వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్సాలిడేషన్ పాయింట్: సంకీర్ణ రాజకీయాలపై సోనియాలా వ్యవహరిస్తేనే.. మోడీపై రాహుల్ పైచేయి

403 స్థానాలు గల అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకుండానే బీజేపీ సొంతంగా 312, మిత్రపక్షాలతో కలిసి 325 స్థానాలను గెలుచుకుని చరిత్ర నెలకొల్పడం అద్భుతమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరమైన పరిణామం ఒకటి ఉంది. 403 స్థానాలు గల అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకుండానే బీజేపీ సొంతంగా 312, మిత్రపక్షాలతో కలిసి 325 స్థానాలను గెలుచుకుని చరిత్ర నెలకొల్పడం అద్భుతమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర జనాభాలో సుమారు నాలుగో వంతు జనాభా నాలుగు కోట్ల మంది ముస్లింలు జీవిస్తున్నా ఒక్క స్థానంలోనూ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకుండానే విజయం సాధించారు. నాలుగు కోట్ల మంది ముస్లింల్లో అభ్యర్థులుగా నిలిపేందుకు ఒక్కరూ కూడా కనిపించలేదా? అన్న సందేహం కలుగుతున్నది. కానీ ముస్లింలను అభ్యర్థులుగా నిలిపిన పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

హిందుత్వకు సమాజం మద్దతు

హిందుత్వకు సమాజం మద్దతు

హిందూ సామాజిక వర్గాలన్నీ హిందుత్వ నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీకి మద్దతుగా నిలిచాయి. హిందువుల్లో ఐక్యత తీసుకొచ్చి మైనారిటీలందరినీ ఒక మూలకు నెట్టేయాలన్న వీర్ సావర్కర్ ‘ఐడియా ఆఫ్ ఇండియా' సూత్రం అమలైంది. భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న భవిష్యత్‪లో నిజం కానున్నాయనడానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తొలి సంకేతంగా నిలిచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాడేందుకు అవకాశం కలిగిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వంటి వారు చెప్తున్నారు. ఇది దారుణమైన పరాజయం కాదని, ప్రజలంతా లొంగిపోయే క్షణంగా మారుతున్నదని అంటున్నారు. అయితే ఆ దిశగా హిందూత్వ విధానాలకు వ్యతిరేకంగా మిగతా పార్టీలు పోరాడటం ఎలా అన్నదే ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.

2014లో బిజెపి విజయం లౌకిక పార్టీలకు తొలి హెచ్చరిక

2014లో బిజెపి విజయం లౌకిక పార్టీలకు తొలి హెచ్చరిక

2014లో అఖిల భారత జాతీయ స్థాయిలో బీజేపీ విజయం సాధించి ప్రధాన రాజకీయ పార్టీలకు తొలి హెచ్చరిక పంపిందని విశ్లేషకులు చెప్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసి ఎన్నికల వ్యవస్థలో స్పష్టమైన మెజారిటీ పొందింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 69 శాతం, 2017లో 58 శాతం ఓట్లను బీజేపీ సొంతం చేసుకున్నది. మూడేళ్లలోపే బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం తగ్గుముఖం పట్టడానికి ప్రధాని మోదీ తప్పిదం కాదని, బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ సిద్ధాంతాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు.

ఓట్ల చీలికతోనే బీజేపీకి అందలం

ఓట్ల చీలికతోనే బీజేపీకి అందలం

బీజేపీయేతర ఓట్లలో చీలిక రావడంతోనే మెజారిటీ సీట్లలో బీజేపీ విజయం సాధించగలిగింది. ఈ ఫలితాల నేపథ్యంలో విపక్ష పార్టీల మధ్య ఐక్యత సాధిస్తేనే తిరిగి భారతదేశానికి స్వేచ్ఛ ప్రసాదించే ‘ఐడియా ఆఫ్ ఇండియా'ను పొందగలమని రాజకీయ విశ్లేషకుల మాట. తద్వారా మాత్రమే స్వాతంత్య్రం పొందిన తొలి నాళ్లలో దేశ నిర్మాణ దశలో గల భారతదేశాన్ని, దానిలో గల ఐక్యత, సమగ్రతను పొందగలమని చెప్తున్నారు. మరో ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వం నుంచి చేజిక్కించుకోవడం ఒక సవాల్‌గా మిగులుతుంది. కానీ కనీసం 1857 నాటి స్ఫూర్తిదాయక జాతీయత భావాలు గల సమగ్ర భారత్ గానీ, 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితుల్లోని భారత్ నైనా పొందడం అంత తేలికేం కాదరి విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ విధానాలే బీజేపీకి అనుకూలమా?

