వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్ట్: గుజరాతీల్లో తగ్గిన అమెరికా విద్య మోజు.. ఆస్ట్రేలియా, కెనడాలవైపు చూపు

విదేశీయులకు జారీచేసే వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలన్న ఆకాంక్షలకు గుజరాతీలు తిలోదకాలు ఇస్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: విదేశీయులకు జారీచేసే వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలన్న ఆకాంక్షలకు గుజరాతీలు తిలోదకాలు ఇస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో అమెరికాలో విద్యాభ్యాసానికి దరఖాస్తు చేసుకున్న గుజరాతీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్, వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య 75 శాతం తగ్గిపోయిందని విదేశీ విద్యా కన్సల్టెంట్లు చెప్తున్నారు. అతి చౌక ఫీజులతో ఉన్నతవిద్యాభాసానికి అవకాశాలు ఉన్న కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల వైపు చూస్తున్నారు. అమెరికాలో మాదిరిగానే ఈ దేశాల్లోనూ పేరొందిన ఉన్నత విద్యా సంస్థలకు కొదవ లేకపోవడంతోపాటు తేలిగ్గా వర్క్ పర్మిట్ కూడా లభిస్తోంది.

ట్రంప్ ఆంక్షలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

ట్రంప్ ఆంక్షలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

అమెరికాలో విద్యాభ్యాసం చేయాలని భావించే విద్యార్థులు 45 శాతం తగ్గుముఖం పట్టింది. వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే ఆంక్షల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారని కన్సల్టెంట్లు చెప్తున్నారు. విద్యాభ్యాసం తర్వాత మూడేళ్లపాటు వర్క్ పర్మిట్ ఇస్తున్న కెనడా వైపు మొగ్గుతున్నారని మనీశ్ దయానీ తెలిపారు. కానీ ఇదే సమయంలో అమెరికాలో విద్యాభ్యాసం పట్ల విద్యార్థులను మళ్లించేందుకు యూనివర్సిటీలు ప్రయత్నిస్తున్నాయి. విద్యార్థుల్లో నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ చట్టాల ఆమోదానికి చాలా సమయం పడుతుందని నచ్చ చెప్పడానికి శతవిధాల యత్నిస్తున్నాయి.

విద్యార్థుల మనోభావాల్లో స్పష్టమైన మార్పు

విద్యార్థుల మనోభావాల్లో స్పష్టమైన మార్పు

అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కన్సల్టెంట్ సంస్థ ‘గ్లోబల్ రీచ్' అధినేత అనార్ పటేల్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని భావిస్తున్న విద్యార్థుల మనోభావాల్లో మార్పు కాన వస్తున్నదన్నారు. అమెరికా కంటే కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్ దేశాల వైపు మళ్లుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి 25 శాతం మంది మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంటే మిగతా 75 శాతం ఇతర దేశాల వైపు చూపుతున్నారని, ఆస్ట్రేలియాలో రెండేళ్ల వర్క్ పర్మిట్ కూడా అదనంగా లభిస్తుందని పిరమిడ్ కన్సల్టెంట్స్ ప్రతినిధి మనీష్ దయానీ పేర్కొన్నారు.

తక్కువ ఫీజులకే జర్మనీలో ఉత్తమ విద్య

తక్కువ ఫీజులకే జర్మనీలో ఉత్తమ విద్య

ఇటీవలి వరకు అమెరికాలో విద్యావకాశాలపై ఆశలు పెంచుకున్న నెహర్ పరిమో అనే విద్యార్థి.. తాజా పరిస్థితుల్లో తన మనస్సు మార్చుకుని ఇతర ప్రత్యామ్నాయాలపై ద్రుష్టిని కేంద్రీకరించానని తెలిపాడు. ‘ఇంతకుముందు అమెరికాలోని కాలేజీలకు దరఖాస్తు చేశా. కానీ అమెరికాలోని ప్రస్తుత పరిస్థితుల్లో జర్మనీలోని విద్యాసంస్థల్లో దరఖాస్తు చేశాను. అమెరికాతో పోలిస్తే జర్మనీలో చాలా తక్కువ ఖర్చు. విదేశీ విద్యార్థులకు జర్మనీ స్వాగతం పలుకుతున్నది' అని చెప్పాడు.

ఆందోళన కలిగిస్తున్న ట్రంప్ విధానాలు

ఆందోళన కలిగిస్తున్న ట్రంప్ విధానాలు

ఇంటర్ కల్చర్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహిస్తున్న అమెరికా ఫీల్డ్ సర్వీస్ 1915లో ఏర్పాటైంది. ఆ సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్, పెయిడ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. వారు ఇతర దేశాల్లోని విద్యా సంస్థలను ఎంపిక చేసుకోకుండా ప్రయత్నిస్తున్నా.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో తమ పిల్లల విద్య తదుపరి భవిష్యత్ జీవితంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అమెరికా ఫీల్డ్ సర్వీస్ అధికారి తెలిపారు.

అమెరికా కంటే ఆస్ట్రేలియా బెస్ట్

అమెరికా కంటే ఆస్ట్రేలియా బెస్ట్

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కంటే ఆస్ట్రేలియాకే విద్యార్థులను పంపడానికి ప్రయత్నిస్తున్నామని ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శైలేశ్ సేథ్ తెలిపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులంతా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని మానసికంగా సిద్ధం అయ్యారని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ అంశాల కంటే ఇటీవల అమెరికాలో భారతీయులపై ద్వేషపూరిత దాడుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Gujarati students are ditching US as a higher education destination, thanks to President Donald Trump’s talk of clamping down on immigrants and enforcing stricter visa regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X