వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాపై దాడికి ‘తోమహక్ ’క్షిపణులే ఎందుకు? ఏంటి వాటి ప్రత్యేకత?

తన వద్ద ఎన్నో రకాల క్షిపణులు ఉండగా, అమెరికా నౌకాదళం సిరియాపై దాడికి తోమహక్ క్షిపణులనే ఎంచుకోవడానికి కారణమేమిటి? ఏమిటి ఈ క్షిపణుల ప్రత్యేకత?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సిరియాపై అటాక్ చేయమని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పగానే అమెరికా నౌకాదళం సిరియాలోని షైరత్ వైమానిక స్థావరాలపై దాడులకు ఎంచుకున్న ప్రధాన ఆస్త్రం.. తోమహక్ క్షిపణులు. ఎన్నో రకాల క్షిపణులు ఉండగా, అమెరికా నౌకాదళం వీటినే ఎంచుకోవడానికి కారణమేమిటి? ఏమిటి ఈ క్షిపణుల ప్రత్యేకత?

సిరియాలో రసాయనిక దాడులు జరిగి వందలాది మంది అమాయకులు బలైన నేపథ్యంలో అమెరికా శుక్రవారం సిరియాపై క్షిపణి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. రష్యా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా 50 తోమహక్ క్షిపణులను సిరియా భూభాగం మీదికి ప్రయోగించింది.

యుద్ధ విమానాలతో కష్టమే...

యుద్ధ విమానాలతో కష్టమే...

నిజానికి ఈ తోమహక్ క్షిపణుల కంటే కూడా అమెరికా వాయుసేన లోని మరికొన్ని విమానాలు అధిక మొత్తంలో పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. కానీ ఆ విమానాలను కచ్చితంగా పైలట్ లు నడపాల్సి ఉంటుంది. ఈ విమానాలపై దాడి చేయడం శత్రు సేనలకు కూడా సులభమవుతుంది. పైగా యుద్ధ విమానాల నుంచి బాంబులు వదిలితే అవి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ధ్వంసం చేస్తాయి.

దూరం ఎంతైనా.. గురి తప్పవు

దూరం ఎంతైనా.. గురి తప్పవు

సిరియాపై దాడికి అమెరికా నౌకాదళం తోమహక్ క్షిపణులు ఎంచుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. వీటిని చాలా దూరం నుంచి ప్రయోగించినా గురితప్పవు.. కచ్చితంగా లక్ష్యన్ని ఛేదించగల సామర్థ్యం వీటి సొంతం. ఈ తోమహక్ క్షిపణుల్లో కొన్ని క్లస్టర్ బాంబులను కూడా తీసుకెళ్లి టార్గెట్ మీద విరజిమ్మగలవు.

రిస్క్ కూడా తక్కువ...

రిస్క్ కూడా తక్కువ...

తోమహాక్ క్షిపణుల ప్రయోగంలో ఎక్కువ రిస్క్ ఉండదు. అమెరికా నౌకాదళం వీటిని దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రయోగించగలదు. ఇంత దూరం నుంచి ప్రయోగించడం వల్ల శత్రువులు వెంటనే తమ వాయుసేనతో అమెరికా నౌకల మీదికి వచ్చే అవకాశం ఉండదు.

గల్ఫ్ యుద్ధంలో కూడా ఇవే...

గల్ఫ్ యుద్ధంలో కూడా ఇవే...

1991 ప్రాంతంలో జరిగిన గల్ఫ్ యుద్ధంలో కూడా అమెరికా ఈ తోమహక్ క్షిపణులనే విస్తృతంగా ఉపయోగించింది. వీటికి సాధారణంగా 455 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది. అమెరికా నౌకల మీద హైతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులు చేసిన సమయంలో వారిని అడ్డుకునేందుకు అమెరికా వీటినే ప్రయోగించింది.

చివరిసారిగా అప్పుడు...

చివరిసారిగా అప్పుడు...

చిట్ట చివరిసారిగా పెంటగాన్ ఈ తోమహక్ క్షిపణులను ఎర్ర సముద్రం నుంచి యెమెన్లోని కోస్టల్ రాడార్ సైట్ల మీద ప్రయోగించింది. ఇప్పుడు తాజాగా సిరియా మీద వైమాని దాడులు జరపడం కోసం మధ్యధరా సముద్రంలో ఉన్న తన యుద్ధనౌకల మీద నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది.

సిరియాకు అండగా రష్యా దిగుతుందా?

సిరియాకు అండగా రష్యా దిగుతుందా?

సిరియా ఎక్కువగా ఎస్-200 తరహా క్షిపణులు వాడుతుంది. వీటిని భూమ్మీద నుంచి గాల్లోకి ప్రయోగిస్తారు. ప్రస్తుతం సిరియాలో రష్యాకు చెందిన వైమానిక, పదాతి దళాలు మోహరించి ఉన్నాయి. సిరియాకు అండగా రష్యా గనుక అమెరికాను ఎదుర్కొంటే కష్టమే. ఎందుకంటే రష్యా దగ్గర ఎస్-300, ఎస్-400 తరహా క్షిపణులు ఉన్నాయి. వీటి వేగం అధికం. పైడా వాటికి రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది.

రష్యా ఎస్-400 తరహా క్షిపణులు ప్రయోగిస్తే...

రష్యా ఎస్-400 తరహా క్షిపణులు ప్రయోగిస్తే...

అయితే అమెరికా ఈఏ-18జి గ్రౌలర్ జెట్, ఇతర సాధనాలతో రష్యన్ రాడార్లను జామ్ చేయగలదు. కానీ రష్యా గనుక ఎస్-400 తరహా క్షిపణులను రంగంలోకి దింపితే అమెరికాకు కష్టమే. ఎందుకంటే అమెరికా ఉపయోగించే జామర్లను కూడా అధిగమించే సామర్థ్యం రష్యాకు చెందిన ఈ ఎస్-400 తరహా క్షిపణులకు ఉంటుంది.

English summary
The US Navy launched more than 50 Tomahawk Missiles on Friday at military targets in Syria in response to a chemical-weapons attack. Why America used Tomahawk Missiles for the attack on Syria Air base? What is the speciality of these missiles? Here is the detailed story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X