వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ షాకిస్తే...: ఐటి ప్రొఫెషనల్స్‌కు బోలేడు ఆఫర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో విదేశీయులు, ప్రత్యేకించి భారతీయ సైన్స్ విద్యార్థుల ఊహలు, ఆకాంక్షలకు బంధం పడుతోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో విదేశీయులు, ప్రత్యేకించి భారతీయ సైన్స్ విద్యార్థుల ఊహలు, ఆకాంక్షలకు బంధం పడుతోంది. విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో ఉన్నతవిద్యాభ్యాసం కోసం ప్రణాళికలు వేసుకునే భారత సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు ట్రంప్ విధానాలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులు తమ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి) పీరియడ్ ట్రంప్ తగ్గిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 1.6 లక్షల మంది స్టెమ్ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మూడేళ్ల పాటు విద్యార్థి వీసాపై పనిచేసుకునే అవకాశం ఉంది. ఈ మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత మరో ఏడాది పాటు ఒపిటి పీరియడ్ పొడిగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతినిస్తూ జారీ చేసిన ఆదేశాలు విదేశీయులు, ప్రత్యేకించి భారతీయ నిపుణులను అమెరికాలో అవకాశాలు ఆకర్షించాయి.

తరుచుగా పనిచేస్తూ అనుభవం గడిస్తూ ఉన్న విద్యార్థులు తమకు అమెరికాలోని కంపెనీలు హెచ్ 1 బీ వీసా కల్పిస్తూ ఉద్యోగాలిస్తాయని భారతీయ యువత ఆశించారు. తద్వారా ఒపిటి పీరియడ్ తదనంతరం హెచ్ 1 బీ వీసాతోపాటు కొనసాగింపుగా గ్రీన్ కార్డు పొందడం మార్గంగా భావిస్తూ ముందుకు సాగారు. కానీ ప్రస్తుతం ట్రంప్ ఆదేశాలతో వారి అవకాశాలకు గండి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా పలు దేశాలు పుష్కల అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఐర్లాండ్ ‘స్టే’ బ్యాక్ పాలసీ

ఐర్లాండ్ ‘స్టే’ బ్యాక్ పాలసీ

విదేశీయులకు విద్యాభ్యాసం, ఉద్యోగావకాశాల మెరుగుదలకు ఐర్లాండ్ ప్రభుత్వం గత వారం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది నుంచి రెండేళ్ల పాటు తమ దేశంలో కొనసాగేందుకు ‘స్టే బ్యాక్ ఆప్షన్' కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐర్లాండ్‌లో ఉన్నత విద్యాభ్యాసం తర్వాత ప్రాక్టికల్ పిరియడ్‌లో అనుభవం గడించేందుకు, విభిన్నమైన రంగంలో ఉద్యోగం పొందేందుకు సాఫ్ట్‌వేర్, బయో ఫార్మా, ఇంజినీరింగ్, ఐసిటి, ఫైనాన్స్ తదితర రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐర్లాండ్‌లోని ఆర్థికాభివ్రుద్ధి సంస్థ ‘ఇండియా అండ్ సౌత్ ఆసియా ఎంటర్ ప్రైజెస్ ఐర్లాండ్' డైరెక్టర్ రోరీ పవర్ తెలిపారు.

ఐర్లాండ్‌లో విద్యా, పరిశోధనా వసతులు

ఐర్లాండ్‌లో విద్యా, పరిశోధనా వసతులు

2015లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐర్లాండ్‌లోని అత్యున్నత విద్యాసంస్థల్లో చేరిన వారు రెండు వేల మందికి పై చిలుకే ఉంటారు. అది 2016లో కనీసం 10 శాతం పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్ల స్టే బ్యాక్ గ్రాడ్యుయేట్ వీసా విధానాన్నిఅమలుచేస్తూ ఐర్లాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులను గణనీయ స్థాయిలో ఆకర్షిస్తుందని డుబ్లిన్ ట్రినిటి కళాశాల స్టూడెంట్స్ రిక్రూట్ మెంట్ మేనేజర్ డెక్లాన్ కూగాన్ చెప్పారు. దీనికి తోడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, పరిశోధన వసతులు, ఉద్యోగావకాశాలు కలిగి ఉండటం అదనపు ఆకర్షణగా ఉన్నది.