కాంగ్రెస్ విధానాలే బీజేపీకి అనుకూలమా?

నాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు.. విభిన్న పార్టీలుగా రూపాంతరం చెందడానికి మార్గం ఏర్పడింది. ఇదే పరిణామం బీజేపీ ప్రధాన జాతీయ శక్తిగా ఎదిగేందుకు దారి తీసింది. ఈ పరిస్థితి పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సహజ సిద్ధమైన పార్టీ అన్న నానుడికి సవాల్ విసురుతున్నది. ప్రత్యామ్నాయ శక్తులు కలిసి ముందుకు సాగితే జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ హిందూత్వ శక్తులపై ఆధిక్యం సాధించగలమని రూఢీ అవుతున్నది.

పాంచ్ మడి సదస్సు వరకూ సొంత మెజారిటీపైనే నమ్మకం

పాంచ్ మడి సదస్సు వరకూ సొంత మెజారిటీపైనే నమ్మకం

1998 పాంచ్‌మడీ మేధోమధన సదస్సు నాటికి కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగానే అధికారంలోకి రాగలమని విశ్వసించింది. దీనికి కారణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలంలో ఎన్నికల్లో విజయం సాధించడమే దీనికి నేపథ్యం. అందరిని కలిపి ఉంచాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారత దేశానికి దాస్య విముక్తి కలిగించిన మహాత్మాగాంధీ స్ఫూర్తి, తర్వాత జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో ముందుకు వచ్చిన ‘ఐడియా ఆఫ్ ఇండియా'తో దాని వెంట వచ్చిన నాగరికత ఆధునిక భారతావని నిర్మాణానికి బాటలు పడ్డాయి.

నెహ్రూతోనే కాంగ్రెస్ పతనం మొదలు

నెహ్రూతోనే కాంగ్రెస్ పతనం మొదలు

1962 వరకు పశ్చిమ పాకిస్థాన్ సరిహద్దు నుంచి తూర్పు పాకిస్థాన్ సరిహద్దు వరకు అణువణువూ కాంగ్రెస్ పార్టీ పాలనలో సాగింది. కానీ 1962లో ఇండో చైనా యుద్ధం.. తర్వాత రెండేళ్లకు ప్రధానిగా నెహ్రూ మరణం తదితర కారణాలు.. జాతీయస్థాయిలో ఆకర్షించగల అంశం ఏదీ లేదు. కానీ 1952, 1957, 1962 ఎన్నికల తర్వాత భారతీయులు నిర్ణయాత్మక తీర్పుతో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు.
భారతీయ జనసంఘ్, హిందూ మహాసభలతోపాటు రాజాజీ, రాం మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య నరేంద్రదేవ్, చౌదరి చరణ్ సింగ్, సీఎన్ అన్నాదురై తదితర ప్రముఖులు ఆలోచనా భావాలు.. ప్రత్యేక ప్రయోజనాలతో ప్రజల ముందుకు వచ్చిన విధానాలు ప్రభావితం చేశాయి.

1967లో కాంగ్రెస్ వ్యతిరేకతకు మూలాలు

1967లో కాంగ్రెస్ వ్యతిరేకతకు మూలాలు

1967 ఎన్నికల్లో మార్పు మొదలైంది. అన్ని వర్గాలకు సమానత్వం కల్పించలేమని అలా ముందుకు తీసుకెళ్లలేమని కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించింది. కొన్ని సెక్షన్ల ప్రజానీకం, కొందరు వ్యక్తులు మాత్రమే వికసించారన్న సంగతి అవగతమైంది. మిగతా వెనుకబడిన వర్గాల వారు ప్రత్యామ్నాయాల కోసం ఇతర మార్గాలు చూసుకున్నారు. ఇక పాకిస్థాన్ కంటే భారత్‌నే మదరిండియాగా భావించిన ముస్లింలు భద్రత, రాజ్యాంగ పరమైన హక్కులు, హుందాతనం తదితర అంశాల్లో తమకు అండగా నిలిచిన వారికి చేరువయ్యారు. సంపన్నులైన ముస్లింలు ఏం చక్కా పాకిస్థాన్‌కు తరలిపోగా, నిరుపేద ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోయారు. అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టాల్సిన పాలకులు సుదీర్ఘ కాలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితం కూడా ఈనాటి కాంగ్రెస్ పార్టీ దుస్థితికి కారణమంటే అతిశేయోక్తి కాబోదు. కానీ అణగారిన వర్గాల అభ్యున్నతి తీసుకున్న చర్యలూ 1991వ దశకంలోనే ‘మందిర్ - మసీదు' రాజకీయాలకు పునాదిగా మారాయి.

