హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షంలో 9,292 మంది బతుకమ్మ ఆట: గిన్నిస్‌కెక్కింది (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పూలవనంగా మారిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పండుగ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. వాన చినుకులను సైతం లెక్కచేయక 9,292 మంది మహిళలు ఇరవై అడుగుల ఎత్తైన మహా బతుకమ్మ చుట్టూ ఆడి పాడి బతుకమ్మను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కించారు.

గిన్నిస్ కెక్కిన మహా బతుకమ్మ

గిన్నిస్ కెక్కిన మహా బతుకమ్మ

ముక్కోటి దేవతలు ఉయ్యాలో.. బంగారు రథమెక్కి ఉయ్యాలో.. అంటూ ఆడబిడ్డలు పాడిన పాట, జై తెలంగాణ నినాదాలు, పటాకుల మోతతో స్టేడియం దద్దరిల్లింది. శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన వైభవోపేతమైన బతుకమ్మ ఉత్సవంలో గిన్నిస్ రికార్డు వార్త ఉత్సాహాన్ని మిన్నంటేలా చేసింది.

ఓనంను మించింది

ఓనంను మించింది

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చూపించిన దీక్షాదక్షతలను తెలంగాణ మహిళలు మరోసారి లోకానికి చాటారు. 2015లో ఓనం పండుగ సందర్భంలో కేరళ వనితలు సాధించిన ప్రపంచ రికార్డును తెలంగాణ ఆడబిడ్డలు అధిగమించారు.

మధ్యాహ్నానికే వేలాది మహిళలు

మధ్యాహ్నానికే వేలాది మహిళలు

మధ్యాహ్నం మూడు గంటల సమయానికే స్టేడియం వేలాది మంది మహిళలతో కిటకిటలాడింది. చిన్నపిల్లలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులు, పండు ముత్తైదువలు క్రమశిక్షణతో బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నా నీటిలో పాదాలు మునిగిపోతున్నా, లయ తప్పకుండా అడుగులు వేశారు.

వర్షంలోను లెక్క చేయక గిన్నిస్

వర్షంలోను లెక్క చేయక గిన్నిస్

పదకొండు నిమిషాల 7 సెకన్ల పాటు రికార్డు స్థాయిలో బతుకమ్మ ఆటలు, పాటలు సాగాయి. గిన్నిస్ ప్రతినిధులు ఐదు నిమిషాలపాటు ఇరువై అడుగుల బతుకమ్మ చుట్టూ ఆటపాటలతో చుట్టూ తిరుగుతున్న తెలంగాణ ఆడబిడ్డలందరినీ స్టాప్‌వాచ్, ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా లెక్కించారు.

ఆడిన 9,292మంది మహిళలు

ఆడిన 9,292మంది మహిళలు

ఆరు వరుసలలో 9,292 మంది ఆడబిడ్డలు ఒకేసారి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఓనం రికార్డును అధిగమించినట్టు గిన్నిస్ ప్రతినిధుల పరిశీలనలో నమోదైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వచ్చిన ప్రతినిధులు జయసింహ, కొమరన్, శ్రీధర్ తెలంగాణ బతుకమ్మ పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం సంపాదించిందని ప్రకటించారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగకు గిన్నిస్ రికార్డులలో స్థానం లభించినట్టు తెలిపే ధ్రువపత్రాన్ని అతిత్వరలో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలియజేశారు.

20 అడుగుల బతుకమ్మ

20 అడుగుల బతుకమ్మ

20 అడుగుల భారీ బతుకమ్మ, 9,292 మంది తెలంగాణ ఆడపడచులు 40 దేశాలకు చెందిన 200 మంది విదేశీ వనితలు, జోరు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పూలపండుగలో పులకించి ఆడటం గమనార్హం.

వేలాది మహిళలు

వేలాది మహిళలు

స్టేడియంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ వేలాదిగా తరలివచ్చిన మహిళలు ఆడిపాడారు. మొత్తం 12 వేల మంది మహిళలు వచ్చారు. ఇందులో 10,029 మంది బతుకమ్మ ఆటకు సిద్ధమయ్యారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా 9,292 మంది మహిళలు బతుకమ్మ ఆడి గిన్నిస్‌ బుక్‌లో మహాబతుకమ్మకు చోటు దక్కించారు.

200 మంది విదేశీ మహిళలు

200 మంది విదేశీ మహిళలు

మహా బతుకమ్మ ఉత్సవాల్లో 40 దేశాల నుంచి వచ్చిన దాదాపు 200 మంది విదేశీ వనితలు పాల్గొని బతుకమ్మ ఆడారు. చీరలు కట్టుకొని లయబద్ధంగా నృత్యాలు చేస్తూ పూల దొంతరలకు పూజలు చేశారు. జడివానను కూడా లెక్క చేయకుండా గిన్నిస్‌ రికార్డు నమోదులో భాగస్వామ్యం అయ్యారు.

ప్రముఖులు

ప్రముఖులు

మిస్‌ ఇండియా ప్లానెట్‌ రష్మీ ఠాకూర్‌, సినీ నటి పూనం కౌర్‌, తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మిర్జా, ఒలింపిక్‌ పతక విజేత, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో పాటు పోలీసు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
The Telangana government on Saturday organised the traditional state festival of 'Bathukamma' on a grand scale at the Lal Bahadur stadium in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X