ఓపీటీని ట్రంప్ తిరగదోడితే ప్రత్యామ్నాయాలే

ఓపీటీని ట్రంప్ తిరగదోడితే ప్రత్యామ్నాయాలే

కేవలం పీజీ పూర్తి చేసిన భారతీయ ఇంజినీర్లు, టెక్కీలు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మాస్టర్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకే ఒపిటి ఎక్స్‌టెన్షన్ ఇస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆదేశాలిచ్చారు. దీని కారణంగానే 2016లో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం పేరు నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల్లో 83 శాతం మంది ‘స్టెమ్ ప్రోగ్రామ్' ఆప్షన్ ఎంచుకున్నారని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ స్టడీస్ కెరీర్ సంస్థ ‘ఇంటర్ఎడ్జ్' సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదానా తెలిపారు. ఒకవేళ విద్యార్థుల చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌కు పరిమితులు విధించడంతోపాటు ఓపీటీ ఎక్స్‌టెన్షన్ విధానాన్ని తిరగదోడితే మాత్రం అమెరికాలో ఉన్నతవిద్యాభ్యాసం చేయాలని భావించే విద్యార్థులు తమకు సరైన ప్రత్యామ్నాయం వైపు వెళతారని రాహుల్ చౌదానా ఆందోళన వ్యక్తంచేశారు.యూరోపియన్ యూనియన్ సభ్య దేశంగా ఐర్లాండ్ కేవలం ఇంగ్లిష్ మాట్లాడే దేశం మాత్రమే కాదు. ఇంగ్లిషేతర భాష మాట్లాడే వారికి ప్రత్యామ్నాయ కేంద్రంగా ఆవిర్భవిస్తోంది.

 జర్మనీలో 18 నెలల ఎక్స్‌టెన్షన్

జర్మనీలో 18 నెలల ఎక్స్‌టెన్షన్

తమ ఉన్నత విద్యాభ్యాసానికి అనువైన ఉత్తమమైన ఉద్యోగం కోసం ప్రయత్నించే గ్రాడ్యుయేట్లు బస చేసేందుకు వీసాను 18 నెలల పాటు కొనసాగిస్తూ జర్మనీ ఫెడరల్ విదేశాంగశాఖ అనుమతి ఇచ్చింది. విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నతర్వాత వారంతా పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు కల్పించేందుకు ఈ వీసా గడువు పొడిగించారని అక్కడ మూడేళ్లుగా జర్మనీలో లైఫ్ సైన్సెస్‌లో మాలిక్యూలర్ విభాగంలో పిజి కోర్సు విద్యాభ్యాసం చేస్తునన మాధురి సత్యనారాయణ రావు తెలిపారు.

జర్మనీలో ఐటీ, ఇంజినీరింగ్ కోర్సులకు

జర్మనీలో ఐటీ, ఇంజినీరింగ్ కోర్సులకు

ప్రస్తుతం ఆమె ఉత్తర జర్మనీకి చెందిన స్చెవెరిన్ అనే టెక్నాలజీ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీసా ఎక్స్‌టెన్షన్ కొనసాగిస్తూ జర్మనీ తీసుకున్న నిర్ణయం వల్లే ఆమె ఆ దేశంలోనే ఉండాలని ఎంచుకున్నారు. జర్మనీలో ఐటీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాధురి సత్యనారాయణ రావు తెలిపారు. అమెరికాలో భారతీయ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు కల్పిస్తున్నతదుపరి దేశంగా ఉన్నది.

అపరిమిత వర్క్ అండ్ రెసిడెంట్ పర్మిట్

అపరిమిత వర్క్ అండ్ రెసిడెంట్ పర్మిట్

ఉన్నత విద్యాభ్యాస అవకాశాల తర్వాత ఇక తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం పుష్కల అవకాశాలు కల్పించిన జర్మనీ అపరిమితమైన వర్క్ అండ్ రెసిడెంట్ పర్మిట్‌తోపాటు ‘ఈయూ' బ్లూ కార్డు జారీ చేస్తున్నది. 2015 - 16లో జర్మనీలో ఉన్నతవిద్యాభ్యాసం కోసం 14 వేల మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకుంటే వారిలో 83 శాతం మంది స్టెమ్ ప్రోగ్రామ్ ఎంచుకున్నారు.

