన్నారు. Φ, π, S, Eలు నలుగురు ఒక్కొక్కరు ఒక్కో మూలకు అదే క్రమంలో నిలబడి ఉన్నారు. α తూర్పుకు అభిముఖంగా, Φ ఆగ్నేయమూలకు అభిముఖంగా నిలబడి ఉన్నట్లయితే, β 315డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగితే అతడు చూస్తున్న దిక్కులో నిలబడి ఉన్న ఇంకో వ్యక్తి ఎవరు?

జ. అపసవ్య దిశ అంటే ఎడమవైపుకు తిరగడం. β, 180డిగ్రీలు తిరిగితే ఉత్తర దిశ, మరల 90డిగ్రీలు తిరిగితే పడమర, ఇంకో 45డిగ్రీలు ఎడమకే తిరిగితే నైరుతి మూల కనబడుతుంది. నైరుతి మూలకు నిలబడి ఉన్న వ్యక్తి π.

how to prepare competition tests

5. వరుస క్రమంలో Aకి ఎడమ B, B నుండి కుడికి నాలుగవ స్థానంలో C, Cకి కుడి ఎడమలో D మరియు E ఉంటే మధ్య స్థానంలో నున్నదెవరు?

జ. Aకి ఎడమ వైపున B ఉంటే BA.
B నుంచి కుడికి నాలుగవ స్థానంలో C అంటే BCD, 2,3,4(C).
C కుడి, ఎడమలలో D మరియు E అంటే E,C,D

వరుస క్రమము: B, A, E, C, D, మధ్యస్థానంలో నున్నది E.

Directions

how to prepare competition tests

There are Four main directions - East, West, North and South as shown below:

how to prepare competition tests

There are Four cardinal directions - North-East (N-E), North-West (N-W), South-East (S-E), and South-West (S-W) as shown below:

how to prepare competition tests

Generally, questions in directions would be framed on the movement of a person in various directions. Sometimes the movement can also be a Left Turn or a Right Turn.

how to prepare competition tests

Shortest Distance:
A shortest distance is always the diagonal distance. For a square the diagonal(d) distance is √2a

how to prepare competition tests

For a rectangle, the shortest distance d (diagonal) is given by Pythagoras Theorem:
d=l+b

how to prepare competition tests

Shadows

At the time of sunrise if a man stands facing the east, his shadow will be towards west.
At the time of sunset the shadow of an object is always in the east.
If a man stands facing the North, at the time of sunrise his shadow will be towards his left and at the time of sunset it will be towards his right.
At 12:00 noon, the rays of the sun are vertically downward hence there will be no shadow.

So, it can be concluded that whenever the shadow is described Infront or Behind, the person should be facing/walking in East or West. In the same way, if the shadow is described Left Hand Side or Right Hand Side, the person is facing/ walking in South or North.

INFRONT/BEHIND→EAST/WEST
LHS/RHS→ NORTH/SOUTH

Note: Never bother whose shadow it is, always concentrate on whom the shadow is described and draw the conclusion.
Example1:
Madhu started from his house goes 5 km in the East, and then he turns to his left and goes 4 km. Finally he turns to his left and goes 5 km. Now how far is he from his house and in what direction?
Solution:

how to prepare competition tests

From third position it is clear he is 4 km from his house and is in North direction.

Example 2:
Suman started from his house, goes 4 km in the East, then he turns to his right and goes 3 km. What minimum distance will be covered by him to come back to his house?
Solution:

how to prepare competition tests

Example 3:
One morning after sunrise Deekshitha, while going to school met Advitha at a crossing. Advitha's shadow was exactly to the right of Deekshitha. If they were face to face, which direction was Deekshitha facing?
Solution: In the morning sunrises in the east.

how to prepare competition tests

So in morning the shadow falls towards the west.
Now Advitha's shadow falls to the right of the Deekshitha. Hence Deekshitha is facing South.

గ్రూప్-II, SI, Constable, మాదిరి ప్రశ్నలు:

1. పవిత్ర బజారు నుంచి పడమర దిక్కున వెలుతూ ఒకసారి ఎడమ మరోసారి కూడా ఎడమకే తిరిగి ప్రయాణిస్తూ మరల కుడివైపు తిరిగి ఇల్లు చేరింది.

