వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50నుంచి 25కు కుదింపు: తెలంగాణ 'పద్మ అవార్డు' సిఫారసు జాబితా రెడీ

జాబితాలో ప్రముఖ వాగ్గేయకారులు గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ ఒలింపిక్ రజత పతక విజేత పివి సింధులను పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆయా రంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులకు పద్మ అవార్డులను అందించాలన్న యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు 25మంది పేర్లతో ప్రభుత్వం ఇప్పటికే జాబితాను రూపొందించింది.

జాబితాలో ప్రముఖ వాగ్గేయకారులు గోరటి వెంకన్న, అందెశ్రీ, ఒలింపిక్ రజత పతక విజేత పివి సింధులను పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. గతేడాది ప్రభుత్వం 56మంది ప్రముఖులకు పద్మ అవార్డులను అందజేసిన సంగతి తెలిసిందే.

 గోరటి వెంకన్న:

గోరటి వెంకన్న:

అచ్చ తెలుగు జానపద గుబాళింపు గోరటి వెంకన్న. 'కంచె రేగి తీపివోలే లచ్చుమమ్మో..' అని ఆయన పాటెత్తుకుంటే.. శ్రోతలు సైతం ఉర్రూతలూగాల్సిందే. 'పల్లె కన్నీరు పెడుతుందో..' అంటూ ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లె జీవన విధ్వంసాన్ని ఆయన పాట కట్టిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

చెట్టు మీద.. పుట్ట మీద.. పిట్ట మీద.. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద.. వెంకన్న పాడిన పాటలు తెలుగు జనం గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.

అందెశ్రీ:

అందెశ్రీ:

'మాయమవుతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..' అంటూ వర్తమాన మనిషి పోకడను తన పాటలో అద్భుతంగా వ్యక్తీకరించారు అందెశ్రీ.

'జయ జయహే తెలంగాణ' అంటూ ఆయన రాసిన గేయం ఉద్యమ సమయంలో పది జిల్లాల ప్రజలను ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషించింది.కటిక పేదరికంలో పుట్టిన ప్రజా వాగ్గేయకారుడిగా మారిన అందెశ్రీ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయం.

సుద్దాల అశోక్ తేజ:

సుద్దాల అశోక్ తేజ:

పద్మ అవార్డు కోసం ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేరును కూడా ప్రభుత్వం సిఫారసు చేసింది. కేవలం సినిమాలే కాకుండా సామాజిక నేపథ్యంలోను సుద్దాల అనేక పాటలు రాశారు.తండ్రి సుద్దాల హన్మంతు వారసత్వాన్ని కొనసాగిస్తూ పాటలు రాయడంలో తనదైన ముద్ర వేయగలిగారు అశోక్ తేజ.

ఒలింపిక్స్ లో మెరిసిన పివి సింధు:

ఒలింపిక్స్ లో మెరిసిన పివి సింధు:

ఇంతింతై వటుడింతై అన్నట్టు.. సాధనకు పదునుపెట్టి ఒలింపిక్ విజేతగా నిలిచింది పివి సింధు. రియో ఒలింపిక్స్ బ్మాడ్మింటన్ లో రజత పతకం సాధించడం ద్వారా దేశం గర్వపడేలా చేసింది. ఒలింపిక్స్ లో మనదేశం నానాటికి తీసికట్టుగా తయారవుతున్న నేపథ్యంలో..సైనా నెహ్వాల్, సింధు లాంటి క్రీడాకారిణులు సత్తా చాటడం దేశం తలెత్తుకునేలా చేసింది.

సింధు తల్లిదండ్రులు ఆంధ్రా-తెలంగాణకు చెందినవారు కావడంతో.. ఇరు ప్రభుత్వాలు పోటీ పడి మరీ ఆమెకు ప్రోత్సహాకాలు అందజేశాయి. ఇప్పుడు పద్మ అవార్డు విషయంలోను రెండు ప్రభుత్వాలు పోటి పడుతున్నాయి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు సింధుకు పద్మ అవార్డు కోసం
సిఫారసు చేస్తున్నాయి.

గతంలో సిఫారసు చేసినవే:

గతంలో సిఫారసు చేసినవే:

తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం సిఫారసు చేస్తున్న పేర్లలో చాలామట్టుకు గత 2015-2016లో సిఫారసు చేసినవే ఉన్నాయి. వీటిల్లో చాలా పేర్లను కేంద్రం పక్కనబెట్టింది. దీంతో మరోసారి ఆ పేర్లను పద్మ అవార్డుల కోసం ప్రభుత్వం పంపనుంది.

విద్యావేత్త చుక్కా రామయ్య, జాతీయ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్(2004-2008), ఆర్థికవేత్త మరియు రచయిత డా.చెన్నమనేని హనుమంతరావు, కవి మరియు నవలా రచయిత ప్రొ.శివ్ కె.కుమార్ పేర్లను కూడా ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం పంపించనుంది.

గతేడాది ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో ప్రముఖ చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్ కు మాత్రమే పద్మశ్రీ వరించింది. మిగతా పేర్లను కేంద్రం పక్కనబెట్టింది. అంతకుముందు 2015లో లక్ష్మాగౌడ్ పేరును పక్కనబెట్టిన కేంద్రం 2016లో ఆయనకు పద్మశ్రీ ఇచ్చింది.

భారతరత్న, పద్మవిభూషణ్ కు సిఫారసు:

భారతరత్న, పద్మవిభూషణ్ కు సిఫారసు:

దివంగత భారత మాజీ ప్రధాని పీవి నరసింహరావుకు భారతరత్న ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్దాంతకర్తగా గొప్ప వ్యూహంతో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆచార్య జయశంకర్ కు పద్మవిభూషణ్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సిఫారసు చేస్తోంది.

సీఎం కేసీఆర్ ఆమోదం మేరకే మొత్తం 25మంది పేర్లతో ప్రభుత్వం పద్మ అవార్డు సిఫారసు జాబితాను తయారుచేసింది. గత రెండేళ్లలో పద్మ అవార్డుల కమిటీ పక్కనబెట్టిన పేర్లతో సహా మొత్తం 50మంది పేర్లతో జాబితా ఉండగా.. తుది జాబితాకు కేవలం 25మందినే సీఎం ఎంపిక చేశారు.

English summary
The Telangana state government has recommended 25 names for Padma awards this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X