వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల కోసేసినా కూడా కాటేసి చంపిన నాగుపాము

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాము పగ పన్నెండేళ్లంటారు. పాము పగ గురించి మన దేశంలో చాలా నమ్మకాలున్నాయి. చైనాలో వాటి గురించి ఏమైనా నమ్మకాలున్నాయో, లేదో తెలియదు గానీ ఆ దేశంలో ఒక పాము తన తల కోసిన వంటవాణ్ని 20 నిమిషాల తర్వాత కరిచి మరీ, చచ్చిపోయింది.

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌వాసులకు విషపూరిత పాముల మాంసంతో రుచికరమైన వంటకాలు వండుకోవడం, వాటి తల మాంసంతో సూప్‌ చేసుకు తాగడం అలవాటు. ఇదే రీతిలో అక్కడి ఒక హోటల్‌ షెఫ్‌ పెంగ్‌ ఫాన్‌ ఓ కస్టమర్‌ ఆర్డర్‌ మేరకు సూప్‌ తయారీ కోసం అత్యంత విషపూరితమైన ‘స్పిట్టింగ్‌ కోబ్రా' తలను కోసి పక్కన ఉన్న పాత్రలో వేశాడు.

Cobra bites, kills chef after head cut off

కోసిన కొద్దిసేపటి దాకా పాము తల ప్రాణంతోనే ఉంటుంది కాబట్టే ఈ జాగ్రత్త తీసుకుంటారు. ఆ జాగ్రత్తను పాటిస్తూనే ఆ తర్వాత 20నిమిషాలకు సూప్‌ తయారు చేయడం కోసం పాము తలతీద్దామని అతడు పాత్రలో చెయ్యి పెట్టాడు. అలా చేయి పెట్టాడో, లేదో అది కసుక్కున కాటేసి, పగ తీర్చుకుంది. అతడు మాత్రం ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచాడు.

శరీర భాగాలను, ఇంకా చెప్పాలంటే పూర్తి శరీరాన్ని కోల్పోయిన తర్వాత కూడా సరీసృపాలు గంట పాటు పనిచేస్తాయని 40 ఏళ్ల పాటు పాములపై పరిశోధనలు చేసిన యాంగ్ హాంగ్ - చాంగ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

English summary
A chef preparing a meal of cobra flesh has died after the snake bit him some 20 minutes after the reptile’s head had been cut off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X