వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుధుద్: ఆదివారమంతా క్షణక్షణం ఇలా..

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హుధూద్ పెను తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిషాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి తూర్పు తీరం గజగజ వణికిపోయింది. ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికారు. ప్రాణ నష్టం పెద్దగా జరగకపోవడం కొంత ఊరట.ఆదివారం ఉదయంనుంచి సాయంత్రం వరకూ తుపాను సృష్టించిన విధ్వంసం తాలూకు వివరాలు ఇవి..

ఉదయం 8.40: గంటకు 195 కిలోమీటర్ల ప్రచండ వేగంతో హుధూద్ విశాఖ తీరంవైపు దూసుకువస్తోంది.
9.30: తీరానికి హుధూద్ 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిక
10.25: గంటకు 15 కిలోమీటర్ల వేగంతో విశాఖకు 45 కిలోమీటర్ల దూరంలో హుధూద్
11.27: హుధూద్ తుపాను పూడిమడక వద్ద తీరాన్ని తాకింది.
11.35: విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు మృతి
12.00: 170నుంచి 195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు మొదలు
12.25: పెనుగాలుల వేగం బాగా తగ్గినట్టు ఐఎండి ప్రకటన
1.20: విశాఖ చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ అదనపు బృందాలు
2.20: ఎపి సిఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్. తుపానుపై ఆరా
2.30: తగ్గినట్టే కనిపించిన పెనుగాలుల వేగం గంటకు 180 కిలోమీటర్లకు పెరిగింది.
2.55: ఐదుకు చేరిన మృతుల సంఖ్య
3.30: బాధితులకు ఆశ్రయం ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే 55 ఖాళీ కోచ్‌లతో నాలుగు రైళ్ళను ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసింది.
3.54: తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుగా పాడైన రోడ్లు, పంటలు, భవంతుల తాలూకు వీడియో చిత్రాలను అప్‌లోడ్ చేయవలసిందిగా ప్రజలకు సిఎం చంద్రబాబు విజప్తి.
5.28: హుధూద్ వేగం గంటకు 120 కిలోమీటర్లకు తగ్గింది.

Cyclone Hudhud: Andhra Pradesh stays on alert and focuses on restoration

హుధుద్ తాకిడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. తుఫాను తీరం దాటి ఉధృతి తగ్గిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ధణరపై, సహాయక చర్యలపై దృష్టి పెట్టింది. విద్యుత్తు సరఫరాను పునరుద్ధిచే పనిలో పడింది.

తుఫాన్ తాకుడికి విశాఖపట్నం రెక్కలు విరిగిన పక్షిలా విలవిలలాడింది. విద్యుత్తు స్తంభాలను పునరుద్ధరించడం పెద్ద సవాల్ అని మంత్రి నారాయణ అన్నారు. విశాఖపట్నంలో 61 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు వారం రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు.

తాను తుఫాను తాకిడి ప్రాంతాలకు వెళ్తున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. సహాయక శిబిరాల్లో ఐదు లక్షల మంది ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఆహారం, మందులు, పిల్లలకు పాలు అందించాలని కూడా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

English summary
A day after a very severe cyclonic storm Hudhud battered the Andhra coast with heavy rains leaving 6 persons dead, the state government is investing its energy and resources on restoration and relief works even as it remained on alert in view of heavy rainfall warning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X