న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నటి హుమైమాతో సానియా భర్త షోయబ్ చక్కర్లు

By Pratap

కరాచీ: హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి హుమైమా మాలిక్‌తో చక్కర్లు కొడుతున్నారు. అయితే, ఆమె తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని షోయబ్ అంటున్నారు. సానియా మీర్జాకు, షోయబ్ మాలిక్‌కు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్న సమయంలో ఈ వార్త బయటకు పొక్కింది.

No trouble in our paradise, insists Shoaib Malik on his marital life with Sania Mirza

సానియా మీర్జాతో తమ వివాహ జీవితం చక్కగా సాగిపోతోందని, తమ మధ్య ఏ విధమైన పొరపొచ్చాలు లేవని షోయబ్ మాలిక్ అన్నారు. తామిద్దరం ఇప్పుడు దుబాయ్‌లో ఒక చోటే ఉన్నామని చెప్పారు. క్రిడాకారులుగా తాము తమ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని, అంత మాత్రాన విడిపోతామని అనడంలో అర్థం లేదని ఆయన అన్నారు.

షోయబ్ హుమైమా మాలిక్, ఆమె కుటుంబ సభ్యులకు సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు - తనకు, సానియాకు మధ్య బంధం పటిష్టంగా ఉందని, అది అంత సులభం కాదని వివాహానికి ముందే తమకు తెలుసునని, తమపై నిరాధారమైన కథనాలు రావడం నిస్పృగతకు గురి చేస్తుందని ఆయన అన్నారు.

తాను ప్రపంచ కప్ ఆడబోనని చెప్పినట్లు వచ్చిన వార్తాకథనాలపై కూడా ఆయన మండిపడ్డారు. తాను ఆ విధంగా ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X