వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిశోధనలకు గ్రహణం: ఆ దొరసాని పిచ్చికుక్క కరిచి..

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిలిన జానపద విజ్ఝానం పీఠం ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. దాన్ని పట్టించుకున్నవారు లేరు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ :సమాజపు గత వైభవాలు, జీవన విధానాలు, వస్తువులు, సంఘటనలు, అనుభవాలు జాతరలు, కళలు, కళా రూపాల విశేషాలను సేకరించి భావి తరాలకు అందించే అద్భుత వేదికగా నగరంలోని జానపదగిరిజన విజ్ఞాన పీఠం గుర్తింపుపొందింది.. పల్లె జీవన సౌందర్యాన్ని ఒడిసిప్టి అపురూప, అరుదైన కళా ఖండాలను సేకరించడమే కాకుండా వాిని ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. చరిత్రను, సంస్కృతిని పదిలిపరిచే విశిష్ఠ కృషి చేస్తున్న ఈ పీఠం ఆర్థిక లేమితో సమస్యల ఊబిలో కూరుకుపోయి ప్రాభవాన్ని కోల్పోతున్నది.

భవిష్యత్తు తరాల కోసం...

పల్లె తల్లి ఒడిలో నెలకొన్న అద్భుత అంశాలు, సంస్కృతీ, సంప్రదాయపు ఆనవాళ్లను వరంగల్‌ జానపద విజ్ఞాన పీఠం పరిశోధించింది. కనుమరుగవుతున్న ఆశ్రిత కులాల కళారూపాలను, వారు ఎంచుకున్న పాలు, రాగి పలకలు, వాయిద్యాలు, ఇతర పరికరాలపై అధ్యయనం చేశారు. మాయమయ్యే థలో ఉన్న ఎన్నో కళారూపాలను సజీవంగా నిల్పింది. 1995లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ శాఖగా హన్మకొండ నయీంనగర్‌ ప్రాంతంలో అద్దె ఇంో్ల మొదలైన ఈ విజ్ఞాన పీఠం ఎన్నో పరిశోధనలు చేప్టింది. 2002లో హంటర్‌రోడ్డు సమీపంలోని సొంత భవనంలోకి మారింది. సేకరణ అధ్యయనం లక్ష్యంగా పరిశోధన కొనసాగింది.

సేకరించిన కళా రూపాల పాలు, వాయిద్యాలను ఇతర అరుదైన పరికరాలను పీఠంలోని విజ్ఞాన వస్తు ప్రదర్శన శాలలో నిల్వ చేశారు. కళారూపాలతో పాటు కళాకారుల సర్వే చేశారు. లెక్కకు మించి ఉన్న ఆశ్రిత కులాల కళారూపాలను సేకరించారు. ఆడియో, వీడియో డాక్యుమెంటేషన్‌ చేశారు. వీరి పరిశోధనలను తెలుసుకున్న ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆర్థిక చేయూత నందించడానికి ముందుకు వచ్చింది. దీంతో పరిశోధనల్లో వేగం పెరిగింది. ప్రాంతీయ జనాపద జీవన వనరుల అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు.

దీని ద్వారా మన పల్లెటూళ్ల పాటలను సేకరించి ఆడియో, వీడియో రూపంలో నిల్వ చేశారు. తెలంగాణలోని జాతరలు, పండుగల వివరాలను సైతం సేకరించి నిల్వ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కడప, చిత్తూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తృత రూపాల్లో సర్వే చేశారు. ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపు ప్రాంతాల్లో కోయ కొండరెడ్డి తెగల జీవన వైవిధ్యాలకు సంబంధించి బహుముఖ అంశాల సర్వే నిర్వహించారు. విశాఖపట్నం ప్రాంతంలోని 18 గిరిజన తెగల్లో 12 గిరిజన తెగలకు సంబంధించి సర్వే చేశారు. అన్నికీ మించి కొత్త పరిశోధనలకు ఉపయుక్తంగా ఉండేలా బిబిలోగ్రఫీ రూపొందించారు.

Janapada Girijana Vignana Peetham at Warangala in telanagana has been in a bad shape, as it was neglected

అలాగే వరంగల్‌ జిల్లాలో మొత్తం 19 గ్రామాలకు పూర్తిస్థాయిలో పరిశోధన చేశారు. గ్రామ నిర్మాణం, పర్యావరణం, పేర్లు, ప్రజలు, ఆహారం, వేష భూషణాలు, నిల్వ చేసుకునే పద్ధతులు, వృత్థి విజ్ఞానం, ఆటలు, వైద్యం, పండుగలు-దేవతలు, జీవిత చక్ర సంబరాలు, సాహిత్యం, కళలు, ఇల్లు నిర్మాణం, గృహ సంబంధ వస్తు సంస్కృతి, నమ్మకాలు లాిం అంశాలను ఎంచుకుని పరిశోధన చేసి ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలను సేకరించారు.

జానమ్మ దొరసాని ఎలా చనిపోయింది...

విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ దొరసాని తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆమె ఆకృత్యాలు అంతా ఇంతా కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి, జానమ్మ దొరసానిల పరిస్థితి ఏమిటన్నది చాలా మందికి తెలియదు. ఈ వివరాలను గ్రామ సర్వే పేరుతో చేప్టిన జానపద గిరిజన విజ్ఞాన పీఠం పరిశోధకులుసేకరించారు. దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి ఎంజీయంలో అనామకుడిగా చనిపోగా, జానమ్మ దొరసాని పిచ్చి కుక్క కరిచి పిచ్చిలేచి చనిపోయిందని తేల్చారు.

దుమ్ముకొట్టుకుపోతున్న అరుదైన పరికరాలు...

పరిశోధనల్లో సేకరించిన అరుదైన అంశాలు ప్రజలకు చేరు చేసే ప్రయత్నాల్లో వేగం తగ్గింది. విలువైన ఆదివాసీ, ఆశ్రిత కులాల పరికరాలు, వాయిద్యాలు మ్టి కొట్టుకుపోతున్నాయి. ఆధునక వసతులతో నిర్మించినట్లు చెప్ని విజ్ఞాన పీఠం భవనం సైతం మన్నిక లేకుండా పోయింది. అసలు భవనం అస్తిత్వం పైనే అనుమానాలు వ్యక్తమయ్యే స్థాయిలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయం నీడన సిబ్బంది విధులు నిర్వహించాల్సివస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత విజ్ఞాన పీఠం అద్భుతంగా అలరాడుతుందని ఆశపడ్డారు. రెండున్నర ఏళ్లవుతున్నా ఈ విజ్ఞానపీఠాన్ని కన్నెత్తి చూసిన నాధుడే లేడు.

English summary
Janapada Girijana Vignana Peetham at Warangala in telanagana has been in a bad shape, as it was neglected
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X