బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కండలు పెంచిన డ్రైవర్ బాలకృష్ణ: మిస్టర్ ఆసియా అయ్యాడు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన జి.బాలకృష్ణ అనే ట్యాంకర్‌ డ్రైవర్‌ ప్రతిష్ఠాత్మక మిస్టర్‌ ఆసియా టైటిల్‌ సాధించాడు. ఇటీవల ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఐదో ఫిలి-ఏసియా బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అతడు కైవసం చేసుకున్నాడు.

బెంగళూరు ఆర్నాల్డ్‌గా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ.. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆయనకు తల్లి పర్వతమ్మ, సోదరుడు రాజేష్‌ అండగా నిలిచారు. బాలకృష్ణ గతంలో కూడా జర్మనీలో జరిగిన పోటీలో అండర్‌-24 కేటగిరిలో మిస్టర్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యాడు.

Bengaluru water tanker driver crowned Mr. Asia

కాగా, 'మిస్టర్ ఆసియాగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. నా తల్లి పార్వతమ్మ, సోదరుడు రాజేష్ నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. వారి వల్లే ఇదంతా సాధ్యమైంది' అని బాలకృష్ణ చెప్పారు.

2014లో ఏథెన్స్‌లో జరిగిన పోటీల్లో అండర్‌ -24కేటగిరిలో మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. బాలకృష్ణ ముంబైకి చెందిన సంగ్రామ్‌ చౌగ్లా, పంజాబ్‌కు చెందిన మునిష్‌ కుమార్‌లు వద్ద శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా, వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గానూ విధులు నిర్వహిస్తున్నాడు.

English summary
This 25-year-old could have passed by you as just another water tanker driver, rushing through the choked traffic in Whitefield. In the last week or so, he has become a sensation — “Arnold Schwarzenegger of Whitefield.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X