హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వసతులు, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, అందుకు ప్రతిగా ఆయా యూనిట్లలో తమ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామికవేత్తలను కోరారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్ర పరిశ్రమ నుంచి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న సరికొత్త వాణిజ్య వాహనం పీ601ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.

మహీంద్రా అండ్ మహీంద్ర కొత్తగా రూ. 250 కోట్లతో ప్రారంభించనున్న విస్తరణ పనులకు ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల వసతులు మేం కల్పిస్తామన్నారు. సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో దగాపడ్డ మా తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండని కోరారు.

తెలంగాణ దగాపడ్డ ప్రాంతం. నెత్తురు ధారపోసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మీ పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, కరెంట్, ఇతర కేటాయింపులు, వసతులు కల్పిస్తాం. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలు తీసుకోవాలి అని చెప్పారు. ఈ విషయంలో మహీంద్రా అండ్ మహీంద్రా ముందుండాలని ఆ సంస్థ ప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

తెలంగాణాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

 'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

పరిశ్రమలను స్థాపించేందుకు వచ్చే సంస్థల ప్రతినిధులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతామని, నేరుగా తనకు దరఖాస్తు చేస్తే అన్ని రకాల అనుమతులను పక్షం రోజుల్లో పూర్తి చేసి తిరిగి ఫోన్ కాల్ ద్వారా పిలిచి అనుమతి పత్రాలు అందజేస్తాన్నారు.

 'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

పైసా అవినీతికి ఆస్కారం లేకుండా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు. తలకాయ తెగినా సరే చెప్పిన మాటకు కట్టుబడి ఉండి కరెంటు సరఫరాను చేస్తామని వివరించారు.

 'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

తెలంగాణ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. 100 మిలియన్ల అమెరికా డాలర్లను వెచ్చించి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో సాంసంగ్ పరిశ్రమను నెలకొల్పనున్నారని వెల్లడించారు.

 'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా వివక్షత, అణచివేతకు గురైందని, స్వరాష్ట్రం సాధించిన అనంతరం ఉద్యోగ, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధమయ్యామని, ఈ మేరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు.

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

పారిశ్రామిక ప్రాంతాల్లో ఐటిఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసి సంబంధిత పరిశ్రమల్లో శిక్షణ ఇప్పించి జీవనోపాధి కల్పించాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయమన్నారు. కరెంటు, నీరు, భూమి, అనుమతులు, పన్ను రాయితీలు కల్పించినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయమనే విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించాలని అన్నారు.

 'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

మహీంద్ర అండ్ మహీంద్ర పరిశ్రమ ప్లాంటులో తిరుగుతున్నప్పుడు పరిశ్రమ డైరెక్టర్ పవన్ గోయెంకా యంత్రాలను చూపిస్తూ ఇంపోర్టెడ్ అనడంతో కొంత అసంతృప్తి చెందానని, స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించడం లేదని, తప్పనిసరిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తులు సాధించి మెకిన్ తెలంగాణ, మెకిన్ ఇండియాగా పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కోరారు.

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

ప్రత్యేక ప్యాకేజి ద్వారా 14.5 శాతం విధిస్తున్న వ్యాట్‌ను మహీంద్ర పరిశ్రమకు 5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.

 'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

మహీంద్ర కర్మాగారం మాదిరిగానే సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివపేట మండలంలో ఉన్న ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ ప్రతినిధులు తనను కలిసి మూడవ ప్లాంటు ఏర్పాటుకు అనుమతి కోరారని, దీంతో వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు.

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

ఉపాధికి దారులు చూపించేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు ఎప్పుడు స్వాగతం లభిస్తోందని, అన్ని రకాలుగా చేయూతను అందిస్తామని వెల్లడించారు.

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

'అన్ని వసతులు కల్పిస్తాం, మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి'

ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, చింతా ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి యాదవ్, పరిశ్రమ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

English summary
The auto division of Mahindra & Mahindra today announced the inauguration of its extended automotive manufacturing facility in Zaheerabad in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X