వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంకీ గేట్ ఇక్కడే: భారత్, ఆసీస్ మాటల ఈటెలతో...

By Pratap
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాల మధ్య ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఇరు జట్ల సభ్యులు మైదానంలో మాటల యుద్ధానికి దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ స్థితిలో సెమీ ఫైనల్‌లో వాతావరణం ఏ విధంగా వేడెక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారంనాడు ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ప్రపంచ కప్ పోటీల్లో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారత జట్టును నిలువరించేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాటల ఈటెలను సిద్ధం చేసుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఇరు జట్లు వాతావరణాన్ని వేడెక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగనుంది.

ఈ మైదానంలోని క్రికెట్ చరిత్రలో మరుపునకు రాని మంకీగేట్ సంఘటన చోటు చేసుకుంది. 2008లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్, భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు మధ్య చోటు చేసుకున్న వివాదం టెస్టు సిరీస్ రద్దయ్యే దాకా పరిస్థితిని తీసుకుని వెళ్లింది.

సైమండ్స్‌ను కోతిగా అభివర్ణించినందుకు హర్భజన్ సింగ్‌పై మూడు మ్యాచుల నిషేధం వేటు పడింది. దాంతో హర్భజన్‌ను ఇరికించారని అంటూ టీమిండియా సరీస్‌ను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. ప్రపంచ కప్ పోటీలకు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లోనూ వివాదాలు చోటు చేసుకున్నాయి. మైదానంలో ఉద్వేగపూరితమైన వివాదాలకు దిగినందుకు పలువురు క్రికెటర్లకు అపరాధ రుసుం కూడా పడింది.

World Cup Semi-final: India, Australia set for verbally hostile showdown

ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్కార్క్‌లపై ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంగతి చెప్పనే అవసరం లేదు. సమస్యలు సృష్టించడానికి చూడవద్దని క్రికెట్ ఆస్ట్రేలియా బాస్ జేమ్స్ సూదర్లాండ్ ఆయనను బహిరంగంగానే హెచ్చరించారు. రోహిత్ శర్మను గ్లాన్ మాక్స్‌వెల్ ఇంగ్లీషులో మాట్లాడాలని హెచ్చరించిన విషయం ఇంకా మరుగున పడిపోలేదు.

ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు శ్రీలంక మ్యాచ్ రెఫరీ రంజన్ ముదుగలే మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధించారు. అడిలైడ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ ఆటగాడు వాహబ్ రియాజ్‌తో తగాదాకు దిగినందుకు అతనికి ఆ శిక్ష పడింది.

అయితే, ఐపియల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాలు పంచుకుంటున్నందున భారత ఆటగాళ్లతో తమ ఆటగాళ్లు శత్రుపూరిత వైఖరిని ప్రదర్శించే అవకాశం లేదని గ్లెన్ మాక్స్‌వెల్ అంటున్నాడు.

English summary
Rival captains Mahendra Singh Dhoni of India and Michael Clarke of Australia may have their hands full trying to keep frayed tempers in check during a potentially explosive World Cup semi-final on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X