న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధు గెలుపుకు 'తెలుగు'తో గోపీచంద్ వ్యూహం, సినిమాగా..

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజతం గెలుచుకున్నారు. ఆమె పైన ప్రశంసలు, రివార్డుల వర్షం కురుస్తోంది. రియోలో నెంబర్ 2, నెంబర్ 6 ర్యాంకులతో పాటు ఇతర క్రీడాకారిణిలను ఓడించేందుకు పీవీ సింధుకు కోచ్ గోపీచంద్ ఎప్పటికప్పపుడు పలు సూచనలు చేశారు.

ఈ సూచనలు తెలుగులో ఉండటం గమనార్హం. ఇంగ్లీష్‌లో సూచనలు చేస్తే ప్రత్యర్థికి అర్థమవుతుందేమోననే అభిప్రాయంతో తెలుగులో చేసి ఉంటారని భావిస్తున్నారు. మ్యాచులు జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేందుకు కోచ్‌లు సలహాలిస్తుంటారు.

అందుకు అనుగుణంగా క్రీడాకారులు వెంటనే తమ వ్యూహాన్ని మార్చుకుంటుంటారు. సింధుకు కూడా గోపీచంద్ ఆయా మ్యాచుల్లో సూచనలు, సలహాలు చేస్తూ ఆమెకు పూర్తి అండగా నిలిచారు. సింధుతో ఇంగ్లీషులో మాట్లాడకుండా.. ప్రత్యర్థులకు వ్యూహాలు తెలియకుండా తెలుగులో సూచనలు చేసేవాడని తెలుస్తోంది.

From Badminton Champion To Celebrated Coach, Story Of Pullela Gopichand On Screen

గోపీచంద్ పైన సినిమా

పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా సినిమా రానుంది. గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషించనున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. నవంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది.

వచ్చే ఏడాది విడుదలవనుంది. గోపీచంద్‌ నిజమైన హీరో అని, అతడి జీవితం అందరికీ తెలియాల్సిన అవసరముందని, గోపీచంద్‌తో కలిసి బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఆడానని, అతడి గురించి తనకు బాగా తెలుసునని, అతడి పాత్ర పోషించేందుకు నేనే సరైన వ్యక్తిని అని, సినిమా ఆలోచనను తొలుత గోపీచంద్ తిరస్కరించాడని, మేం ఒప్పించామని, కథకు అతడు ఆమోదం తెలిపాడని సుధీర్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా, పీవీ సింధును సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతాలో అభినందించిన విషయం తెలిసిందే. దానిని 20 వేల మందికి పైగా రీట్వీట్లు చేశారు. 'హ్యాట్స్ ఆఫ్ టూ యూ పీవీ సింధూ. నేను నీకు గ్రేట్ ఫ్యాన్‌ను అయ్యాను. అభినందనలు' అని రజనీ ట్వీట్ చేశారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X