వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సును కౌగలించుకున్న బరాక్ ఒబామా

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా ఓ నర్సును కౌగలించుకున్నాడు. అయితే, ఇందులో దురుద్దేశం ఏమీ లేదు. నినా ఫామ్ అనే నర్సుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎబోలా నుంచి బయటపడినందుకు ఆమెను అభినందించడమే కాకుండా ఆమెను హత్తుకున్నారు.

ఒబామా 26 ఏళ్ల ఫామ్‌ను శ్వేతసౌధంలో కలుసుకున్నారు. నర్సును ఆయన కౌగలించుకున్న దృశ్యాలను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఈ సందర్భాన్ని రికార్డు చేయడానికి ఓవల్ ఆఫీసులోకి ఫొటోగ్రాఫర్లను అనుమతించారు.

ఎబోలా వ్యాధితో బాధపడుతున్న లిబేరియన్‌ను చూస్తున్నప్పుడు డల్లాస్ ఆస్పత్రిలో ఫామ్ అనే నర్సు ఎబోలా వైరస్ బారిన పడింది. మేరీల్యాండ్‌ బెథెస్డాలో గల జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్)లో నర్సు చికిత్స పొంది నయమైన తర్వాత శుక్రవారంనాడు డిశ్చార్జీ అయింది.

 Obama hugs nurse who survived Ebola

ఒబామాను కలవడానికి వెళ్లినప్పుడు ఆమెకు ఏ విధమైన చెక్ పాయింట్లు, అదనపు నియంత్రణలు ఎదురు కాలేదు. తనకు వైరస్ లేదని ధ్రువీకరించుకోవడానికి ఆమె ఐదు వివిధ రకాల పరీక్షల వివరాలను సమర్పించడమే అందుకు కారణం. ఈ విషయాన్ని శ్వేతసౌధం అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ చెప్పారు.

అదృష్ణం వల్ల ఆశీస్సుల వల్ల తాను ఇలా ఇక్కడ నిలబడగలిగానని ఫామ్ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నది. ప్రార్థనలకు శక్తి ఉందని ఆమె అభిప్రాయపడింది. తన కోసం ప్రజలంతా ప్రార్థనలు చేశారని ఆమె గుర్తు చేసుకుంది.

English summary

 US President Barack Obama greeted nurse Nina Pham in the Oval Office with a big hug to celebrate her recovery from the Ebola virus, which she was the first person in the country to contract.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X