హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మ వేడుకలు: ఉత్సాహంగా యువతుల ఆటాపాట(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ వేడుకలను జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

తెలంగాణ మత్స్యకారులు, మత్య్స కార్మిక సంఘం గ్రేటర్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ముషీరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ వాలీబాల్‌ క్రీడామైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉత్సాహంగా..

ఉత్సాహంగా..

బతుకునిచ్చే పండగ బతుకమ్మ అని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారులు, మత్య్స కార్మికుల సంఘం గ్రేటర్‌ కమిటీ నేతలు అర్వపల్లి శ్రీరాములు, కొప్పు పద్మ, కర్రెల్లి లలిత, రాష్ట్ర కమిటీ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, ఎంబీసీ కన్వీనర్‌ జి.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కోదండరాం ఆట

కోదండరాం ఆట

బతుకమ్మను ఘనంగా నిర్వహించడమే కాదు, మహిళలను గౌరవించి వారికి పదవుల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని కోదండరాం అన్నారు.

ఔన్నత్యం చాటుతూ..

ఔన్నత్యం చాటుతూ..

తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధులను, మహనీయుల చరిత్రను గుర్తు చేస్తూ మహిళలు బతుకమ్మ సంబురాల్లో పాటల రూపంలో పాడుతూ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని పెంపొదిస్తున్నారని అన్నారు.

ఎదగనిద్దాం

ఎదగనిద్దాం

బతుకమ్మ సంబరాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఆడ పిల్లలను చదివించడంతోపాటు భ్రూణహత్యలు నివారించేందుకు కృషి చేస్తున్నామని సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, నగర కార్యదర్శి శ్రీరాములు అన్నారు.

సంబరంగా వేడుకలు

సంబరంగా వేడుకలు

హైదరబాద్ నగర వ్యాప్తంగా 30 మత్స్యకార సొసైటీలు ఈ సంబురాల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకార సంఘం నాయకులు కొప్పు పద్మ, లలిత, తులసి, విజయలక్ష్మి, విమల, నాగమణి పాల్గొన్నారు.

ఆటాపాటలు

ఆటాపాటలు

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ వేడుకలను జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

English summary
Bathukamma festival started in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X