వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభద్రతాభావంలో హెచ్‌ - 4 వీసా హోల్డర్లు

అమెరికాలో అడుగు పెట్టేందుకు అవసరమైన హెచ్ – 1 బీ వీసా నిబంధనలు కఠినతరం.. ఎదురవుతున్న పలు అడ్డంకులు.. ఇప్పటికే హెచ్ ‌– 1 బీ వీసాతో పనిచేస్తున్న భారతీయుల్లో భవిష్యత్‌పై ఆందోళన..

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ / హైదరాబాద్: అమెరికాలో అడుగు పెట్టేందుకు అవసరమైన హెచ్ - 1 బీ వీసా నిబంధనలు కఠినతరం.. ఎదురవుతున్న పలు అడ్డంకులు.. ఇప్పటికే హెచ్ ‌- 1 బీ వీసాతో పనిచేస్తున్న భారతీయుల్లో భవిష్యత్‌పై ఆందోళన.. విద్యా ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలని భావించే వారితో పాటు ఇప్పటికే అక్కడ ఉన్న ఉద్యోగులూ.. నిబంధనలు ఎప్పుడు? ఎలా? మారతాయోనని ఆందోళనకు గురవుతున్నారు.

ఇక తాజాగా అమెరికా ప్రభుత్వం హెచ్‌ - 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్ల జారీని రద్దు చేయనుందనే వార్తలు మరింత గుబులు రేపుతున్నాయి. ప్రతిదీ వ్యయభరితమైన ప్రస్తుత తరుణంలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబ అవసరాలు తీరని పరిస్థితి.

అమెరికా అయినా.. భారత్ అయినా.. ఆస్ట్రేలియా అయినా పరిస్థితి ఒకేలా ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో పనిచేస్తున్న విదేశీయుల్లో.. తమ జీవిత భాగస్వామి కూడా ఏదో ఒక జాబ్‌లో చేరితే ఎంతోకొంత ఆదాయం లభిస్తుందని, ఆర్థికంగా మరింత బలపడొచ్చని భావిస్తుంటారు.

అప్పుడు తొలిసారి హెచ్ - 4 వీసా

అప్పుడు తొలిసారి హెచ్ - 4 వీసా

దీనికి 2015లో అమెరికా ప్రవేశపెట్టిన హెచ్ ‌- 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానం కలిసొచ్చింది. దీని ద్వారా.. హెచ్‌ - 1 బీ వీసాతో స్కిల్డ్‌ వర్కర్‌గా అమెరికాలో అడుగుపెట్టిన వ్యక్తి.. తనతోపాటు వచ్చిన జీవిత భాగస్వామి కూడా అమెరికాలోనే తన అర్హతలకు తగ్గ ఉద్యోగం సొంతం చేసుకునే వీలు ఉండేది. స్వయం ఉపాధి కోణంలోనూ సొంత వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. అంతేకాక అత్యున్నత నైపుణ్యం గల ప్రొఫెషనల్స్‌ జాబితాలోని ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు. ఇలా ఉద్యోగం పొందిన అభ్యర్థులు.. తమకు ఉద్యోగం కల్పించిన సంస్థల యాజమాన్యాల నుంచి ఈఏడీ (ఐ766)గా పిలిచే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ను తీసుకుని ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు అందించాలి సుమా.

హెచ్‌ – 1 బీ కి సమానంగా డిపెండెంట్ వర్క్ పర్మిట్

హెచ్‌ – 1 బీ కి సమానంగా డిపెండెంట్ వర్క్ పర్మిట్

హెచ్ ‌- 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్ల కాలపరిమితి.. హెచ్‌-1బి వీసా కాల పరిమితికి అనుగుణంగా ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం హెచ్‌ - 1 బీ వర్క్‌ పర్మిట్‌ ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా ఆరేళ్లు పని చేయడానికి వీలు ఉన్నది. తదనుగుణంగానే సదరు హెచ్ ‌- 1 బీ వర్క్‌ హోల్డర్‌ భాగస్వామి కూడా హెచ్‌ - 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ పేరుతో ఆరేళ్లు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తన జీవిత భాగస్వామి హెచ్‌-1బి వీసాను పొడిగిస్తే.. ఆ మేరకు తాను కూడా హెచ్‌- 4 డిపెండెంట్‌ వర్క్‌ వీసాను పునరుద్ధరించుకుని, పొడిగించుకోవచ్చు.

ఎక్కువగా భారత్ నుంచే..

ఎక్కువగా భారత్ నుంచే..

