వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో జూ.ఎన్టీఆర్: ఓపెనింగ్ మాత్రమే అదుర్స్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baadshah
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఫ్లెక్సీలలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉండటంపై యంగ్ టైగర్ స్పందించక పోవడంతో ఆ ప్రభావం ఆయన తాజా చిత్రం బాద్ షా పైన కొన్ని ప్రాంతాలలో పడుతోందంటున్నారు. జూనియర్ తాజా చిత్రం బాద్ షా తొలి రోజు రూ.9 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. తొలి రోజు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్‌లు రాబట్టిన చిత్రం ఇదే. అయితే, ట్విస్ట్ ఏమంటే తొలి రోజు ఆ తర్వాత రోజు కలెక్షన్లు బాగానే ఉన్న క్రమంగా గత సినిమాల కంటే తగ్గుతున్నాయట.

గత చిత్రాల రికార్డ్ బద్దలు కొడుతూ తొలి రోజే రూ.9 కోట్లు ఎలాగైతే రికార్డ్ సృష్టించిందో అంతే వేగంగా చిత్రం కలెక్షన్లు పడిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలలో ఆయన ఫోటో కనిపించడం, దానిపై ఆయన ఇంత వరకు స్పందించక పోవడమే కారణమంటున్నారు. నందమూరి పేరుతో ఎదిగిన జూనియర్ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. నందమూరి ఫ్యాన్స్ జూనియర్‌ను ఆదరిస్తున్నారు. అలాగే ఆయనకు సొంతగా కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.

అయితే, ఈ హీరో రాజకీయ వైఖరి మాత్రం అభిమానులను గందరగోళపరుస్తోందని చెబుతున్నారు. కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గతంలో చెప్పిన జూనియర్.. ఇప్పుడు జగన్ పార్టీ ఫ్లెక్సీలలో తన ఫోటో ఉపయోగించుకుంటున్నా స్పందించక పోవడంపై జూనియర్, నందమూరి అభిమానులకు అంతుచిక్కడం లేదంటున్నారు. తొలి రోజు బాగానే కలెక్ట్ చేసిన బాద్ షా చిత్రంపై ఆయన మౌనం తర్వాత రోజు నుండి పడిందంటున్నారు.

ఆసక్తికరమైన విషయమేమంటే.. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడుగా ముద్రపడి, ఆయన ఫోటోను వినియోగించుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని గడ్డ పైన బాద్ షా చిత్రంపై ప్రభావం పడిందంటున్నారు. జూనియర్ నటించిన ఊసరవెల్లి చిత్రం గుడివాడలో తొలి రోజు రూ.8 లక్షలు వసూలు చేసింది. అయితే, బాద్ షా మాత్రం కేవలం రూ.5 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల బహిరంగ సభ కోసం నాని పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించారట. నానికి చెందిన శరత్ థియేటర్‌లో కూడా బాద్ షాపై ప్రభావం కనిపిస్తోందంటున్నారు. జగన్‌తో జూనియర్ కలిసి ఉన్న ఫ్లెక్సీల ప్రభావం కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. మచిలీపట్నం, ఉయ్యూరు, కంకిపాడు, విజయవాడల్లో ప్రభావం పడిందంటున్నారు.

అయితే, బాద్ షా చిత్రం హౌస్ ఫుల్‌గా నడుస్తోందని, రాజకీయ కారణాలు సినిమాపై ప్రభావం పడలేదని మరికొందరు చెబుతున్నారు. గుడివాడ కలెక్షన్లను ఉదహరిస్తూ ప్రభావం పడిందని కొందరు చెబుతున్నారు. జగన్ పార్టీల ఫ్లెక్సీలలో జూనియర్ కనిపించడం కృష్ణా తదితర జిల్లాల్లో మాత్రమే కాదు. ఆసక్తికరంగా జగన్ ప్రాంతమైన కడపలోను పడిందట. ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో అభిమానులు బాలకృష్ణ, జూనియర్‌లుగా విడిపోయారని, ఈ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. రాజకీయ కారణాలు సినిమాపై పడలేదనే వారు లేకపోలేదు.

English summary

 Jr NTR's Baadshah set a new record of first day bos office collections by raking in Rs.9 crore. However, it's fast losing steam because the state is mum on his links with YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X