వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్ణపై బాలీవుడ్ చిత్రం: వెనక ఆ ఐపిఎస్ అధికారి

పూర్ణా మలావత్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అతి చిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఘనత ఆమెది. ఆమె సాధన వెనక ఉందెవరు...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో ఇటీవల క్రీడాకారుల జీవిత చరిత్రలను తెరకెక్కించడం ఓ ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి కూడా. మేరీ కోమ్, ఎంఎస్ ధోనీ వంటి చిత్రాలు హిందీలో తెర మీద ఆవిష్కృతమయ్యాయి. తాజాగా, పూర్ణా మలావత్ జీవిత చరిత్రను హిందీలో సినిమాగా తీసుకున్నారు.

తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ తెర మీదికి ఎక్కిన క్రీడాకారుల సరసన చేరనుంది. ఆమె జీవిత కథ సినిమాగా వస్తోంంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా మూడేళ్ల క్రితం అతిపిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన అమ్మాయిగా పూర్ణ రికార్డుల్లోకెక్కింది.

Poorna Malavat

ఈ లక్ష్యాన్ని పూర్ణ ఎలా సాధించింది, దాని వెనక ఉన్న ఆసక్తీ శ్రమ ఏమిటి అనేది కథావస్తువు కానుంది. దానికి తోడు పూర్ణ ఆ లక్ష్యాన్ని సాధించడానికి స్ఫూర్తినిచ్చి ప్రోత్సహించిందెవరు అనేది కూడా చిత్రంలో ప్రధానంగా చూపిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు రాహుల్‌బోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'పూర్ణ' పేరునే టైటిల్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమాకు రాహుల్‌ బోసే నిర్మాత.

రాహుల్ బోస్ ఓ ప్రధాన పాత్రను కూడా పోషిస్తున్నారు. మలావత్ పూర్ణ పాత్ర కోసం అదితి అనే అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు. పర్వతారోహకరురాలిగా పూర్ణ సాహసాల వెనుక ఐపీఎస్‌ అధికారి, సాంఘిక సంక్షేమ పాఠశాలల సంఘం కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు.

సినిమాలో ప్రవీణ్‌కుమార్‌ పాత్రను దర్శకుడు రాహుల్‌ బోస్‌ పోషిస్తున్నారు. పూర్ణ పాత్రలో నటించేందుకు అదితి చాలా కష్టపడిందని దర్శకుడు రాహుల్‌ బోస్‌ ప్రశంసించాడు. పూర్ణ నడతను అలవర్చుకోవడం, అమెలా శరీరాకృతిని మార్చుకోవడంలో అదితి అంకిత భావంతో పని చేసిందని ఆయన చెప్పారు.

పూర్ణ జన్మించిన గ్రామం సహా ఆమెకు సంబంధం ఉన్న అనేక ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహించారు. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేశారు. ఈ సినిమాను మార్చి 31న దేశవ్యాప్తంగా సుమారు 250 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పూర్ణ 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అమ్మాయిగా నిలిచింది.

English summary
In Poorna Malavath's biopic, Rahul Bose is playing the role of IPS officer Praveen Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X