వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌పై చెప్పిందెవరు, ఎలా?: రాత్రి దాకా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఆదివారం సంచలన మలుపు తిరిగింది. అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడైన స్టీఫెన్ సన్ ఓటు కోసం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న రూ.5 కోట్ల బేరం వ్యవహారం
బహిర్గతమైపోయింది.

పక్కా ఆధారాలతోనే రేవంత్‌ను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఆయన్ని సోమవారం కోర్టుకు హాజరుపరుస్తామని వెల్లడించారు. గత రెండు రోజులుగా స్టీఫెన్ సన్‌తోరేవంత్ బేరమాడినట్టుగా కథనాలు వచ్చాయి.

ఐదుకోట్ల బేరంలో భాగంగా 50లక్షల అడ్వాన్స్‌ను ఇస్తూండగా రేవంత్‌ను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆరు సీట్లకు ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ - టీడీపీ మధ్య జరిగిన పోరు చివరికి రేవంత్ అరెస్టుకు దారితీయడం రాజకీయ ఉత్కంఠకు తెరతీసింది. ఇరు పార్టీలు వాదోపవాదాలకు దిగాయి.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

సోమవారం జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని, ఇందుకోసం తనకు భారీగా ముట్టజెబుతామని ప్రలోభపెట్టారని స్టీఫెన్‌సన్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

మొత్తం రూ.5 కోట్లకు ఒప్పందం కుదిరిందని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. స్టీఫెన్‌సన్‌ నుంచి గత గురువారం అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌. నమోదుచేశారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

స్టీఫెన్ సన్‌ చెప్పినదాని ప్రకారం లాలాగూడలోని ఆయన బంధువు మాల్కం టేలర్‌ ఇంట్లో డబ్బు ముట్టజెప్పేందుకు అంగీకారం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రేవంత్, మరో వ్యక్తి ఓ కారులో వచ్చారు. దీన్ని అనుసరిస్తూ మరో కారు వచ్చింది.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి


అందులో నుంచి దిగిన మరో వ్యక్తితో కలిసి రేవంత్ ఫ్లాట్‌నెంబర్‌ ఎఫ్‌-4కు వెళ్లారు. అప్పటికే స్టీఫెన్‌సన్‌తో పాటు ఏసీబీ అధికారులు కూడా ఆ ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నల్లరంగు సంచిలో నుంచి డబ్బు తీసి బయటపెట్టగానే అప్పటికే లోపల ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఆ గదిలో ఏసీబీ అధికారులు ముందుగానే రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారని, గదిలో జరిగిన తతంగం అంతా రికార్డు చేశారని తెలుస్తోంది. బ్యాగులో నుంచి తీసిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి


ఇవి రూ.50 లక్షలు ఉన్నట్లు తేల్చారు. ఈ కట్టలపై బ్యాంకు ముద్రలు ఏవీ లేకపోవడం గమనార్హం. అనంతరం రేవంత్ రెడ్డి, అతనితోపాటు వచ్చిన ఉదయ్‌సింహ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

కొద్దిసేపు వారిని ప్రశ్నించిన తర్వాత బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. సోమవారం ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనతో పాటు ఉన్న ఉదయ్‌సింహ, బిషప్‌, సెబాస్టియన్‌ హ్యారీలను అరెస్టు చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో టీడీపీ నేతలు ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై ధర్నాకు ఉపక్రమించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ, శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కావాలనే రేవంత్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యేలను భయపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 63 మంది ఎమ్మెల్యేలతో ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ సంతలో పశువుల్ని కొన్నట్లు తెదేపా, కాంగ్రెస్‌, వైసీపీ ఎమ్మెల్యేల్ని కొంటున్నారని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఉద్యమం తెలియనివాళ్లకు ఎమ్మెల్సీ టికెట్లిచ్చిన కేసీఆర్‌ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారన్నారు. అందుకే ఓటమి భయంతో టీడీపీపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి ఉన్న ప్రజాదరణకు భయపడే అక్రమ కేసులో ఇరికించారన్నారు. రేవంత్‌ వద్ద డబ్బుల్లేకున్నా అక్రమ కేసు పెట్టడంపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తన అన్నకు ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి వాపోయారు. తన సోదరుడిని కలిసేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన అన్నను ప్రభుత్వమే కుట్ర పన్ని కేసులో ఇరికించిందని ఆరోపించారు. ఆయనకేదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డితో పాటు మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఎకె ఖాన్‌ వెల్లడించారు. అతను విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము ప్రాథమికంగా దర్యాప్తు చేశామన్నారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ప్రాథమిక ఆధారాలు లభించడంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 12, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 120(బి), సెక్షన్‌ 34ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ లంచం ఇవ్వజూపినట్లు స్టీఫెన్ సన్‌ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డితో పాటు డబ్బు ఇవ్వడానికి వచ్చిన బిషప్‌, సెబాస్టియన్‌ హ్యారీ, ఉదయ్‌సింహలను అరెస్టు చేశామని, మరో వ్యక్తి మాథ్యూస్‌ జెరూసలెంను అరెస్టు చేయాల్సి ఉందని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల అధికారులకు కూడా సమాచారం ఇస్తున్నామని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలకు సంబంధించి వివరాలు కావాలని ఐటీ అధికారులు కూడా అడిగారన్నారు. విచారణ పూర్తయిన వెంటనే నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. తాము ఎవరికీ సీడీలు విడుదల చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

English summary
A day before MLC elections in Telangana, a dramatic cash-for-vote scam added a murky twist to the whole process on Sunday afternoon. TDP firebrand leader A Revanth Reddy was ‘caught’ in an attempt to offer Rs 50 lakhs as part of a Rs 5 cr deal to Elvis Stephenson to make him vote for TD. Stephenson is an MLA from Anglo-Indian community nominated by the ruling TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X