చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి భక్తులతో పోటెత్తిన తిరుమల (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుమల‌: తిరుమల శ్రీవారి భక్తులతో పోటెత్తుతోంది. వరుస సెలవుల కారణంగా, వివాహాల కారణంగా తిరుమలకు భక్తుల సంఖ్య లెక్కకు మిక్కిలి పెరిగింది. గత నాలుగు రోజులుగా తిరుపతిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నాడు భక్తుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రధాన ఆలయ సముదాయం నుంచి భక్తుల క్యూలు మైళ్ల వరకు ఉన్నాయి.

సర్వదర్శనం కోసం భక్తుల పెద్ద యెత్తున క్యూలైన్లలో నించున్నారు. నడకదారిలో దైవ దర్శనానికి 30 గంటల సమయం పట్టింది. కాలిబాట యాత్రికులకు 16 గంటలు, రూ. 300లపై ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు పది గంటల సమయం పట్టింది. రద్దీ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 దర్శన టికెట్లను ఇవ్వడం ఆపేసింది. ఆదివారం ఉదయం నుంచే ఆ టికెట్ల జారీని ఆపేసింది. రూ.300 టికెట్ కింద సనివారంనాడు రికార్డు స్థాయిలో 21295 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు

సోమవారం కృష్ణాష్టమి కావడంతో భక్తుల సంఖ్య గణనీయంగానే ఉంది. దీంతో విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయాలని టిటిడి ఇవో ఎంజి గోపాల్ ఆదేశాలు జారీ చేశారు. భక్తల రద్దీ కారణగా టిటిడి ఆలయ డిప్యూటీ ఇవో సి. రమణ, అన్నదానం డిప్యూటీ ఈవో వేణుగోపాల్, ఆరోగ్యాధికారి వెంకరమణ స్వయంగా క్యూలైన్లను పర్యవేక్షించారు.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

వరుస సెలవులు, వివాహ ముహూర్తాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లు మైళ్ల పొడుగునా ఉన్నాయి.

తిరమలలో భక్తుల రద్దీ

తిరమలలో భక్తుల రద్దీ

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న భక్తుల సంఖ్య గత నాలుగు రోజులుగా గణనీయంగా ఉంది. దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. మెళ్ల పొడుగునా భక్తులు బారులు తీరారు.

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ...

శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద యెత్తున తిరుమలకు చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి దర్సనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా టిటిడి అధికారులు స్వయంగా క్యూలైన్లను పర్యవేక్షించారు.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలకు వెంకటేశ్వర స్వామి భక్తులు పోటెత్తారు. మైళ్ల పొడుగునా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారు ఓపిగ్గా లైన్లలో నించున్నారు.

English summary

 The hill town of Tirumala has been witnessing heavy pilgrim rush owning to series of Holidays and auspicious marriage muhurats in the abode of Lord Venkateswara from the past three days and touched the pinnacle on Sunday with all the serpentine queue lines extending up to few miles from the main temple complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X