ప్రసాద్ పేరుకు, అరెస్టులకు లింక్

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

ప్రసాద్ పేరుకు, అరెస్టులకు లింక్
వృత్తిలో లేదా జీవితంలో పైమెట్టు అధిరోహించిడంలో పేరుకు కూడా సంబంధం ఉంటుందని అంటుంటారు. సెలిబ్రీటీ క్షేత్రంలో పేర్లు కలిసి రాదనే తమ పేర్లను మార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్ అనే పేరు కలిసి వస్తున్నట్లు లేదు. సిబిఐ చేతుల్లో అరెస్టయి జైలు పాలైనవారి పేర్లలో ప్రసాద్ పేరు ఉండడం యాదృచ్ఛికమే కావచ్చు గానీ ఆ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రసాద్ పేరుకూ.. జైలుకూ ఏదో అవినాభావ సంబంధం ఉందన్నదనే మాట చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రసాద్‌లు అరెస్టయ్యారు. ఇప్పటికే కోనేరు ప్రసాద్, బిబు ప్రసాద్ ఆచార్య జైల్లో ఉండగా, తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.

కోనేరు ప్రసాద్ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో, బిబూ ప్రసాద్ ఆచార్య గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కేసులో అరెస్టు కాగా, నిమ్మగడ్డ ప్రసాద్ వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. ఐఎఎస్ అధికారి అయిన బిబూ ప్రసాద్ ఆచార్య ఉరఫ్ బిపి ఆచార్యకు వైయస్ జగన్ ఆస్తుల కేసుతోనూ సంబంధం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసులోనూ సిబిఐ అధికారులు ఆచార్యను విచారించారు.

అదే సమయంలో పేరు ఎస్ ఆక్షరాన్ని కూడా అదే రీతిలో చూస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి పేరులో ఎస్ ఉంది. అలాగే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయ సాయి రెడ్డి పేరులో కూడా ఎస్ ఉండడం గమనార్హం. గాలి జనార్దన్ రెడ్డి కేసులో అరెస్టయిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి పేరులో కూడా ఎస్ ఉంది.

English summary
An interesting debate is going on in Andhra Pradesh is that three Prasads were arrested by CBI in different cases till now. And other arrested persons names are having 'S' letter.
Write a Comment
AIFW autumn winter 2015