అనుభవం సాధనకు ఫ్రాన్స్

అనుభవం సాధనకు ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లోని బిజినెస్, ఇంజినీరింగ్ స్కూళ్లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు వర్క్ అనుభవం సాధించేందుకు వీలుగా రెండేళ్లుగా ఆ దేశంలోనే కొనసాగేందుకు ఫ్రాన్స్ అనుమతినిచ్చింది. ప్రతి ఏటా నాలుగు వేల మంది భారత విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం వస్తున్నారు. 2020 నాటికి అది పది వేల మందికి చేరుకుంటుందని భావిస్తున్నారు.

టాలెంట్ పాస్ పోర్ట్

టాలెంట్ పాస్ పోర్ట్

భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం కౌన్సిలర్ అన్నె లారె డెసోన్ క్వేర్స్ మాట్లాడుతూ తాము అత్యంత ఆకర్షణీయమైన వీసా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యభ్యాసానికి ఆకర్షించేందుకు వీలుగా వీసా నిబంధనలను సరళతరం చేశామన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసేందుకు వచ్చిన విద్యార్థులకు ఐదేళ్ల టూరిస్టు, బిజినెస్ వీసా మంజూరు చేస్తున్నామని అన్నారు. దీనికి అదనంగా దీర్ఘ కాలిక నివాసం కోసం ‘టాలెంట్ పాస్‌పోర్ట్' జారీ చేసినట్లు చెప్పారు. దీనికి నాలుగేళ్ల గడువు ఉంటుంది. అత్యున్నత నిపుణులైన భారతీయ ఇంజినీర్లు తమ దేశంలో శాశ్వత నివసించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

ఆస్ట్రేలియాలో ఆరేళ్ల వీసా

ఆస్ట్రేలియాలో ఆరేళ్ల వీసా

జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతోపాటు భారతీయ విద్యార్థులకు మరో ఆకర్షణీయ ఉన్నత విద్యా కేంద్రం ఆస్ట్రేలియా. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పొందేందుకు వచ్చే విద్యార్థులకు ఆస్ట్రేలియా కనీసం రెండేళ్ల గడువుతో కూడిన వీసా జారీ చేస్తున్నది. తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ కోసం రెండేళ్లు, రీసెర్చ్ కోసం మరో నాలుగేళ్ల వీసా జారీ చేస్తోంది. తద్వారా వారు శాశ్వత నివాసం పొందేందుకు వెసులుబాటు లభిస్తున్నది. దీనివల్ల చాలా మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందే దిశగా ఆ దేశంలో విద్యాభ్యాసానికి వెళుతున్నారు.

ఆస్ట్రేలియాలో శాశ్వత వీసా కోసం

ఆస్ట్రేలియాలో శాశ్వత వీసా కోసం

కొందరు విద్యార్థులు నేరుగా ఆస్ట్రేలియాలో శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. 54 వేల ఆస్ట్రేలియా డాలర్ల వేతనం గల కనీస స్థాయి ఉద్యోగాలు పొందేందుకు నేరుగా వర్క్ పర్మిట్ పొందొచ్చు. దీనికి తోడు శాశ్వత నివాసం పొందేందుకు భారతీయ స్టెమ్ విద్యార్థులకు అదనపు పాయింట్లు జోడిస్తున్నదని గ్లోబల్ రీచ్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సంస్థ ఎండీ రవి లోచన్ సింగ్ చెప్పారు.

ఉపాధికి అత్యుత్తమ కేంద్రం

ఉపాధికి అత్యుత్తమ కేంద్రం

వీటన్నింటి కంటే భారతీయ విద్యార్థులను భారీగా ఆకర్షిస్తున్న దేశాల్లో కెనడా ఒకటి. పీజీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు మూడేళ్ల పాటు వర్క్ పర్మిట్ పొందేందుకు కెనడా వెసులు బాటు కలిగిస్తున్నది. గతేడాది కెనడా 40 వేల మందికి పైగా విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, విద్యార్థి విసాలు జారీ చేసింది. శాశ్వత నివాసం పొందేందుకు కెనడా అత్యుత్తమ కేంద్రం అనడంలో సందేహమే లేదు.

English summary
Indian science, technology, engineering and mathematics (STEM) students planning an overseas higher education are losing sleep over reports that US President Donald Trump may roll back the extension of optional practical training (OPT).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X