వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాళీ!: ఆమెనెక్కించేందుకు పోలీస్ పాట్లు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఘనంగా నిర్వహించే సంక్రాంతి పండుగ కోసం ప్రజలు సొంతూళ్లకు వెళ్లారు.. వెళ్తున్నారు.

పిల్లలకు సెలవులు రావడటంతో కుటుంబ సమేతంగా ప్రజలు పల్లెలకు పయనమయ్యారు. గత వారం నుండే ప్రజలు పెద్ద సంఖ్యలో ఊరిబాటపట్టారు.

బుధవారం భోగి ఉండడంతో మంగళవారం భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. దీంతో రాజధాని హైదరాబాద్ ఖాళీగా మారింది. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి.

సంక్రాంతి

సంక్రాంతి

ముఖ్యంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ జంక్షన్, అసెంబ్లీ జంక్షన్, అమీర్‌పేట, మెహిదీపట్నం, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోని రోడ్లు ఖాళీగా కనబడుతున్నాయి.

సంక్రాంతి

సంక్రాంతి

మరోవైపు రాజధాని జనాలంతా ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు చేరడంతో కిటకిటాలడుతున్నాయి. ప్రయివేటు వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు.

సంక్రాంతి

సంక్రాంతి

ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, మహాత్మా గాంధీ, జేబీఎస్, ఉప్పల్ వద్ద బస్ స్టేషన్లు జనసంద్రంగా కనిపిస్తున్నాయి.

 సంక్రాంతి

సంక్రాంతి

బస్సులు, లారీలు, కార్లు ఇలా ఏది దొరికితే అది ఎక్కి ఊర్లకు వెళ్తున్నారు. నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్, వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ రింగు రోడ్డు, కరీంనగర్ వైపు వెళ్లాల్సిన బస్సులను జెబిఎస్ నుంచి నడిచేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 సంక్రాంతి

సంక్రాంతి

అక్కడ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పండక్కి ఊరెళ్దామనుకున్న ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు నిలువునా దోపిడీ చేస్తున్నాయి.

సంక్రాంతి

సంక్రాంతి


సామాన్య ప్రజలు రైళ్లు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుంటే, మధ్య తరగతి, ఆపై వారు ప్రైవేటు బస్సులు, కార్లను ఆశ్రయిస్తున్నారు.

 సంక్రాంతి

సంక్రాంతి

దీంతో ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు ప్రయాణికుల జేబులను గుల్లచేస్తున్నాయి. డిమాండ్‌ను బట్టి రెట్టింపు, అంతకు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నాయి.

సంక్రాంతి

సంక్రాంతి


సంక్రాంతి పండగ రద్దీని ముందుగానే గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు జనవరిలోనే 133 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు.

సంక్రాంతి

సంక్రాంతి

వీటికితోడు రద్దీ దృష్ట్యా బుధ, గురువారాల్లోనూ విజయవాడ - సికింద్రాబాద్, నాంపల్లి - కాకినాడ, కాచిగూడ - కాకినాడ మధ్య రెండు, రెండు చొప్పున ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

సంక్రాంతి

సంక్రాంతి

వీటికితోడు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అప్పటికప్పుడు ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. కాని రైళ్లు ప్రయాణికుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి.

సంక్రాంతి

సంక్రాంతి


రైలు ఫ్లాట్ ఫామ్ మీదకి వచ్చేలోగా ఎగబడి మరీ ఎక్కేందుకు ప్రయాణికులు విఫలయత్నం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు స్వల్పంగా పని చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

సంక్రాంతి

సంక్రాంతి

విజయనగరం, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, గన్నవరం, రాజమండ్రి, అమలాపురం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, ప్రకాశం వంటి దూర ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

సంక్రాంతి

సంక్రాంతి

ఆర్టీసీ రోజువారీ 3557 సర్వీసులకు తోడు సంక్రాంతి పండగకు 5560 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ అధికారంగానే 50 శాతం మేర అదనపు చార్జీలు వసూలు చేస్తోంది.

English summary
Over four lakh people left the twin cities, heading for their native places and different destinations for the Sankranthi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X