హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జోరువాన: తడుచుకుంటూనే యువతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో సోమవారం ఉదయం అకాల వర్షం కురిసింది. సూర్య ప్రతాపం రోజురోజుకి పెరగటంతో నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో ఉన్నట్టుండి నల్లటి మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం కురిసింది.

వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు తోడు కావటంతో పలుచోట్ల చిన్న చిన్న గ్లోసైన్ బోర్డులు విరిగిపడగా, మరికొన్ని చోట్ల చెట్లు కూడా నేలకొరిగాయి. శివార్లలోని హిమాయత్‌సాగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉదయం తొలుత కాసేపు వర్షం కురిసింది. ఆ తర్వాత పదకొండున్నర గంటల సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు గంటసేపు ఈ కుండపోత వర్షం కురిసింది.

18.50 మీ.మీల వర్షపాతం నమోదు

నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షం అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 18.50 మి.మీలుగా నమోదైనట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. అత్యల్పంగా రాజేంద్రనగర్‌లో 0.25 మి.మీలుగా నమోదైంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బాలానగర్ వంటి ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాకపోయినా, ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రాంతాల్లో తలెత్తిన ట్రాఫిక్ జామ్‌తో రాకపోకలకు అంతరాయమేర్పడింది.

జడివాన

జడివాన

నగరంలో సోమవారం ఉదయం అకాల వర్షం కురిసింది.

జడివాన

జడివాన

సూర్య ప్రతాపం రోజురోజుకి పెరగటంతో నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

జడివాన

జడివాన

ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో ఉన్నట్టుండి నల్లటి మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షం కురిసింది.

జడివాన

జడివాన

వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు తోడు కావటంతో పలుచోట్ల చిన్న చిన్న గ్లోసైన్ బోర్డులు విరిగిపడగా, మరికొన్ని చోట్ల చెట్లు కూడా నేలకొరిగాయి.

జడివాన

జడివాన

శివార్లలోని హిమాయత్‌సాగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉదయం తొలుత కాసేపు వర్షం కురిసింది.

జడివాన

జడివాన

ఆ తర్వాత పదకొండున్నర గంటల సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు గంటసేపు ఈ కుండపోత వర్షం కురిసింది.

జడివాన

జడివాన

బలమైన ఈదురుగాలు కూడా తోడుకావటంతో బంజారాహిల్స్, నానల్‌నగర్, రెడ్‌హిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.

జడివాన

జడివాన

నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు రహదార్లు చిన్నపాటి చెరువులను తలపించాయి.

జడివాన

జడివాన

ముఖ్యంగా ప్రతిరోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఆబిడ్స్, కోఠి, మాదాపూర్, కాచిగూడ, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.

జడివాన

జడివాన

ఖైరతాబాద్ నుంచి మాదాపూర్ వరకు, మెహిదీపట్నం నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్డు వరకు, మాసాబ్‌ట్యాంక్ నుంచి కోఠి వరకు దాదాపు గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయి.

జడివాన

జడివాన

ఇందుకు పలుచోట్ల రోడ్డుపై మొకాలిలోతు వరకు వర్షం నీరు నిలవటం ఓ కారణం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా గుంతలమయం కావటం, అందులో వర్షపు నీరు నిలవటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి.

జడివాన

జడివాన

సాయంత్రం 5 గంటల వరకు కూడా నిత్యం రద్దీగా ఉండే పలు జంక్షన్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ గాడిన పడలేదు.

జడివాన

జడివాన

మరికొన్నిచోట్ల ఇప్పటికే సిగ్నల్స్ మ్యానువెల్‌గా పనిచేస్తుండటంతో సోమవారం కురిసిన వర్షానికి సిగ్నల్స్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

జడివాన

జడివాన

దీంతో లక్డీకాపూల్ వంటి జంక్షన్లలో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది.

English summary
Sudden rain lashed the city on Monday morning bringing much needed respite to people from the sweltering heat. Though the sudden downpour lasted only for about an hour, waterlogged roads threw life out of gear in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X