వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపిలో కుల సమీకరణలే గెలుపు ఓటములపై ప్రభావం చూపిస్తాయి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కులాల సమీకరణ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. కులాల సమీకరణలు ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి.ఈ మేరకు ఆయా పార్టీలు తమ వ్యూహరచన చేస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :దేశంలో అతి పెద్ద రాష్ట్రం బిఎస్ పి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాయి.ఈ రాష్ట్రంలో ఆయా పార్టీల జయాపజయాలను కులాలు ప్రభావితం చేస్తాయి. ఇతరులకు అనుకూలంగా ఉన్న పార్టీల ఓటు బ్యాంకులను కొల్లగొట్టేందుకుగాను ప్రత్యర్థి రాజకీయపార్టీలు వ్యూహలను రచిస్తున్నాయి.

దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఈ రాష్ట్రంలో సుమారు 20 కోట్ల జనాభా ఉంటుంది. అసెంబ్లీలో 400 స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ లో సుమారు 80 కి పైగా స్థానాలున్నాయి.ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది.

మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకొనేందుకుగాను సమాజ్ వాదీ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న బిజెపి ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

మరో వైపు బిఎస్ పి కూడ అధికారం కోసం వ్యూహన్ని రచిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసమే ఈ ఎన్నికల్లో పోరాటం చేయాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభావం చూపనున్న కులాలు

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభావం చూపనున్న కులాలు

ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆయా పార్టీలు గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఆయా రాస్ట్రాల గెలుపు ఓటములపై కులాలు ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి. కులసమీకరణలు ఆయా పార్టీలను ప్రభావితం చేయనున్నాయి. అనేక ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే కులాల వ్యూహలను అనుసరించి పార్టీలు తమ వ్యూహలను రచిస్తున్నాయి.ఈ రాష్ట్రంలో సుమారు 44 శాతం ఓబిసిలు ఉంటారు. 21 శాతం దళితులుంటారు.అయితే ఇక ప్రధానంగా ముస్లిం ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆ పార్టీకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.ఈ రాష్ట్రంలో ముస్లింల జనాభా 19 శాతం ఉంటుంది.వీరి ఓటు బ్యాంకు కూడ ప్రధాన పార్టీలకు కీకలకమే. అందుకే రాజకీయపార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

గతంలో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే

గతంలో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే

ప్రధానంగా కులాల సమీకరణలు ఆయా పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపనున్నాయి. ఈ తరుణంలో కులాల సమీకరణకు పార్టీలు వ్యూహలను రచిస్తున్నాయి. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్ పి బ్రహ్మణులు , దళితులకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో ఆనాడు ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 30.4 శాతం ఓట్లతో బిఎస్ పిని ఆనాడు ఓటర్లు ఆదరించారు. 400 స్థానాలున్న అసెంబ్లీలో బిఎస్ పి 206 సీట్లను గెలుచుకొంది. మరో వైపు 2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ఓబిసి , ముస్లింలు లక్ష్యంగా ఆ పార్టీ చేసిన వ్యూహం ఫలించింది.29.15 శాతం ఓట్లతో 224 సీట్లను సాధించింది.ఈ ఎన్నికల్లో బిజెపికి కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 47 అసెంబ్లీ స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకొంది. అయితే అనూహ్యంగా 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 71 పార్లమెంట్ స్థానాలను ఈ రాష్ట్రం నుండి గెలుచుకొంది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలున్నాయి.అయితే ఇందులో 71 స్థానాలను బిజెపి గెలుచుకొంది. 42.3 శాతం ఓట్లను ఈ ఎన్నికల్లో బిజెపి దక్కించుకొంది. మోడీ ప్రధాని కావాలనే కోరికతో ప్రజలు బిజెపికి పట్టం కట్టారు. అయితే ఈ దఫా ఇదే పరిస్థితి కొనసాగుతోందా అనేది స్పష్టంగా చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో త్రిముఖ పోటీ కొనసాగే అవకాశం ఉంది.

