న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధుకు కొత్త కోచ్: గోపీచంద్‌కు 'తెలంగాణ' షాక్, నేతల క్యూ(పిక్చర్స్)

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం సాధించిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆమెను పోటాపోటీగా సత్కరిస్తున్నాయి. సోమవారం తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఆమెను రాణిలా తీసుకెళ్లింది. అక్కడ సింధును, కోచ్ గోపీచంద్‌ను సన్మానించింది. మంగళవారం ఏపీ ప్రభుత్వం వారిని ఘనంగా సన్మానించనుంది.

ఇదిలా ఉండగా, గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కోచ్ గోపీచంద్‌కు షాకిచ్చారు. నిన్న సైనా నెహ్వాల్, నేడు పీవీ సింధు విజయం వెనుక కోచ్ గోపీచంద్ పాత్ర ఎనలేనిది. ఇలాంటి గోపీచంద్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ షాకిచ్చారు.

సింధునే కాకుండా గోపీచంద్ ఆమె లాంటి చాలామంది క్రీడాకారులను తీర్చిదిద్దారు. అకుంఠిత దీక్షతో సత్తా కలిగిన ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న గోపీచంద్‌కు గచ్చిబౌలి వేదికగా షాక్ తగలడం గమనార్హం.

గోపీచంద్, పీవీ సింధులను సన్మానించిన సమయంలో మహమూద్ అలీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... కోచ్‌గా గోపీచంద్ మెరుగ్గా రాణిస్తున్నారని కితాబిచ్చారు. పీవీ సింధుకు మాత్రం మరింత మెరుగైన కోచ్ కోసం వెతుకుతున్నామన్నారు.

పీవీ సింధు వద్దకు క్యూ

పీవీ సింధు వద్దకు క్యూ

సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధుకు, కోచ్ గోపీచంద్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం తెలిపేందుకు క్యూ కట్టిన నేతలు.

అట్టహాసంగా

అట్టహాసంగా

రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న పీవీ సింధు కోసం క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సింధు విజయ యాత్ర అట్టహాసంగా సాగింది.

దారి పొడవునా బాణసంచా

దారి పొడవునా బాణసంచా

దారి పొడవునా బాణ సంచాకాలుస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, జయహో సింధు అంటూ నినాదాలు చేశారు. అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ సింధు, కోచ్‌ గోపీచంద్‌ ముందుకు సాగారు.

ఇరు రాష్ట్ర నేతల స్వాగతం

ఇరు రాష్ట్ర నేతల స్వాగతం

పీవీ సింధుకు, కోచ్‌ గోపీచంద్‌కు సోమవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

 ఇరు రాష్ట్ర నేతల స్వాగతం

ఇరు రాష్ట్ర నేతల స్వాగతం

విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు సింధుకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

 జయహో సింధు

జయహో సింధు

ఆ తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది. శంషాబాద్‌, రాజేంద్రనగర్, ఆరాంఘర్‌ మీదుగా వూరేగింపు కొనసాగింది.

 జయహో సింధు

జయహో సింధు

శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లో వేలాది మంది విద్యార్థులు, కళాకారులు ప్రజలు,స్థానిక నేతలు అట్టహాసంగా స్వాగతించారు.

జయహో సింధు

జయహో సింధు

జాతీయ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, బాణసంచా కాలుస్తూ 'జయహో సింధు' అంటూ నినదించారు. దారిపొడవునా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారత్‌ మాతాకీ జై అంటూ నినదించారు.

 అభివాదం

అభివాదం

ఓపెన్ టాప్‌ బస్సులో సింధు, గోపీచంద్‌లు దారి పొడవునా ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దారి పొడవునా భారీ భద్రత ఏర్పాటు చేసిన అధికారులు ఊరేగింపు సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X