తమిళనాట ద్రవిడ ఉద్యమంతో కాంగ్రెస్‌కు దూరం

తమిళనాట ద్రవిడ ఉద్యమంతో కాంగ్రెస్‌కు దూరం

దక్షిణాది భారతదేశంలో భాషా ప్రాతిపదికన మొదలైన జాతీయవాదం కాంగ్రెస్ పార్టీని తమిళనాట అధికారానికి దూరం చేసింది. భాష రాజకీయాలతో మొదలైన పతన పర్వం.. 21వ శతాబ్దిలో తూర్పు కోస్తా రాష్ట్రాల నుంచి హిందీ భాషా ప్రాంతాలకు క్రమంగా విస్తరించింది. గత అర్ధ శతాబ్దిలో కాంగ్రెస్ ఏక పార్టీ ఛత్రాధిపత్యం కొనసాగుతూ వచ్చింది. అన్ని కులాలు, తరగతులు, భాష మాట్లాడే వారి మద్దతును పొందగలిగింది. ఇందిరాగాంధీ 1971లో అకస్మాత్తుగా నిర్వహించిన ఎన్నికలు, తర్వాత 1980లో సాధించిన ఘన విజయం.. ఆమె దారుణ హత్య తర్వాత 1984లో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయాలు సాధించిన మాట ఎంత నిజమో.. అంతే స్థాయిలో ప్రజలకు దూరం అవుతూ వచ్చిందని విశ్లేషకులు చెప్తున్నారు.

పెరిగిన ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం

పెరిగిన ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం

1989 - 90 నుంచి గుర్తింపు రాజకీయాలు, కూటముల ఆవిర్భావం మొదలు కాగా, సొంత ప్రతిష్టపై ముందుకు సాగే రాజకీయాలతో పరిపాలనకు సహజ సిద్ధమైన పార్టీ అన్న నానుడికి కాంగ్రెస్ దూరమైంది. కాంగ్రెస్ పార్టీలో చీలికలు పెరిగిపోయినా కొద్దీ ఓటర్లకు దూరమైంది. తమిళనాడులో ద్రవిడ పార్టీలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఒడిశాలో బిజూజనతాదళ్ పదేపదే గెలుస్తూ వచ్చాయి. ఇక పశ్చిమబెంగాల్‌లో పాలన సాగిస్తున్న త్రుణమూల్ కాంగ్రెస్, బీహార్‌లో నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బీహార్‌లో మాదిరిగా యూపీలోనూ ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడిగా పోటీచేస్తే అర్థవంతమైన ఫలితాలు వచ్చేవి.

అది కాంగ్రెస్ పార్టీకి దురద్రుష్టకరం

అది కాంగ్రెస్ పార్టీకి దురద్రుష్టకరం

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 2014 మే 16 అత్యంత దురద్రుష్టకరమైన రోజు. 2009లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 స్థానాలకు మాత్రమే పరిమితమై పార్టీ నాయకత్వానికి, పార్టీ విధానానికి మార్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విస్త్రుత ప్రాతిపదికన ఏకైక సింగిల్ పార్టీ విధానం నుంచి కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. హిందూ జాతీయవాదానికి ప్రతిగా.. ముస్లింలు, ఇతర మైనారిటీ సామాజిక వర్గాలతో భావోద్వేగపూరిత అనుబంధం పెంపొందించేందుకు ఉమ్మడి విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాల్సి ఉంటుందని, అప్పుడు భారత జాతీయతా వాదానికి మద్దతు సంపాదించగలదని విశ్వసిస్తున్నారు.

విపక్షాలను కూడగట్టిన సోనియా

విపక్షాలను కూడగట్టిన సోనియా

2004 లోక్‌సభ ఎన్నికల్లో ఏక పార్టీ రాజకీయాల నుంచి సంకీర్ణ రాజకీయాల వైపు పార్టీని మళ్లించిన కాంగ్రెస్ పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ.. ప్రత్యేక రాజకీయ ప్రయోజనాలు గల రాజకీయ పార్టీలతో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యుపిఎ) ‘రెయిన్ బో' కూటమి ఏర్పాటు చేసి, విజయం సాధించింది. 2009లోనూ మలిదఫా యూపీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తొలిసారి కాంగ్రెస్ పార్టీ వరుసగా పదేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్విఘ్నంగా నడిపింది. 2004 ఎన్నికల్లో 140 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో 206 స్థానాల్లో విజయం సాధించి తన స్థాయిని పెంచుకున్నది.

