చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుషారుగా సాగిన జల్లికట్టు: కోడిపందేలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండగను పురస్కరించుకుని జల్లికట్టు, కోడి పందేల ఆటలు కోలాహలంగా సాగాయి. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల శుక్రవారం జల్లికట్టు ఉత్సాహంగా సాగింది. చంద్రగిరిలో నిర్వహించిన జల్లికట్టులో యువకులు హుషారుగా పాల్గొన్నారు. కడనత్తం వద్ద ఎస్‌ఐ లాఠీ చార్జి చేయడంతో ప్రజలు ఆయనపై తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్తం ఏర్పడింది. పెద్దలు జోక్యం చేసుకుని పండగ వాయిదావేశారు.

చంద్రగిరి మండలంలోని ఆరేపల్లి రంగంపేటలో కోడి గిత్తల పందేలు అత్యంత జోరుగా, హుషారుగా సాగాయి. రామిరెడ్డిపల్లిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కోడి గిత్తల పందేలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా రామిరెడ్డి పల్లి, అనంతరం పుల్లయ్య గారి పల్లిలలో ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

మధ్యాహ్నం 1 గంట సమయంలో రంగంపేటలో పాడి రైతులు భక్తి శ్రద్ధలతో సత్తెమ్మ, కాటమరాజు శిలా విగ్రహాలకు పూజలు చేసి సారెలు బహుకరించారు. రంగంపేటలో కోడిగిత్తలకు కొమ్ములు జువ్వి, వాటికి పలక కట్టి ముక్కతాడ్లు తెంచి డప్పుల వాయిద్యాలతో యాదవ వీధిలో ఉరకలెత్తించారు. ఒక్కొక్క దొడ్డిగా వదులుతూ వచ్చారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన యువకులు కోడి గిత్తల పరుగులకు కళ్లెం వేసి వాటికి అలంకరించిన కానుకలను చేకిక్కించుకోవాలనే తపనతో ఎద్దుల వెంట పరుగులు తీశారు.

జల్లికట్టు

జల్లికట్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండగను పురస్కరించుకుని జల్లికట్టు, కోడి పందేల ఆటలు కోలాహలంగా సాగాయి.

జల్లికట్టు

జల్లికట్టు

చిత్తూరు జిల్లాలో పలుచోట్ల శుక్రవారం జల్లికట్టు ఉత్సాహంగా సాగింది.

జల్లికట్టు

జల్లికట్టు

చంద్రగిరిలో నిర్వహించిన జల్లికట్టులో యువకులు హుషారుగా పాల్గొన్నారు.

జల్లికట్టు

జల్లికట్టు

కడనత్తం వద్ద ఎస్‌ఐ లాఠీ చార్జి చేయడంతో ప్రజలు ఆయనపై తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్తం ఏర్పడింది. పెద్దలు జోక్యం చేసుకుని పండగ వాయిదావేశారు.

జల్లికట్టు

జల్లికట్టు

చంద్రగిరి మండలంలోని ఆరేపల్లి రంగంపేటలో కోడి గిత్తల పందేలు అత్యంత జోరుగా, హుషారుగా సాగాయి. రామిరెడ్డిపల్లిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కోడి గిత్తల పందేలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

కోడి పందేలు

కోడి పందేలు

సంక్రాంతి పండగ సందర్భంగా యలమంచిలి, పోడూరు మండలాల్లో బుధవారం జోరుగా కోడిపందాలు నిర్వహించారు.

కోడి పందేలు

కోడి పందేలు

ప్రతి ఏటా మాదిరిగానే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలీసులు పందాలు వేయకుండా హడావుడి చేసి పందాలు మొదలయ్యే సరికి అదృశ్యమయ్యారు.

కోడి పందేలు

కోడి పందేలు

ఈ పందాల్లో జూదం, గుండాట, బిర్యాని, మాంసం పకోడి, చాటుమాటుగా మద్యం అమ్మకాలు జరిగాయి.

కోడి పందేలు

కోడి పందేలు

రాత్రి సమయంలో కూడ ఫ్లడ్ లైట్ల వెలుగులో పందాలు నిర్వహించారు. చిన్నపిల్లలు కూడ కోళ్లతో రావడం విశేషం.

కోడి పందేలు

కోడి పందేలు

కలగంపూడి, యలమంచిలి, మట్లపాలెం, కట్టుపాలెం, కొంతేరు, బూరుగుపల్లి, కాజ గ్రామాల్లో, పోడూరు మండలంలోని పెనుమదం, గుమ్ములూరు, వద్దిపర్రు, పోడూరు, కవిటం, జిన్నూరు, పట్టపర్రు, వేడంగి, జగన్నాధపురం, పండితవిల్లూరు, తూర్పుపాలెం గ్రామాల్లో పందాలు నిర్వహించారు.

English summary
Jallikattu held at Rangampeta in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X