హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

108 ఏళ్ల తర్వాత.. హైదరాబాద్ లో రికార్డు సెట్ చేసిన భారీ వర్షం (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చాలా ఏళ్ల తర్వాత విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా.. జలకళ సంతరించుకుంది. వాంగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టుల్లోకి నీరు భారీగా వచ్చి చేరడంతో.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసింది ప్రభుత్వం. ఇక రాజధాని హైదరాబాద్ లో 1908 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వర్షాపాతం నమోదవడం విశేషం.

108 ఏళ్ల తర్వాత..

108 ఏళ్ల తర్వాత..

1908 సెప్టెంబర్ లో 499 మి.లీ వర్షపాతం హైదరాబాద్ లో నమోదు కాగా, ప్రస్తుత సెప్టెంబర్ లో 407 మి.లీ వర్షపాతం నమోదయింది. గత 30 ఏళ్లలో కేవలం 132 మి.లీ సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైన తెలంగాణలో ఈ స్థాయి వర్షాలు ఒకింత నష్టాన్ని కూడా మిగిల్చాయి. చాలా చోట్ల పంట మునిగిన రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అల్పపీడన ప్రభావం

అల్పపీడన ప్రభావం

ఈ ఏడాది జూన్ లో ప్రారంభమైన రుతుపవనాల ప్రభావంతో జూలై, అగస్టు నెలలో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి రెండుసార్లు ఏర్పడడంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో గత దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో 407 మి.లీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో ఆదివారం నాడు ఉదయం వారిని రక్షించేందుకు చర్యలు చేపనట్టినట్టు సమాచారం.

మరో ఐదు రోజులు

మరో ఐదు రోజులు

శని, ఆదివారాల్లో ఉదయం పూట వాన కాస్త తెరిపి ఇవ్వడంతో.. జంట నగరాలు కాస్త కుదుటపడ్డాయి. అయితే మరో ఐదు రోజుల పాటు భారీ వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో.. నగర జీవులకు వాన భయం పట్టుకుంది. వాతావరణ శాఖ వెల్లడించినట్టుగానే శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో.. మరిన్ని భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

కొనసాగుతోన్న సహాయక చర్యలు :

కొనసాగుతోన్న సహాయక చర్యలు :

ఇక జలమయం అయిన పలు కాలనీల్లో.. ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నిజాంపేట, ఆల్విన్ కాలనీ, అల్వాల్ ప్రకాశ్ నగర్ లలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు.. వారికి ఆహారపు పదార్థాలను అందజేస్తున్నారు.

ఉధృతంగా మంజీరా

ఉధృతంగా మంజీరా



గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు మృత్యువాత పడగా.. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఇక మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఒడిశాకు చెందిన పలువరు భవన నిర్మాణ కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు.

అంతటా జలకళ

అంతటా జలకళ

ఓవైపు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు పూర్తిగా నిండి.. తెలంగాణ జలకళను సంతరించుకోగా.. మరోవైపు పంట మునిగిన రైతులు మాత్రం దు:ఖంలో మునిగిపోయారు. భారీ వర్షాలతో తెలంగాణ అంతా అతలాకుతలమైంది

నగరంలో సీజనల్ వ్యాధులు

నగరంలో సీజనల్ వ్యాధులు

భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. దీంతో నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఆసుపత్రి వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. ఇప్పటిదాకా 15 డెంగ్యూ, 158 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. వైరల్ ఫీవర్ తో బాధితులంతా ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. గత వారం రోజుల్లోనే 9వేల మంది సీజనల్ వ్యాధుల బారిన పడ్డారంటే పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.

English summary
The heavy rains created a record in hyderabad. After 1908, it is the highest rain fall recorded recently. On saturday 407m.l rain fall was recorded in city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X