వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు మా ప్రధాని అయితే ఎంతో బాగుండేది: సుష్మా స్వరాజ్ కు ఊహించని ప్రశంస

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ సాయం చేసే గుణానికి మన భారతీయులే కాదు పాకిస్తానీలూ ఫిదా అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళకి సుష్మా సకాలంలో సాయం చేసి ఆదుకున్నారు. దాంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ సాయం చేసే గుణానికి మన భారతీయులే కాదు పాకిస్తానీలూ ఫిదా అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళకి సుష్మా సకాలంలో సాయం చేసి ఆదుకున్నారు. దాంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై సుష్మా స్వరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తుతోంది.

పాకిస్తాన్ కు చెందిన హిజాబ్‌ ఆసిఫ్‌ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. ఆమె వీలైనంత త్వరగా భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. దీంతో హిజాబ్‌ మెడికల్‌ వీసా కోసం ఇస్లామాబాద్‌లోని డిప్యూటీ హైకమిషనర్‌ను ఆశ్రయించింది. కానీ ఇందుకు కమిషనర్‌ ఒప్పుకోలేదు. దాంతో హిజాబ్‌ సుష్మా స్వరాజ్‌ను ఆశ్రయించింది.

What do I call you, Superwoman? God? Ailing Pakistani woman thanks Sushma Swaraj after getting visa

'మేడమ్‌.. నాకు కాలేయ సమస్య ఉంది. భారత్‌లో చికిత్స చేయించుకోవాలి. మెడికల్‌ వీసా కావాలని అడిగితే అది మీరే చూసుకోవాలని అంటున్నారు. నాకు సాయం చేయండి' అని ట్వీట్‌ చేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే సుష్మా స్వరాజ్ ఈ ట్వీట్ కు ఎప్పటిలాగే వెంటనే స్పందించి హిజాబ్ కు మెడికల్‌ వీసా వచ్చేలా డిప్యూటీ హైకమిషనర్‌ను ట్విటర్‌ ద్వరా ఆదేశించారు.

దీంతో సుష్మా స్వరాజ్ పై పాకిస్తానీ మహిళ హిజాబ్‌ ప్రశంసల జల్లులు కురిపించింది. 'సుష్మాజీ.. ఏమని పిలవను మిమ్మల్ని? సూపర్‌ ఉమెన్‌ అనాలా? లేక దేవత అని సంబోధించాలా? మీ మంచితనాన్ని వివరించడానికి మాటలు రావడంలేదు.. అంటూ ప్రశంసలు కురిపించింది.

అంతేకాదు, 'లవ్యూ మేడమ్‌. కన్నీళ్లతో మిమ్మల్ని పొగడటం ఆపలేను. నా గుండె మీకోసమే కొట్టుకుంటోంది. మీరు మా దేశ ప్రధాని అయివుంటే ఎంత బాగుండో. అయినా మీలాంటి ప్రధానిని పొందే అర్హత పాక్‌కు లేదు..' అని హిజాబ్ ట్వీట్‌ చేసింది. ఇది చూసిన వారంతా ప్రస్తుతం సుష్మా స్వరాజ్ ను 'వాహ్.. సుష్మా.. వాహ్..' అంటున్నారు.

English summary
External Affairs Minister Sushma Swaraj on Thursday directed the Indian High Commission in Islamabad to issue a visa to a Pakistani national for medical treatment in India. Swaraj's direction to India's High Commissioner in Pakistan Gautam Bambawale came after a woman Hijaab Asif sought the external affairs minister's urgent intervention. Touched by Swaraj's prompt response, Asif praised Swaraj and even said that Pakistan would have changed had she been the prime minister of her country. Minutes after Swaraj's tweet to Bambawale, the Indian mission tweeted that it was in touch with the applicant. "Ma'am, we are in touch with the applicant. Rest assured we will follow it up," the Indian High Commission said in a tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X