వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోహ పురుషాంగం: అంగస్తంభనకు చెక్ పెట్టేందుకు సైంటిస్టుల ఆవిష్కరణ

పురుషుల్లో అంగస్తంభన సమస్యలను నివారించేందుకు గాను వేడి ద్వారా ఉత్తేజితమయ్యే ఓ తరహా లోహాన్ని తయారుచేశారు శాస్త్రవేత్తలు.

|
Google Oneindia TeluguNews

లండన్: పురుషుల్లో అంగస్తంభన సమస్యలను నివారించేందుకు గాను వేడి ద్వారా ఉత్తేజితమయ్యే ఓ తరహా లోహాన్ని తయారుచేశారు శాస్త్రవేత్తలు. కాగా, జీవితకాలంలో ఏదో ఒక దశలో చాలామంది పురుషులు అంగ స్తంభన సమస్యకు లోనవడం ఈమధ్యకాలంలో పెరుగుతోంది.

ఆల్కాహాల్ ఎక్కువగా సేవించడం.. ఎక్కువ ఒత్తిడికి లోనవడం వంటివి అంగస్తంభన సమస్యకు కారణాలుగా చెబుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టి పురుషుల్లో అంగస్తంభన సమస్యలను నివారించడానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ పరిశోధకులు ఈ లోహాన్ని కనిపెట్టారు. రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే ఈ లోహం 42సెంటిగ్రేడ్స్ కు వేడి చేయడం ద్వారా 8 ఇంచుల వరకు పెరిగే అవకాశముంటుంది.

Scientists develop metal penis to help men with erectile dysfunction

సర్జరీ ద్వారా పురుషాంగం వద్ద కోత పెట్టి ఈ లోహాన్ని అందులో అమరుస్తారు. రిమోట్ ద్వారా దీన్ని ఆన్ చేసినప్పుడు లోహం ద్వారా విద్యుత్ వేడి ఉత్పన్నమవుతుంది. తద్వారా పురుషాంగం పూర్తిస్థాయిలో స్తంభిస్తుంది. నితినోల్, అలోయ్, నికెల్, టైటానియం వంటి లోహ పదార్థాలను వినియోగించి దీన్ని తయారుచేశారు. ఇవి ఉష్టోగ్రతలను ప్రభావితం చేస్తాయి.

ప్రస్తుతానికి దీన్ని జంతువులపై ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు. త్వరలోనే మనుషుల్లోను ఇలాంటి చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న ఎంతోమంది పురుషుల సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆసిఫ్ మునీర్ అనే యూరాలజీ నిపుణుడు అభిప్రాయపడ్డాడు.

English summary
In an interesting new innovation, scientists have created a heat-activated metal penis to aide men with erectile dysfunction. Many men experience erectile dysfunction at some point in their lives, whether it comes from drinking too much, stress or simply getting older.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X