విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మిస్ వైజాగ్' బరిలో 17 మంది, వీరే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఫ్యూచర్ ఆల్, బెల్‌రైస్ సంయుక్తంగా సాయి క్రియేటివ్ ఎంటర్ టైన్‌మెంట్ నేతృత్వంలో నిర్వహిస్తున్న 'మిస్ వైజాగ్-2015' గ్రాండ్ ఫెనాలె పోటీలు ఈ నెల 29న బీచ్ రోడ్డు వైఎంసీఏ సింపనీ హాల్లో నిర్వహించనున్నట్టు సాయి క్రియేటివ్ ఎంటర్ టైన్‌మెంట్స్ ఎండీ గొట్టిపాటి సాయి తెలిపారు.

నగరంలోని ఓ హోటల్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న హోటల్ మేఘాలయలో మిస్ విశాఖ-2015 ఆడిషన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. 70 మంది యువతులు పాల్గొనగా 17 మందిని ఫైనలిస్టుగా తీసుకోవడం జరిగిందని చెప్పారు.

'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

వీరికి 22 నుంచి 29 వరకు గ్రూమింగ్ సెషన్ జరుగుతుందని, 29న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలెలో 17 మంది యువతులు పోటీ పడనున్నట్టు చెప్పారు. న్యాయ నిర్ణేతలుగా సినీ దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్, ఆనందం మూవీ హీరోయిన్ రేఖ, మోడల్ హీరో మార్గాని భరత్ వ్యవహరించనున్నారని తెలిపారు.

'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

ఎంటర్ టైన్‌మెంట్‌గా జబర్ దస్త్ టీమ్ ధన్ రాజ్, గాలిపటాల సుధాకర్, భాస్కర్, చలాకీ చంటి, కామెడీ ప్రోగ్రామ్ సింగర్, యాంకర్స్‌గా పరిణిత, సాకేత్‌లు వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్స్ మిత్రా, లీలా టాటా, ఆటా సందీప్ డ్యాన్స్ ఫెర్పార్మెన్స్ ఉంటుందని చెప్పారు.

 'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

ఫైనలిస్టులు కొరియోగ్రాఫర్ శాంతి కొటారి, ఫ్యాషన్ డిజైనర్ గొట్టిపాటి స్రవంతి పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఇప్పటికే మిస్ విజయవడా, మిస్ గుంటూరు, మిస్ నెల్లూరు, మిస్ వెస్ట్ గోదావరి, మిస్ రాజమండ్రి నిర్వహించడం జరిగిందన్నారు.

 'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

'మిస్ వైజాగ్' బరిలో 17 మంది

తర్వాత ఒక్కో ప్రాంతం నుంచి ముగ్గురిని తీసుకొని మొత్తం 18 మంది యువతులతో విజయవాడలో 'మిస్ ఏపీ' నిర్వహించనున్నట్లు చెప్పారు.

English summary
Vizag is all set to witness the city’s most popular beauty pageant as 17 contestants will vie for the crown of Miss Visakha-2015 in the grand finale to be held at YMCA’s Symphony Hall in the city on November 29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X