విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ తీరంలో అస్త్రధారిణి జలప్రవేశం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భారత్ అమ్ముల పొదిలో మరో యుద్ధనౌక ‘అస్తధ్రారిణి' చేరింది. విశాఖలో మంగళవారం తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని చేతుల మీదుగా ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు.

ఈ సందర్భంగా సోనీ మాట్లాడుతూ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టార్పెడో వెసెల్ ‘ఐఎన్‌ఎస్ అస్తధ్రారిణి'తో భారత నౌకాదళం మరింత పటిష్టవంతమైందన్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డు, ఎన్‌ఎస్‌టిఎల్ సహకారంతో ఈ నౌకను రూపొందించారని చెప్పారు.

ఈ నౌక 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదన్నారు. నీటిలో ప్రయాణించగల టార్పెడోలను, ఎన్‌ఎస్‌టిఎల్ రూపొందించే అధునాతన అస్త్రాలను ప్రయోగించేందుకు ఈ నౌక ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టిఎల్ సిబ్బంది చేసిన కృషిని సోనీ అభినందించారు.

దేశంలో 95 శాతం ఓడలను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నామన్నారు. అస్తవ్రాహిణి స్థానంలో అస్తధ్రారిణిని ప్రవేశపెట్టినట్టు సోనీ తెలిపారు. యుద్ధనౌక జలప్రవేశం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టిఎల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి భుజంగరావు, డైరెక్టర్ సిడి మల్లేశ్వర్, మెస్సర్స్ షాఫ్ట్ షిప్‌యార్డు ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి సహాయ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

భారత్ అమ్ముల పొదిలో మరో యుద్ధనౌక ‘అస్తధ్రారిణి' చేరింది.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

విశాఖలో మంగళవారం తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని చేతుల మీదుగా ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

ఈ సందర్భంగా సోనీ మాట్లాడుతూ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టార్పెడో వెసెల్ ‘ఐఎన్‌ఎస్ అస్తధ్రారిణి'తో భారత నౌకాదళం మరింత పటిష్టవంతమైందన్నారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

హిందుస్థాన్ షిప్‌యార్డు, ఎన్‌ఎస్‌టిఎల్ సహకారంతో ఈ నౌకను రూపొందించారని చెప్పారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

ఈ నౌక 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదన్నారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

నీటిలో ప్రయాణించగల టార్పెడోలను, ఎన్‌ఎస్‌టిఎల్ రూపొందించే అధునాతన అస్త్రాలను ప్రయోగించేందుకు ఈ నౌక ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టిఎల్ సిబ్బంది చేసిన కృషిని సోనీ అభినందించారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

దేశంలో 95 శాతం ఓడలను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నామన్నారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

అస్తవ్రాహిణి స్థానంలో అస్తధ్రారిణిని ప్రవేశపెట్టినట్టు సోనీ తెలిపారు. యుద్ధనౌక జలప్రవేశం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టిఎల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి భుజంగరావు, డైరెక్టర్ సిడి మల్లేశ్వర్, మెస్సర్స్ షాఫ్ట్ షిప్‌యార్డు ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి సహాయ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

‘అస్త్రధారిణి' జలప్రవేశం

‘అస్త్రధారిణి' జలప్రవేశం

విశాఖలో మంగళవారం తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని చేతుల మీదుగా ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు.

English summary
The Indian Navy on Tuesday commissioned a home-grown torpedo launch and recovery vessel, christened INS Astradharini. It is an advanced replacement for Astravahini which was decommissioned this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X