వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా సరిహద్దులో సైనికులతో మోడీ దీపావళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

షిమ్లా: ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నూర్‌ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను కలిశారు. సైనిక సిబ్బంది మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ సైనికులకు మిఠాయిలు తినిపించారు. వారితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ప్రధాని మోడీ 'జై జవాన్‌.. జై హింద్‌'.. అంటూ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు.

చిన్నారితో ఇలా..

చిన్నారితో ఇలా..

దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లతో మోదీ దీపావళి సంబరాలు జరుపుకోవడం తొలిసారి కాదు. గత రెండు దీపావళి వేడుకలను ఆయన సైనికులతోనే జరుపుకొన్నారు.

స్థానిక కుటుంబాలతో..

స్థానిక కుటుంబాలతో..

‘కుటుంబంతో పండగ జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. దీపావళి వేడుక కోసం నేను మీ దగ్గరకు వచ్చా. 2001లో గుజరాత్‌ భూకంప బాధితులతో దీపావళి వేడుకలు జరుపుకొన్నా. అవసరమైనప్పుడల్లా మన జవాన్లు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. జవాన్లకు మద్దతుగా కోట్లాది మంది దీపాలు వెలిగిస్తున్నారు. సినీనటులు, క్రీడాకారులు సహా అందరూ జవాన్లకు సందేశాలు పంపారు' అని సైనికులతో మోడీ చెప్పారు.

సైనికులతో..

సైనికులతో..

ప్రధాని అభ్యర్థిగా తన తొలి బహిరంగ సభలోనే ఒకే ర్యాంక్‌ ఒకే వేతనంపై హామీ ఇచ్చానని వెల్లడించారు. దివారం ఉదయం ఆల్‌ ఇండియా రేడియో మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఏడాది దీపావళిని జవాన్లకు అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

స్వీట్లు అందిస్తూ..

స్వీట్లు అందిస్తూ..

‘గత కొన్ని నెలలుగా మన దేశ జవాన్లు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. వారి పేరు మీద మనం ఈ ఏడాది దీపావళి చేసుకోవాలని' ఆయన మన్‌కీ బాత్‌లో అన్నారు.

మోడీకి స్వీట్ తినిపిస్తున్న సైనికుడు

మోడీకి స్వీట్ తినిపిస్తున్న సైనికుడు

ప్రతి పౌరుడు సైనికులను చూసి గర్వపడాలని ఆయన పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా స్వయానా మోడీ నేతృత్వంలోనే సందేశ్‌ 2 సోల్జర్స్‌ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. సైన్యాన్ని కీర్తిస్తూ పలువురు చేసిన సందేశాలను ఆయన రీట్వీట్‌ కూడా చేశారు.

 సైనికులకు స్ఫూర్తినిస్తూ..

సైనికులకు స్ఫూర్తినిస్తూ..

ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి పర్వదినం సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నూర్‌ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను కలిశారు. సైనిక సిబ్బంది మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ సైనికులకు మిఠాయిలు తినిపించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. వారిలో స్ఫూర్తినింపేలా ప్రసంగించారు.

English summary
Prime Minister Narendra Modi on Sunday celebrated Diwali with soldiers in a remote and strategic area in Himachal Pradesh, adjoining the Chinese border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X