వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ పోర్ట్‌లు ఉపయోగించుకుంటాం!: బాబుకు కేసీఆర్ విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం నుండి ఉత్పత్తులు పంపించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోర్టులను ఉపయోగించుకోనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు చెప్పారు.

KCR to use Andhra Pradesh port for exports, sends proposal

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం వద్ద గల బందరు విమానాశ్రయాన్ని ఎగుమతుల కోసం వినియోగించుకుంటామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరం లేదు. ఎలాంటి పోర్టులు లేవు. దీంతో ఎగుమతులు, దిగుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోర్టులను ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు.

ఏపీకి చెందిన పోర్టులను వినియోగించుకుంటామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాము ప్రతిపాదనలు పంపించినట్లు కేసీఆర్ చెప్పారు. తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా ఈ విషయమై విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాజ్ భవన్లో కలిసినప్పుడు ఆయనకు తాను ఈ విజ్ఞప్తి చేశానని తెలిపారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Thursday said that the state government is planning to utilise the services of the Bandar port at Machilipatnam, in Andhra Pradesh, for exports since Telangana has no coast or ports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X