వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది మందికొకరిలో ఊబకాయం: భారత్‌కూ సమస్యాత్మకమే

ఇటు ఎండుతున్న డొక్కలు.. అటు భారీకాయాలతో కదలలేని మనుషులు.. ఊబకాయం ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరవు.. పేదరికం.. ఆకలితో అల్లాడే దేశాలు ఒకవైపు.. ఊబకాయులతో సతమతం అవుతున్న సమాజాలు మరోవైపు! ఇటు ఎండుతున్న డొక్కలు.. అటు భారీకాయాలతో కదలలేని మనుషులు.. ఊబకాయం ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారింది.

ప్రపంచంలో మూడో వంతు దేశాలు ఈ సమస్యతో అల్లాడుతున్నాయి. ఇదొక ప్రపంచ ఆరోగ్య సమస్యగా మారుతున్నదని తాజాగా ఒక అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. క్రమక్రమంగా భారీ కాయంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచంలో ఇప్పుడు ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయులు ఉన్నారంటే సమస్య ఎంత తీవ్రంగా తయారైందీ అర్థమవుతుంది. దీనికి ఆహారపు అలవాట్లు మారుతుండడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, నిత్యజీవితంలో పెరుగుతున్న ఒత్తిడి ప్రధాన కారణాలని ఈ అధ్యయన సారాంశం.

మనదేశంలోనూ ఊబకాయం ఇప్పుడిప్పుడే సమస్యాత్మకంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య పెరుగుతోంది. మన దేశంలో 1.44 కోట్లమంది చిన్నారులు అధిక బరువుతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఊబకాయం విషయంలో చైనా తర్వాత మనదే అగ్రస్థానం ఆదేశం, ఈ దేశం అని ఏదీ లేదు. అమెరికా నుంచి ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, చైనా వరకూ.. దాదాపుగా అన్ని దేశాల్లో ఈ సమస్య పెరిగి పెద్దదవుతోంది.

73 దేశాల్లో ఊబకాయం సమస్య అధికం

73 దేశాల్లో ఊబకాయం సమస్య అధికం

ఊబకాయంపై 1980 నుంచి 2015 మధ్యకాలంలో 195 దేశాల్లోని స్థితిగతులను నిపుణులు అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌' వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లమంది పెద్దలు, పిల్లలు అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గత 35 ఏళ్లలో ఊబకాయుల సంఖ్య పెరుగుదల రేటు 73 దేశాల్లో అధికంగా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌, బల్గేరియా, కాంగో దేశాల్లో మాత్రమే ఈ సమస్య తక్కువగా ఉన్నది.

పిల్లల్లో ఐదు శాతం మంది ఊబకాయులే

పిల్లల్లో ఐదు శాతం మంది ఊబకాయులే

ఊబకాయం అమెరికాను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊబకాయుల్లో 13 శాతం అమెరికాలోనే ఉన్నారు. పెద్దల్లో ఈ సమస్య అధికంగా ఉన్న దేశం ఈజిప్టు. ఇక్కడ 35శాతంమంది పెద్దలు ఊబకాయులే. వియత్నాం, బంగ్లాదేశ్‌లలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. పిల్లల్లో ఊబకాయం చైనాలో పెద్ద సమస్య. ఆ దేశంలో 1.5 కోట్లమంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు ఉన్నవారు 2015లో ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లమంది ఉండగా, అందులో 71 కోట్లమంది వూబకాయుల కిందకు వస్తారని ఈ అధ్యయనం తెలిపింది. పిల్లల్లో 5 శాతం, పెద్దల్లో 12 శాతం ఇటువంటి వారు ఉన్నారు.

మూడు దశాబ్దాల్లో రెట్టింపైన సమస్య

మూడు దశాబ్దాల్లో రెట్టింపైన సమస్య

పిల్లల్లో ఊబకాయం చైనాలో అధికంగా ఉంటే తర్వాత స్థానంలో ఉన్నది భారతదేశమే. చైనాలో 1.53 కోట్లమంది, భారత్‌లో 1.44 కోట్లమంది పిల్లలు ఊబకాయంతో బాధ పడుతున్నారు. ఈ సమస్య గత మూడు దశాబ్దాల్లో రెట్టింపు కాగా, పెద్దల్లో ఇది మూడింతలు అధికమైంది. కాకపోతే ఎన్నో పశ్చిమ దేశాలతో పోల్చినప్పుడు మనదేశంలో ఈ సమస్య అంత ప్రమాదకరమైన స్థాయికి చేరకపోవటం కొంత ఊరట. కాకపోతే దీన్ని నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధుమేహానికీ కారణం ఊబకాయమే

మధుమేహానికీ కారణం ఊబకాయమే

ఊబకాయంతో బాధపడుతున్న వారికి ప్రధానంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్య గుండెజబ్బు. అధిక బరువు, ఊబకాయంతో కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలతో ఏటా చనిపోతున్న వారిలో 40 శాతం మంది గుండెజబ్బుతో మృత్యువాత పడుతున్నారు. కొందరికి హఠాత్తుగా గుండెపోటు వస్తుంటే, మరికొందరికి అధిక రక్తపోటు, మధుమేహంతో కూడిన గుండెజబ్బు సమస్యగా మారుతున్నాయి. కొన్ని దేశాల్లో అధిక బరువు ఉన్న మహిళల్లో రొమ్ము కేన్సర్‌ సమస్య కనిపించినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

శారీరక శ్రమ లేమి.. ఒత్తిళ్లు ఇలా

శారీరక శ్రమ లేమి.. ఒత్తిళ్లు ఇలా

పెరిగిపోతున్న పట్టణీకరణ, ఒత్తిడి, వ్యాయామం- శారీరక శ్రమ లేకపోవటం ఊబకాయ సమస్యకు ప్రధాన కారణాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా దీనికి తావు ఇస్తున్నాయి. అధిక శక్తి గల ఆహార లభ్యత పెరగటం, అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవటంతో ఎక్కువమంది వూబకాయులుగా తయారవుతున్నారు. ప్రజల ఆదాయాలతో దీనికి పనిలేదని నిర్ధారణ అయింది. ధనికులతో పాటు తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారిలోనూ అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నవారు ఉంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అధికంగా, వెనుకబడిన దేశాల్లో తక్కువగా ఊబకాయం సమస్య కనిపిస్తోంది.

English summary
India has the second highest number of obese children in the world after China, according to an alarming study which found that 14.4 million kids in the country have excess weight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X