1. తూర్పు 2. పడమర 3. ఉత్తరం 4. దక్షిణం

2. ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి తూర్పు వైపు 50మీ నడచి కుడివైపునకు 50మీ. మరల కుడివైపునకే తిరిగి 50మీ నడిచిన తర్వాత మరల కుడివైపునకు తిరిగి 50మీ నడిచి నిలబడిన అతడే దిక్కును చూస్తున్నాడు.

1. తూర్పు 2. పడమర 3. ఉత్తరం 4. దక్షిణం

3. ఒక వ్యక్తి దక్షిణం వైపు తిరిగి వున్నాడు. అతను 135డిగ్రీల కోణంతో అపసవ్య దిశలో తిరిగి మరల 180డిగ్రీల సవ్యదిశలో తిరిగిన అతను ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు

1. ఉత్తరం - తూర్పు 2. ఉత్తరం - పడమర
3. దక్షిణం - తూర్పు 4. దక్షిణం - పడమర

4. ఒక రోజు సాయంత్రం లక్ష్మయ్య మరియు రామయ్య ఒకరికి అభిముఖంగా మరొకరు నడుస్తున్నారు. లక్ష్మయ్య తన నీడను తనకు ఎడమ వైపున చూసుకుంటే రామయ్య ఏ దిక్కు వైపున నడుస్తున్నాడు.

1. తూర్పు 2. పడమర 3. ఉత్తరం 4. దక్షిణం

5. ఇందిర తూర్పు దిశగా 300మీ. నడిచి ఎడమవైపు తిరిగి 50మీ. నడిచింది. తిరిగి ఎడమ వైపునకు 300మీ. నడడిచన ఆమె బయలుదేరిన చోటు నుండి ఎంత దూరంలో ఉంది.

1. 650మీ 2. 600మీ. 3. 350మీ 4. 50మీ

6. భాస్కర్ ఒక రోడ్డు వెంబడి 1 కి.మీ ముందుకు నడచి 1/2కి.మీ వెనుకకు నడిచాడు. మరల 1/4 కి.మీ నడచిన మొదటగా తను బయలుదేరిన స్థానము నుండి ఎంతదూరంలో ఉన్నారు?

1. 1/4 కి.మీ 2. 1/2 కి.మీ 3. 3/4కి.మీ 4. 1 1/4కి.మీ

7. రోహిత్ తన ఇంటి నుండి కుడివైపుగా తూర్పు దిశకు 50మీ నడచి ఎడమ వైపు తిరిగి 50మీ. నడచి నిలబడినాడు. అతడిప్పుడు తన ఇంటిని చూడవలెనంటే ఎంత కోణములో ఏ వైపుకి తిరగాలి?

1. 225డిగ్రీలు ఎడమ 2. 135డిగ్రీలు కుడి 3. 180డిగ్రీల కుడి 4. 135డిగ్రీల ఎడమ

8. రేఖ దక్షిణం వైపుగా 12 కి.మీ నడిచి తర్వాత ఎడమ వైపు తిరిగి 12 కి.మీ నడిచి ఇపుడు కుడివైపునకు 7కి.మీ నడిచి మరల కుడివైపునకే తిరిగి 12కి.మీ నడచిన బయలుదేరిన స్థానం నుండి ఇపుడెంత దూరంలో ఉంది?

1. 5కి.మీ 2. 14కి.మీ 3. 19కి.మీ 4. 24 కి.మీ

9. A,B,C,D మరియు Eలు ఇలా కూర్చున్నారు. C మరియు Bల మధ్యలో A. Aకు ఉత్తరాన D, Cకు దక్షిణాన E, Aకి పడమటి వైపున B E, Bని ఏ దిశలో చూస్తాడు?

1. ఉత్తరం 2. దక్షిణం 3. ఆగ్నేయం 4. వాయవ్యం

10. కృష్ణ దక్షిణం వైపు నిలబడి వున్నాడు. 150డిగ్రీల అపసవ్య దిశలో తిరిగి, మరల 30డిగ్రీల సవ్యదిశలో తిరిగి నిలబడిన అతను ఏ దిక్కు వైపు నిలబడినట్లు?

1. ఈశాన్యం 2. నైరుతి 3. వాయువ్యం 4. ఉత్తరం

11. ఒక వ్యక్తి నిలబడి ఉన్న చోటుకు తూర్పున అతని ఇల్లు, పడమరన వైద్యశాల ఉత్తరాన దేవాలయము మరియు దక్షిణాన పాఠశాల కలవు. అతను వైద్యశాలను చూస్తూ నిలబడి పోయినట్లైతే దేవాలయము అతనికి ఏ వైపు ఉంది.

