వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రికి రాత్రే వారి ఖాతాల్లో 17 కోట్లు జమ అయ్యాయి...ఏం జరిగింది

రాత్రికి రాత్రే స్పెయిన్ లోని సెరిజేల్ డెల్ కాడెడో గ్రామస్తులంతా కోటీశ్వరులయ్యారు. ఈ గ్రామానికి చెందిన ఫెర్నాండేజ్ అనే వ్యక్తి తనకున్న ఆస్థిలో సగానికి ఎక్కువగా గ్రామస్థులకు రాసిచ్చాడు. దీంతో ఈ గ్రామ

By Narsimha
|
Google Oneindia TeluguNews

స్పెయిన్ : ఆ గ్రామస్థులంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఇదేదో సినిమాల్లో జరగడం సహజం, కాని, నిజజీవితంలో కూడ ఇదే తరహ ఒకటి స్పెయిన్ లో జరిగింది. ఓ పారిశ్రామికవేత్త ఉదాత్త నిర్ణయంతో ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కోటీశ్వరులుగా మారారు. తానుపుట్టిన గ్రామవాసులు కష్టాలు తీర్చేందుకు ఆయన తన ఆస్థిలో సగానికి ఎక్కువ భాగానికి గ్రామస్థులకు రాసిచ్చాడు.

స్పెయిన్ లోని సెరిజేల్ డెల్ కాడెడో అనే చిన్న పిల్లటూరు వాతావరణం ప్రస్తుతం మారిపోయింది. గతంలో ఈ గ్రామంలో ప్రతి దాదాపు అందరూ పేదవాళ్లే. అయితే ఓ పారిశ్రామికవేత్తన తీసుకొన్న నిర్ణయం ఈ గ్రామస్థులను ప్రతి ఒక్కరిని కోటీశ్వరులుగా మార్చేసింది. దీంతో ప్రస్తుతం ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ప్రతి ఒక్కరూ కూడ కోటీశ్వరులయ్యారు.

ఆంటోనినో ఫెర్నాండేజ్ అనే వ్యక్తి స్పెయిన్ లో కరోనా అనే బీర్లు తయారీ చేసే సంస్థకు యజమాని.ఆయన దాతృత్వం వల్లే ఈ గ్రామస్థులంతా రాత్రికే రాత్రే కోటీశ్వరులయ్యారు.ఫెర్నాండేజ్ ది కూడ ఇదే గ్రామం. చిన్నతనంలో చదివించే స్థోమత కూడ ఆయన తల్లిదండ్రులకు లేదు. ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. తన మాదిరిగా ఎవరూ కూడ ఇబ్బందులు పడకూడదని ఆయన భావించి తన ఆస్తిలో సగానికి పైగా భాగాన్ని తాను పుట్టిన గ్రామస్థుల కోసం ఆయన వీలునామా రాశాడు.

 over night 17 crores deposited in 150 accounts

పద్నాలుగేళ్ళ వయస్సులోనే ఫెర్నాండేజ్ అనే వ్యక్తి చదువును మానివేశాడు. బీర్ల కంపెనీలో పనిచేశాడు. అదే కంపెనీలో చాల కాలం పనిచేశాడు. తదనంతరం బీర్లు తయారుచేసే కంపెనీని ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీకి కరోనా అని పేరుపెట్టాడు. ఈ కంపెనీతో ఆయన వేల కోట్లు సంపాదించాడు. అయితే తన గ్రామ పరిస్థితుల్లో మార్పులు రాలేదని ఆయన భావించారు. తన గ్రామానికి ఏమైనా చేయాలని నిర్ణయించుకొన్నాడు.

తన ఆస్థిలో సగానికి పైగా ఆయన గ్రామస్థులకు రాసిచ్చాడు. ఈ ఏడాది ఆగష్టులో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత గ్రామానికి చెందిన నూట యాభై కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి 17 కోట్ల రూపాయాలు వారి ఖాతాల్లో జమఅయ్యాయి. రాత్రికి రాత్రే తమ ఖాతాల్లో డబ్బులు జమకావడంతో కల, నిజమా అని వారు కొంత షాక్ కు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని తమ గ్రామస్థుడి ఔదార్యాన్ని వారు ప్రశంసిస్తున్నారు.

English summary
fernodaze an owner of karona bees company. he is from serizel del kaded village in spain. when his childhood study stop because of financial status. he was join worker in beer company. years together he establish a karona beer company. before to die he decided to donate above half of the amount in his wealth his villagers. he dead in august this year. villagers get each and everyone 17 crores of rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X