సంకీర్ణ ధర్మానికి కాంగ్రెస్ చెల్లుచీటి

సంకీర్ణ ధర్మానికి కాంగ్రెస్ చెల్లుచీటి

కాల చక్రం పదేళ్లు తిరిగిపోయింది. సంకీర్ణ రాజకీయ ధర్మాలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల నాటికి ఒంటరిపాటైంది. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాల్లో అనైక్యత.. మోదీ అద్భుతాలు కలిసివచ్చాయి. అనూహ్యంగా బీజేపీ 31 శాతం ఓట్లు పొంది చారిత్రక విజయాలు సాధించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మూడొంతుల సీట్లు గెలుచుకున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో 58 శాతం ప్రజలు బీజేపీని విధాన పరంగానే తిరస్కరించారు. కానీ బీహార్ రాష్ట్రంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించలేదు. దీనికి కారణం బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ - జేడీయూలతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహా కూటమి ఏర్పాటు చేయడమే. కానీ యూపీలో కాంగ్రెస్, ఎస్పీ మాత్రమే కూటమిగా పోటీ చేయగా, మరో బలమైన శక్తిగా ఉన్న బీఎస్పీ అధినేత మాయావతి, పశ్చిమ యూపీలో కీలకంగా ఉన్న అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) కూటమికి దూరంగానే ఉన్నాయి.

బీహార్ ఫలితాల కోసమే 2019లో కూటమి అవసరమన్న సంకేతాలు

బీహార్ ఫలితాల కోసమే 2019లో కూటమి అవసరమన్న సంకేతాలు

బీహార్, యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2004 నాటి స్ఫూర్తిని పునరుద్ధరించాలని సంకేతాలనిస్తున్నాయి. 2004 ఎన్నికల్లో ‘భారత్ వెలిగిపోతోంది' అనే నినాదంతో హోరెత్తిన బూటకపు ప్రచారాన్ని నిలువరించగలిగింది. ప్రస్తుతం అంతకంటే సీరియస్‌గా ‘సంఘ్' ‘ఐడియా ఆఫ్ ఇండియా' నినాదాన్ని నిలువరించాల్సిన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. 2004 నాటి కంటే ఉమ్మడిగా సమర్థంగా కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాత్రను ఆయన కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోషించాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. 1936లో పండిట్ నెహ్రూ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షోపన్యాసాన్ని నిజం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉన్నది.

కాంగ్రెస్ పార్టీ పునాది పెంచుకుంటుందా?

కాంగ్రెస్ పార్టీ పునాది పెంచుకుంటుందా?

తనకు దూరమైన వివిధ సామాజిక వర్గాలతో అనుబంధం పెంపొందించుకునేందుకు వారికి జవసత్వాలు కలిగించేందుకు పూనుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. 1936లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నెహ్రూ ఎన్నికైన తర్వాత 1937లో తొలి విజయాలు సాధించింది. పార్టీకి పూర్తిస్థాయిలో ప్రక్షాళన గావిస్తేనే విజయం సాధించగలమని తెలిపారు. 1936 - 37 నాటి మాదిరిగా ఈనాడు నెహ్రూ - గాంధీ జోడీ అందుబాటులో లేదు. కానీ 1936లో అప్పటి నెహ్రూ విధానాలను దాదాపుగా 2004లో అమలు చేయడంలో సోనియాగాంధీ విజయం సాధించారు. అదే ప్రక్రియ మరోసారి చేపట్టి, అంతర్మథనానికి చోటు కల్పించడం ద్వారా పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు పునరంకితం కావాలి.

కాంగ్రెస్ పార్టీకి కార్యాచరణ సాధ్యమేనా?

కాంగ్రెస్ పార్టీకి కార్యాచరణ సాధ్యమేనా?

తాజా యూపీ ఎన్నికల ఫలితాలతో ఘోరమైన ఫలితాలను చవి చూడటంతో అంతర్మథనం సమయం దాటిపోయిందని, ఏకంగా కార్యాచరణలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎకె ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి వారు చెప్తున్నారు. ఇక నుంచి సమయం వేస్ట్ చేయకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 20 కోట్ల మంది భారతీయులను ఆకర్షించుకోవాల్సి ఉందంటున్నారు. 85 శాతం మంది హిందువుల జనాభా ఉన్నా ప్రపంచంలోకెల్లా ముస్లింల జనాభాగల రెండో దేశంగా భారతదేశానికి పేరుంది. ముస్లింలను పూర్తిస్థాయిలో విశ్వాసంలోకి తీసుకోకుండా 21వ శతాబ్దిలో విజయాలు సాధించడం కష్టమని విశ్లేషకులు చెప్తున్నారు.

English summary
As I found myself through most of last Saturday being battered in TV studios by the election results as they inexorably poured in, there was one illuminating moment when I suddenly understood what this election was about.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X