1. వెనక 2. కుడి 3. ఎడమ 4. ముందు

12. రహీం ఉదయం మార్కెట్‌లో నిలబడిన ప్రదేశంలో ఎదురుగా మసీదు, వెనుక హోటల్, కుడి వైపున రోడ్డు, ఎడమ వైపున బస్టాండ్ కలవు. తన నీడను రహీం తనకు ఎడమ వైపున ఉన్నట్లు గుర్తించాడు. మార్కెట్ బస్టాండుకు ఏ దిశలో కలదు.

1. ఉత్తరం 2. దక్షిణం 3. పడమర 4. తూర్పు

జవాబులు:

1. జవాబు 4, బజారుకు ఇల్లు దక్షిణం దిక్కులో ఉంటుంది.

how to prepare competition tests

2. జవాబు 3, ప్రయాణించిన దూరాలు నాలుగు దిక్కులలో సమానము. చివరగా అతను బయలుదేరిన స్థానానికే వచ్చి చేరును. అయితే ఉత్తర దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటాడు.

how to prepare competition tests

3. జవాబు 4, దక్షిణము - పడమర

సవ్యదిశ - అపసవ్య దిశ
= 180డిగ్రీలు - 135డిగ్రీలు
= 45డిగ్రీలు సవ్యదిశ

how to prepare competition tests

4. జవాబు 3. సాయంత్రం వేళ నీడ తూర్పు వైపు ఉంటుంది. లక్ష్మయ్యకు ఎడమ వైపు తూర్పు అంటే తను దక్షిణం వైపు నడుస్తున్నాడు. రామయ్య, లక్ష్మయ్యకు అభిముఖంగా అంటే ఉత్తరం దిక్కు వైపు నడుస్తున్నాడు.

5. జవాబు 4. బయలుదేరిన స్థానము నుండి చివరగా చేరిన స్థానమునకు గల దూరం
= AD=BC=50మీ.

how to prepare competition tests

6. జవాబు 3. బయలుదేరిన స్థానము నుండి చివరగా చేరిన స్థానమునకు గల దూరము

how to prepare competition tests

7. జవాబు 4. ఎడమవైపు 90డిగ్రీలు+ మరల ఎడమ వైపునకు 45డిగ్రీలు
= 135డిగ్రీలు
ఎడమ వైపునకు తిరగాలి.

how to prepare competition tests

8. జవాబు 3.

how to prepare competition tests

9. జవాబు 4. 'E', Bని వాయువ్య మూలలో చూస్తుంది

how to prepare competition tests

10. జవాబు 1. 150డిగ్రీలు అపసవ్య దిశ -30డిగ్రీల సవ్యదిశ = 120డిగ్రీల అపసవ్య దిశ
దక్షిణం వైపు నిలబడి ఉన్న వ్యక్తి 90డిగ్రీల అపసవ్య(ఎడమకు) దిశలో తిరిగితే తూర్పు మరల 30డిగ్రీల అదే దిశలో తిరిగితే ఈశాన్యమూలకు నిలబడినట్లు

how to prepare competition tests

11. జవాబు 2. వైద్యశాల పడమర వైపున ఉంది. పడమటి వైపున నిలబడి ఉన్న వ్యక్తికి కుడివైపున ఉత్తరం(దేవాలయం) వైపున ఉంది.

how to prepare competition tests

12. జవాబు 4. మార్కెట్, బస్టాండ్‌కు తూర్పు వైపున ఉంటుంది.

how to prepare competition tests

Bank/SSC model Questions

Dirction Problems:

1. One morning Udai and Vinay were talking to each other face to face at a crossing. If Vinay 's shadow was exactly to the lefts of Udai, which direction was Udai facing?
(a)East (b)West (c)North (d) South (e) Cannot be determined

2. Madhu starts from his house towards West. After walking a distance of 30m, he turned towards right and walked 20m He then turned left and moving a distance of 10m, turned to his lefts again and walked 40m. He now turns to the lefts and walks 6m. Finally he turns to his lefts. Inn which direction is he walking now?
(a)East (b) South (c) North (d) South West (e) South East

3. Prasad went 20km to the North from his house, taken a lefts turn and moved 10km and right turn and moved for 15kms . He continued to take left and right turns twice, alternating with each other with 10km, 5km, 10 km and 5 km respectively to reach his Uncles house.
In which direction is his Uncle's house with respect to house and what is the shortest distance between both the houses?

