వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిటీలో సూపర్: జిల్లాల్లో షీ టీమ్స్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళలను వేధించే పోకిరీ రాయుళ్ల ఆట కట్టించడానికి హైదరాబాదు నగరంలో ప్రవేశపెట్టిన షీ టీమ్స్ మంచి ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాటిని దించారు. ఈ విషయాన్ని సీఐడీ డీజీ సత్యనారయణ్ బుధవారంనాడు వెల్లడించారు.

అకతాయిల నుంచి మహిళలు వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ఈషీ టీంలు పని చేస్తాయన్నారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ ,సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రవేశ పెట్టిన షీ టీం ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షీ టీంలను రంగంలోకి దించుతున్నట్లు ఆయన వెల్లడించా రు.

మహిళలు, విద్యార్థినుల రక్షణ విషయంలో కట్టుదిట్ట మైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాల మేరకు షీ టీంలను ప్రవేశ పెట్టినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వంద షీ టీంలు, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 60 షీ టీంలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ షీ టీంల ఇంచార్జ్‌ రమారాజేశ్వరీ సైబరాబాద్‌ షీటీం ఫలితాలను వివరించా రు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గత సంవత్సరం డిసెంబరు 24వ తేదిన షీ టీం బృందా లను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

పరిస్థితులను బట్టి..

పరిస్థితులను బట్టి..

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు అక్కడి పరిస్థి తులను బట్టి షీ టీంలను ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపరు. ఎక్కువ టీంలను తక్కువ టీంలను ఏర్పాటు చేసుకునే అధికారం ఆయా జిల్లాల ఎస్పీలకు ఉంటుందని సత్యనారాయణ చెప్పారు.

ఒక్కో టీమ్‌ ఇలా..

ఒక్కో టీమ్‌ ఇలా..

ఒక్కో షీ టీంలో ఒక ఎస్సై , ఒక ఎఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో మరో ఇద్దరు ఉంటారని సత్యనారాయణ తెలిపారు. వారి వద్ద ఒకటి పరిస్థితులను బట్టి రెండు కెమెరాలతో ఈ టీంలు పనిచేస్తాయన్నారు.

హాట్ స్పాట్స్‌పై దృష్టి

హాట్ స్పాట్స్‌పై దృష్టి

ఆయాజిల్లాలలో హట్‌ స్పాట్‌ల ను గుర్తించి షీ టీంలు ప్రత్యేక దృష్టి సారిస్తాయని సత్యనారాయణ చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

ఫోన్ చేయవచ్చు..

ఫోన్ చేయవచ్చు..

మహిళలు, విద్యార్థినిలు వారు తమ ఫిర్యాదులను నేరుగా కాని లేదంటే డయల్‌100 కుఫోన్‌ ద్వారా, పోలీసు ఫేస్‌బుక్‌లో, యాప్‌ లలో సమాచారం ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సత్యనారాయణ తెలిపారు.

వేధింపులు తగ్గాయి..

వేధింపులు తగ్గాయి..

షీ టీంలను ఏర్పాటు చేసినప్పటి నుంచి హైదరాబాద్‌ నగరంలో మహిళలపై వేధింపులు గణనీయంగాతగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తు న్నాయని సత్యనారాయణ చెప్పారు.

కెమెరాలో చిత్రీకరించి..

కెమెరాలో చిత్రీకరించి..

షీ టీంల ఇంచార్జ్‌ నగర పోలీసు కమిషనరేట్‌ నేర విభాగం అదనపు కమి షనర్‌ స్వాతిలక్రా మాట్లాడుతూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిని కెమెరాల ద్వారా చిత్రికరించి వారిని అక్కడికక్కడే పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలిస్తామ న్నారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నట్లు వివరించారు. కౌన్సిలింగ్‌ ఇచ్చిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాదులో 140 కేసులు

హైదరాబాదులో 140 కేసులు

హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు షీ టీంల ద్వారా 140 కేసలు నమోదు చేసినట్లు స్వాతి లక్రా తెలిపారు. ఇందులో 66 మంది మేజర్లు , 74 మంది మైనర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 64 పెట్టి కేసులు పెట్టినట్లు తెలిపారు.

కౌన్సెలింగ్‌తో పాటు జరిమానా

కౌన్సెలింగ్‌తో పాటు జరిమానా

74 మంది మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చామని స్వాతి లక్రా చెప్పారు. కేసులు పెట్టిన వారిలో 12 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని మిగితా వారికి జరిమానా విధించినట్లు స్వాతిలక్రా తెలిపారు.

సైబరాబాద్‌లో 60 షీటీంలు పని చేస్తున్నట్లు వెల్లడిం చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సైబరాబాద్‌ పరిధిలో 134 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో 121 పెట్టి కేసులు పెట్టినట్లు, 13 ఐపీసీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 179 మంది ఈవ్‌టీజింగ్‌ నిందితులను పట్టుకు న్నామన్నారు. ఇందులో 115 మంది మేజర్లు, 64 మంది మైనర్లు ఉన్నట్లు తెలిపారు. మేజర్లలో ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

64 మంది మైనర్లకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించారు.మహిళలపైఆకతాయిల వేధింపుల కు అడ్డుకట్ట వేయడానికి రాష్టవ్య్రాప్తంగా పట్టణాలలో బుధ వారంనుంచి షీ టీంలను రంగంలోకి దిగుతున్నాయి.

రాజధానిలో సత్పలితాలను ఇస్తున్న షీ టీంలను రాష్ట్రం లోని అన్ని జిల్లాలలోని ప్రధాన పట్టణాలకు విస్తరిస్తు న్నారు. ఈ ప్రత్యేక పోలీసు బృందాలు పోకీరీల భరతం పట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల డీఐజీ సూర్యనారాయణ,ఐపీఎస్‌ అధికారులు బాలనాగి దేవి,కల్పనానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Working in Hyderabad and Cyberabad commissionerate limits the She teams will be extended to districts in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X