.అగ్రవర్ణాలు యాదవతేర ఓబిసిల ఓట్లకు బిజెపి ప్లాన్

.అగ్రవర్ణాలు యాదవతేర ఓబిసిల ఓట్లకు బిజెపి ప్లాన్

సాధారణంగా బ్రహ్మణులు, ఇతర అగ్రవర్ణాలకు చెందిన కులాలు బిజెపికి వైపుకు మొగ్గుచూపుతారు. అయితే ఈ సంప్రదాయ ఓట్లతో పాటుగా యాదవేతర ఓబిసి ఓట్లను ఈ దఫా తమ వైపుకు తిప్పుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. యూపి జనాభాలో 10 శాతం బ్రహ్మణ ఓటర్లు ఉన్నారు. అయితే ఈ దఫా బ్రహ్మణులకు ముఖ్యమంత్రి పదవికి కట్టబెట్టాలనే యోచనలో ఆ పార్టీ ఉంది. ఇంతవరకు బిజెపి నుండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో బ్రహ్మణులు లేరు.దీంతో ఈ దఫా బ్రహ్మణులకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారు. మరో వైపు ఠాకూర్లలో కూడ బిజెపికి పట్టుంది. వీరంతా బిజెపికి మద్దతు పలికే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.రాష్ట్ర జనాభాలో 9 శాతం యాదవ జనాభా ఉంది. యాదవ అధిపత్యం గిట్టని ఓబిసిలోని ఇతర కులాలను తమ వైపుకు తిప్పుకొంటే గెలుపు నల్లేరుపై నడకేననే అభిప్రాయాన్ని బిజెపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు.తూర్పు యూపిలో కుర్మీలు, కోయిరీలు నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారు. ఓబిసిల్లో యాదవ జనాభా సుమారు 19.4 శాతం ఉంటే, ఎంబిసిలు 61.69 శాతంగా ఉంటుంది.

ఎంబిసీ ల మద్దతు కూడ కీలకమే

ఎంబిసీ ల మద్దతు కూడ కీలకమే

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎంబిసీల మద్దతు కూడ కీలకంగానే మారనుంది. ఈ ఎన్నికల్లో ఎంబిసీలు ఎటు మొగ్గుచూపితే ఆ పార్టీకి విజయావకాశాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి. అత్యంత వెనుకబడిన వర్గాల మద్దతు కోసం బిజెపి పావులు కదుపుతోంది. అయితే ఈ వర్గాలు బిజెపి వైపుకు మొగ్గుచూపడం అంత ఆషామాఫీ కాదు. నిషాద్, మల్లాహ్, కేవత్, లోనియా, నోనియా, గోలే ఠాకూర్, కుష్హుర్ , కశ్యప్ ,లోథ్ లాంటి ఎంబిసీ కులాలపై బిజెపి ప్రత్యేకంగా కేంద్రీకరించింది. 2014 ఎన్నికల్లో బిజెపి 71 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి ప్రధానంగా ఎంబిసీ ఓటర్లు ఆ పార్టీ వైపుకు మొగ్గుచూపడంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.ఈ ఎన్నికల్లో ఎంబిసీ 60 శాతం ఓట్లను బిజెపి దక్కించుకొంది.ఎంబిసి సామాజిక వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి అధ్యక్షుడుగా ఉన్నాడు. దీంతో బిజెపికి కలిసివచ్చే అవకాశంగా ఆ పార్టీ భావిస్తోంది.

దళితుల ఓట్లు కీలకమే

దళితుల ఓట్లు కీలకమే

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దళిత ఓట్లు కీలకమే. దళితల జనాభా ఈ రాష్ట్రంలో సుమారు 21 శాతం ఉంటుంది. జాటప్ ల వాటా సుమారు 12 శాతంగా ఉంటుంది. జాటవేతరులపై బిజెపి కేంద్రీకరించింది. అతి దళితులుగా పిలిచే పాసీ, ఖాతిక్, కోరి, వాల్మీకి, దోభి కులాలకు జాటవ్ లపై ఉన్న అసంతృప్తిని సొమ్ముచేసుకొని దళిత ఓట్ల ను తమ వైపుకు తిప్పుకొనేందుకు ఏ రాజకీయ పార్టీ ప్రయత్నిస్తే ఆ పార్టీకి ప్రయోజనం కలుగుతోంది.