4. Y is in the east of X which is in the north of Z. If P is in the south of Z then in which direction of Y is P?
(a)North (b)South (c)East (d)South East (e) None of these

5. If South-East becomes North , North-east becomes West and so on, what will west become
(a)North-East (b) North -West (c) South East (d) South West (e) None.

6. Navya puts her timepiece on the table such a way that at 6PM, hour hand points to North. In which direction the minute hand will point at 9:15 PM?
(a)South East (b) South (c) South-West (d) West (e) North

7. P is 40m South West of Q. R is 40m South East of Q. Then R is in which direction of P?
(a)East (b) West (c) North East (d) North West (e) South

8. Suman who is facing east, turns 100° in the anti-Clock wise direction and then 145° in the clock wise direction. Which direction is he facing now?
(a)North West (b) South East (c)South (d) West (e) East

9. One morning after sunrise, Vimala and Shekar were standing in a lawn with their backs towards each other. Vimala's shadow fall exactly towards her left hand side. Which direction was Shekar facing?
(a)East (b)West (c)North (d) South (e) None of these

10. P ,Q ,R and S are playing a Game of carom. P, R and S, Q are partners. S is to the right of R who is facing west. In which direction is Q facing?
(a)East (b)West (c) North (d) south (e) None

11. The town of Kambal is located on Salt Lake. The town of Azmal is west of Kambal. Tumar is east of Kambal but west of Kambal . Kakran is east of Bheemur buts west of Tumar and Azmal. If they are all in the same district, which town is farthest west?
(a)Bheemur (b)Kambal (c) Azmal (d) Tumar (e)Kakran

12. Uttam has started moving in North direction for 15mts he then taken 4 lefts turns and 4 rights turns measuring 20,30,40,10,20,10,20,30mts respectively . And finally he has taken a left turn and moved 35mts to reach his destination. How far and in which direction is he from the starting points?
(a)NE, 15√2 m (b)SE, 15√5m (c) NW, 15√5 m (d) NW, 15√2m (e)None

13. A person starts from his house and goes 2m towards East then turns towards right and goes 25m and goes again towards east travelling 15m Then turns lefts and travels for 18m . He then goes toward east and travels 7mts. How far is he from his house
(a)30m (b)25√2m (c) 25√5m (d) 25m (e)15m

14. Rohan went 90m in the east to look for his father, then he turned rights and went 20m . After this he turned rights and after going 30m he reached his aunt's house. His father was not therer from there he went 100m to this north and met his father. At what distance did he meets his father from the starting point
(a)80m (b) 100m (c) 140m (d) 260m (e)120m

15. In the evening , Sumith was standing facing a Pole . The shadow of the pole fell exactly to his right. To which direction was he facing
(a)South (b)East (c) West (d) North (e)Data inadequate

16. Rahul and Sunil started from their school. Rahul moved in North direction for 10m , then turned West 10m, South 10m, west 15m and finally turned North and moved 20m to reach house. Sunil moved east for 10m , then turned south 15m east 10m and finally moved in South direction for 20m to reach his house. With respect to rahul's house in which direction is Sunil's house?
(a)NW (b)NE (c) SW (d) SE (e) Cannot be determined

17. The length and breadth of a room are 8m and 6m respectively A cat runs along all the four walls and finally al long a diagonal to catch a rat at the end of diagonal. What is the total distance travelled by the cat and at how much distance from the starting points, did it catch the rat
(a)20,10mts (b)38,20mts (c) 20,38mts (d) 10,20mts (e) 38,10mts
18. Madhuri wants to go to the market. She starts from her home, moves in west direction and comes to criss-cross. The road straight ahead ends in a theater. The road to her left ends in park. In which direction is the park?
(a)East (b) West (c) North (d) South (e)Cannot be determined

19. A girl leaves her home. She first walks 30mts'NW' direction and then 30mts in SW direction m next walk 30mts in SE direction to reach her school. In which direction is the school, with respect to home?
(a)NE (b)NW (c) SE (d) SW (e)None

20. A snake was seen moving in north direction. She took 3 left turns for 10m, 20m and 30m then 4 Right turns for 40m, 30m and 20m . Again she took a left turn and moved 30m and finally she had turned right for 145® In which direction was it moving?
(a)NW (b) North (c) South (d) South West (e) South East

how to prepare competition tests

-హర్షవర్ధన్ ఎర్ర

English summary
A banking expert Harashavardhan Erra is explaining about Directions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X