హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మ వేడుక: మహిళల ఆటపాటలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సిద్ధమవుతున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ముషీరాబాద్ క్రీడా మైదానంలో బతుకమ్మ ఆటపాటల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది మహిళలు ఈ వేడుకలో పాల్గొని బతుకమ్మ ఆటా, పాటలతో హోరెత్తించారు.

వివిధ రకాలైన పూలతో ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలతో కదిలివచ్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజాన్ని మేలుకొల్పే వివిధ బతుకమ్మ పాటలు పాడి మహిళలను ఉత్సాహపర్చారన్నారు.

బతుకమ్మతో చిన్నారి

బతుకమ్మతో చిన్నారి

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సిద్ధమవుతున్నారు.

బతుకమ్మ ఆట

బతుకమ్మ ఆట

బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ముషీరాబాద్ క్రీడా మైదానంలో బతుకమ్మ ఆటపాటల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

అమ్మవారి రూపంలో..

అమ్మవారి రూపంలో..

బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి రూపంలో అలంకరించిన బతుకమ్మ. పక్కనే బతుకమ్మను ఎత్తుకున్న చిన్నారి.

బతుకమ్మలతో..

బతుకమ్మలతో..

వివిధ రకాలైన పూలతో ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలతో కదిలివచ్చి సందడి చేశారు.

రూపొందిస్తూ..

రూపొందిస్తూ..

వేడుకల సందర్భంగా బతుకమ్మను సుందరంగా రూపొందిస్తున్న మహిళలు.

బతుకమ్మలతో..

బతుకమ్మలతో..

ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాము రూపొందించిన బతుకమ్మలతో వస్తున్న మహిళలు.

బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ సంబురాలు

వివిధ రకాలైన పూలతో ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలతో కదిలివచ్చిన మహిళలు సందడి చేశారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వేడుకలు

వేడుకలు

సమాజాన్ని మేలుకొల్పే వివిధ బతుకమ్మ పాటలు పాడి మహిళలను ఉత్సాహపర్చారన్నారు.

వేడుకలు

వేడుకలు

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, బతుకమ్మ సంబురాల నిర్వాహక కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు బండారు సుజాత, ప్రజా సాంస్కృతిక కేంద్ర కన్వీనర్ జి. రాములు, మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, బతుకమ్మ సంబురాల నిర్వాహక కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు బండారు సుజాత, ప్రజా సాంస్కృతిక కేంద్ర కన్వీనర్ జి. రాములు, మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, ఎంవి రమణ, జి. నరేష్, విజయలక్ష్మి, పావని, అరుణజ్యోతి, లక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో తొలిసారి జరిగే బతుకమ్మ పండుగను నగరంలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎంబి కృష్ణయాదవ్, కార్యదర్శి డాక్టర్ టి హరికృష్ణలు శుక్రవారం కలెక్టర్ ముఖేష్ మీనాను కలిసి విన్నవించారు.

English summary
Bathukamma Ata by Telangana Praja Samskruthika Kendram at Musheerabad, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X