వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటర్ బాటిల్స్: బాధపడ్డ బాలు, ఫేస్‌బుక్ పోస్ట్ హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. నీరు వృథా చేయవద్దని పెట్టిన ఓ పోస్ట్ ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలో చాలాచోట్ల నీటి సమస్య ఏవిధంగా ఉందో మనం రోజూ చూస్తున్నాం.

లాతూర్ ప్రాంతానికి అయితే ఏకంగా రైళ్లలో నీటిని తరలిస్తున్నారు. ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు తవ్వాలని, నీటిని సంరక్షించాలని పిలుపునిస్తున్నాయి. బాలసుబ్రహ్మణ్యం కూడా నీటి సమస్య పైన స్పందించారు. ఆయన పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్లో దూసుకుపోతోంది.

 Don’t waste water, says SP Baluin a post that’s gone viral

తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో నీటి సంరక్షణపై చేసిన ఒక వ్యాఖ్య అందర్నీ ఆకట్టుకుంటోంది. 'దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో జనం గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల నేను కొన్ని వివాహాలకు వెళ్లినప్పుడు కనిపించిన దృశ్యం నాకు బాధ కలిగించింది.

భోజన సమయాల్లో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. చాలామంది వాటిలో సగం నీళ్లు మాత్రమే తాగి పారేస్తున్నారు. విసిరేసిన సీసాల్లో మిగిలిన నీళ్లను అక్కడ పనివాళ్లు పారబోయటాన్ని నేను చూశాను. ఇది బాధాకరం. దయచేసి నీటిని ఇలా వృథా చేయొద్దు. కావాల్సినంత వాడుకుని మిగతాది పొదుపు చేయండి' అని పోస్ట్ పెట్టారు.

ఈ పోస్టింగ్‌కు సామాజిక మాధ్యమంలో విపరీతమైన స్పందన వస్తోంది. వేలాది మంది ఈ పోస్ట్‌కు లైక్‌‍లు కొట్టారు. వేలాది మంది దీనిని షేర్ చేశారు. చాలామంది ఆయన కామెంటు పైన అభిప్రాయం వ్యక్తం చేసి, ఆయనను ప్రశంసించారు.

English summary
even as we face a heat wave and temperatures as high as 43° Celsius, the huge problem of water scarcity stares us in the face. And yet, many of us waste water without a thought. It's this callous attitude that singer SP Balasubrahmanyam's stirring post on social media, that has gone viral, draws attention to.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X