హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ రికార్డు కోసం ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా ఒకేచోట, ఒకేసారి పదిహేను వేల మంది మహిళలు బతుకమ్మ ఆడనున్నారు. ఈ మేరకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో శనివారం మహా బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు చేశారు.

 పదిహేను వేల మందితో బతుకమ్మ

పదిహేను వేల మందితో బతుకమ్మ


శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు రెండు గంటల పాటు పదిహేను వేల మంది బతుకమ్మ ఆడనున్నారు. స్వయం సహాయక బృందాల మహిళలు పదివేల మంది, ఇతరులు ఐదువేల మంది మొత్తం పదిహేను వేల మంది శనివారం బతుకమ్మ ఆడుతారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

 ఓనం ప్రపంచ రికార్డును అధిగమించేలా

ఓనం ప్రపంచ రికార్డును అధిగమించేలా

గతంలో ఓనం ప్రపంచ రికార్డుగా నమోదు అయింది. 5200 మంది మహిళలు ఓనం వేడుకల్లో పాల్గొనడం ప్రపంచ రికార్డు. ఇప్పుడు ఓనం రికార్డును తిరగరాసే విధంగా బతుకమ్మను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి స్వయం సహాయక బృందాల మహిళలు బతుకమ్మలతో ఎల్‌బి స్టేడియానికి చేరుకుంటారు.

 మధ్యలో 20 అడుగుల భారీ బతుకమ్మ

మధ్యలో 20 అడుగుల భారీ బతుకమ్మ


ఇప్పటికే 20 అడుగుల భారీ బతుకమ్మను మధ్యలో అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దాని చుట్టూ చిన్న బతుకమ్మలు ఉంటాయి. పదిహేను వేల మంది మహిళలు బతుకమ్మ ఆడే వేడుకలను సందర్శించేందుకు దాదాపు యాభైవేల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు.

 హాజరవుతున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు

హాజరవుతున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు కూడా శనివారం నాటి బతుకమ్మ వేడుకలకు హాజరవుతున్నారు. ఎల్‌బి స్టేడియంలో జరిగే బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కలెక్టర్ నిర్మల, పర్యాటక శాఖ ఎండి సుమిత్ సింగ్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.

English summary
LB Stadium geared to host Maha Bathukamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X