దళితులు, ముస్లింల ఓట్లు వ్యూహంతో బిఎస్ పి

దళితులు, ముస్లింల ఓట్లు వ్యూహంతో బిఎస్ పి

2007 అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్ పి బ్రహ్మణులు దళితులు అనే వ్యూహంతో పనిచేశాయి. అయితే ఈ వ్యూహం ఆనాడు బిఎస్ పి అధికారంలో కూర్చోబెట్టింది. ఈ దఫా దళితులు ముస్లింలు అనే వ్యూహంతో ఆ పార్టీ వెళ్తోంది. ఆ పార్టీ ప్రకటించిన సీట్లలో సగానికి పైగా అభ్యర్థులను ముస్లింలకు టిక్కెట్లను కేటాయించింది బిఎస్ పి.ముజఫర్ నగర్, దాద్రీ అల్లర్ల సమయంలో అఖిలేష్ ప్రభుత్వ స్పందనపై అసంతృప్తితో ఉన్న వారిని తమ వైపుకు ఆకర్షించవచ్చని బిఎస్ పి ప్రయత్నిస్తోంది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో 73 సీట్లలో ముస్లింలు నిర్ణయాత్మక పాత్రను పోషించనున్నారు. రాష్ట్ర జనాభాలో 19 శాతంగా ఉన్న ముస్లింలకు ఆ పార్టీ 97 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది.

 ముస్లిం ఓట్లలో చీలిక బిజెపికి ప్రయోజనం

ముస్లిం ఓట్లలో చీలిక బిజెపికి ప్రయోజనం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా ముస్లింలు ఓటుచేసే అవకాశం ఉంది.అయితే ఈ ఓటింగ్ ను తమ వైపుకు తిప్పుకొనేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముస్లిం ఓట్లలో చీలిక బిజెపికి కలిసి వస్తోంది. అయితే ఈ ఓట్లలో చీలిక రాకుండా ఉండేందుకుగాను బిఎస్ పి పావులు కదుపుతోంది. ఎస్ పి, కాంగ్రెస్ పార్టీలకు ఓటు చేయకూడదని బిఎస్ పి ప్రచారం చేస్తోంది. మరో వైపు అగ్రవర్ణాలైన బ్రహ్మణులకు కూడ అదే స్థాయిలో బిఎస్ పి టిక్కెట్లను కేటాయించింది. 66 అసెంబ్లీ సీట్లను మాయావతి బ్రహ్మణులకు కేటాయించారు. రాష్ట్ర జనాభాలో బ్రహ్మణులు 10 శాతం ఉంటారు.

ముస్లిం యాదవ్ ల ఓట్లే లక్ష్యంగా సమాజ్ వాదీ పార్టీ వ్యూహం

ముస్లిం యాదవ్ ల ఓట్లే లక్ష్యంగా సమాజ్ వాదీ పార్టీ వ్యూహం

2012 లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీపార్టీ అధికారంలోకి వచ్చింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే సమయంలో పార్టీలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులు ఇబ్బందులు పెడుతున్నాయి. అఖిలేష్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ది, అవినీతికి దూరంగా ఉన్నారనే ప్రచారం ఆ పార్టీకి కలిసిరానుందని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. సెక్యులర్ పార్టీగా సమాజ్ వాదీకి ముద్ర ఉంది. ముస్లింలతో ములాయం సింగ్ అనుబంధం కూడ ఎక్కువే. 2012 ఎన్నికల్లో ఎస్ పి కి కేవలం 39 శాతం మాత్రమే ఓటు చేశారు. కాని, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 58 శాతం ముస్లిం ఓటర్లు ఎస్ పి కి అండగా నిలిచారు. మోడీకి, బిజెపికి వ్యతిరేకంగా వీరంతా ఎస్ పి కి అండగా నిలిచిన పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ పోరాటం నామమాత్రమే

కాంగ్రెస్ పార్టీ పోరాటం నామమాత్రమే

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసమే బరిలోకి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2012 ఎన్నికల్లో 11.65 శాతం ఓట్లతో 28 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 7.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా ఉన్న బ్రహ్మణులు, ముస్లింలు, దళితులు దూరమౌతున్నారు. కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. మరో వైపు ఆర్ ఎల్ డి కూడ సమాజ్ వాదీతో పొత్తుకు ఆసక్తిని చూపుతోంది.

English summary
all parties prepare to caste stratagy in uttar pradesh elections, caste equations are main role in this elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X