వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిలో 44 అంతస్తులు: టీలో బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరంలో భారీ ఆకాశహార్మ్యాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. రాజధానిలోని చాలా భవనాలు కనీసం 44 అంతస్థులు కలిగి ఉంటాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు రాజధాని పైన బిల్డర్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ రెండు మార్గాలను పరిశీలిస్తున్నారని సమాచారం. ఆకాశహార్మ్యాలను నిర్మించి వాటిని మొత్తంగా ప్రభుత్వం తీసుకోవడం ఒకటైతే, వాటిలోనే రైతులకు, రాజధాని నిర్మాణ సంస్థకూ భాగస్వామ్యం ఇవ్వడం రెండోది. ఆయా భవనాలను మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటే రైతులు, బిల్డర్లకు ప్రభుత్వం మరొకచోట కమర్షియల్‌గా భవనాలను నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వనుంది.

అక్కడ రైతులు, బిల్డర్లు కూడా 44 అంతస్థుల్లో ఆకాశహార్మ్యాలను నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, విజయవాడ పరిసరాలు సిస్మిక్‌ జోన్‌ మూడులోకి వస్తాయంటూ పలువురు చేస్తున్న వాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, విజయవాడ పరిసరాల్లో ఇప్పటి వరకూ భూకంపాలు రాకపోవడాన్ని వివరిస్తూనే, అసలు రాజధాని ప్రాంతం సిస్మిక్‌ జోన్‌లోనే లేదని వాదనలు కూడా ఉన్నాయి.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఛత్తీస్‌గఢ్ రాజధాని నయారాయపూర్‌ని సందర్సించి, తిరిగి హైదరాబాదు బేగంపేట విమానాశ్రయంలో దిగిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.., అంతకుముందు నయా రాయపూర్‌లో బాబు, రమణ్ సింగ్‌లు భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

నయా రాయపూర్ నిర్మాణానికి భూసేకరణ జరిపిన తీరును పరిశీలించినట్లు చంద్రబాబు అక్కడే మీడియాతో చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా రాజధాని నిర్మాణానికి భూసేకరణ ఎలా జరపారో తెలుసుకున్నట్లు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాము రైతులతో పాటు ఇతర వర్గాలకు ఇబ్బంది కలగకుండా ఎపి రాజధాని నిర్మాణానికి భూసేకర చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఛత్తీస్‌గడ్ ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

వివిధ రంగాల్లో రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటాయని ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఛత్తీస్‌గడ్ ఏర్పాటైనప్పుడు ఎలా ఆకర్షించారనేది తాను అధ్యయనం చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాయపూర్‌ను అభివృద్ధి చేసిన తీరును పరిశీంచామని చంద్రబాబు అన్నారు. కొద్ది కాలంలోనే రాయపూర్ అభివృద్ధి చెందిందని ఆయన ప్రశంసించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎపి, ఛత్తీస్‌గడ్ మధ్య రోడ్డు, ఇతర రవాణా సౌకర్యాల ఏర్పాటుపై చర్చించామని చంద్రబాబు చెప్పారు. అన్ని వ్యవస్థల్లో సాంకేతిక పరిజ్జానాన్ని వినియోగించుకోవడం ద్వారా చత్తీస్‌గడ్‌లో అవినీతిని అరికట్టారని ఆయన చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

నరేంద్ర మోడీ అభివృద్ధి నమూనాను ఆయన ప్రశంసించారు. అన్ని అంశాలపై చర్చలు ఫలవంతమయ్యాయని చంద్రబాబు చెప్పారు. ఎపి కొత్త రాజధాని ఏర్పాటుపై పలు ప్రదేశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

English summary
chandra babu speaking to media after returning from chhattisgarh, at begumpet air port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X