అమెరికా ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన హెచ్‌-4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానంలో అధికంగా లబ్ధి పొందిన వారు ఆసియా వాసులేనని.. అందులోనూ భారత్‌కు చెందిన వారే అధికంగా ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. 2015లో ఈ విధానంలో 1.80 లక్షల మంది అర్హులు ఉంటారని అంచనా వేశారు. వీరిలో 55 వేల మందికి హెచ్‌-4 వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. వీరిలో భారత్‌కు చెంది హెచ్‌-1బి వీసా పొందిన వారి జీవిత భాగస్వాముల సంఖ్య 40 నుంచి 50 % మధ్యలో ఉందని అంచనా. మొత్తం మీద 2016 నాటికి హెచ్‌-4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానంలో 1,31,051 మంది వర్క్‌ వీసా పొందారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది...

స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది...

హెచ్ - 1 బీ వీసాలతో ఉద్యోగాలు కోల్పోతున్నామని నిరసన వ్యక్తం చేస్తున్న అమెరికన్‌ యువకులు.. హెచ్‌ - 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానంపై మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గతేడాది హెచ్‌ - 4 వర్క్‌ పర్మిట్ల విధానాన్ని రద్దు చేయాలని ఆ దేశ న్యాయస్థానాల్లో పిటిషన్లూ దాఖలు చేశారు. కానీ హెచ్ - 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్లు అమెరికాలోని యువత అవకాశాలను అడ్డుకోవని అక్కడి న్యాయస్థానాలు పేర్కొన్నాయి. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హెచ్‌ - 4 డిపెండెంట్‌ వర్క్‌ వీసా హోల్డర్లలో ఆందోళన మొదలైంది. ఇమిగ్రేషన్‌ విధానాలను కఠినం చేస్తామని, విదేశీయుల వర్క్‌ వీసాల విషయంలో నిబంధనలు మరింత క్లిష్టతరం చేస్తామనే ట్రంప్‌ ప్రభుత్వ ప్రకటనలతో హెచ్ - 4 సహా వారి భాగస్వాములైన హెచ్‌ -1బీ వీసా హోల్డర్లు ఆందోళనకు గురవుతున్నారు.

హోంల్యాండ్‌ సెక్యూరిటీ చేతిలోనే...

హోంల్యాండ్‌ సెక్యూరిటీ చేతిలోనే...

ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్‌ -4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానం కొనసాగించడమా/ రద్దు చేయడమా అన్న విషయం అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. దీనిపై సమీక్షించి నిర్దిష్ట నిర్ణయాన్ని 60 రోజుల్లోపు తెలియజేయాలని హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగాన్ని గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. ఇంకా స్పష్టత రాక పోవడంతో మరో 180 రోజులు గడువు ఇవ్వాలని హోం ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ఈ నెల మూడో తేదీన ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రస్తుతం హెచ్‌-4 వీసాతో పని చేస్తున్నవారిలో ఉత్కంఠ నెలకొంది.

 వెసులుబాట్లు ఇవీ..

వెసులుబాట్లు ఇవీ..

హెచ్‌-1బీ వీసా విధానాలతో పోల్చితే హెచ్ ‌- 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ పొందే వారికి పలు వెసులుబాట్లు ఉన్నాయి. హెచ్ - 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ హోల్డర్లు ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. హెచ్‌ - 1 బీ మాదిరిగా స్పాన్సర్‌ కంపెనీలోనే పని చేయాలనే నిబంధన లేదు. అలాగే నిర్దిష్ట కాల పరిమితిలో ఒక సంస్థ నుంచి మరో కొత్త సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది.

మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు

మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు

మహిళలు స్వయం ఉపాధి కోణంలోనూ ఆదాయం పొందొచ్చు. బేబీ కేర్‌ సెంటర్లు, బ్యూటీ సెలూన్లు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లు వంటివి నెలకొల్పి వ్యాపారం చేయొచ్చు. తమ జీవిత భాగస్వాముల హెచ్‌-1బీ వీసా కాల పరిమితిని పొడిగిస్తే.. దానికి తగిన విధంగా తమ హెచ్ - 4 వీసా గడువును కూడా పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల జారీ కోణంలో సంఖ్యాపరంగా ఎలాంటి పరిమితి లేదు.

అంత మందిపై ప్రభావం

అంత మందిపై ప్రభావం

హెచ్‌ - 4 డిపెండెంట్‌ వర్క్‌ పర్మిట్‌ విధానాన్ని సమీక్షించాలనే నిర్ణయం, రద్దు చేయాలనే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో.. దాని ప్రభావం అమెరికాలో నివసిస్తున్న రెండు లక్షల మంది విదేశీయులపై ప్రభావం చూపనున్నది. ప్రస్తుతం హెచ్ ‌- 1బీ వీసాతో అడుగు పెట్టినవారి జీవిత భాగస్వాములు కూడా తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు చేస్తున్నారు. తాజా నిర్ణయం వారందరికీ శరాఘాతంగా మారనున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

English summary
Trump administration ready to review and scrap h - 4 dependant visa policy while it will be hit on 2 lakhs persons lively hood
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X