హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లలేం చేశారు: సుహాసినిని ఓదార్చలేక..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనం కల్గించిన చిన్నారుల హత్యోదంతంపై అందరూ నివ్వెరపోయారు. ముఖ్యంగా హత్య చేసిన చిన్నారులను పాతిపెట్టిన మేడ్చల్‌ ప్రాంతంలో తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కూడా పలువురు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. హత్య జరిగిన తీరు గురించి చర్చించారు. కాగా చిన్నారులను పథకం ప్రకారమే గురుప్రసాద్‌ హత్య చేసినట్లు సంఘటన తీరుపట్ల తెలుస్తోంది.

గురుప్రసాద్‌ దాదాపు పది సంవత్సరాల క్రితం మేడ్చల్‌ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో గల కల్పతరువు వెంచర్‌లో 200 గజాల ప్లాటును కొన్నాడు. ప్రస్తుతం ఈ వెంచర్‌లో ఎటువంటి అభివృద్ది లేకపోవడంతో మొక్కలతో నిండిపోయి చిట్టడవిగా మారింది. నిర్మానుష్యంగా ఉన్న ఈ వెంచర్‌ను ఎంచుకొని, ముందస్తుగానే ఆ ప్లాటులో ఇంటి నిర్మాణం చేస్తున్నానని కూలీల చేత గొయ్యి తీయించినట్లు భావిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను గొయ్యిలో ఒకరిపై ఒకరిని పడుకోబెట్టాడు.

అనంతరం మృతదేహాలపై ఒక దుప్పటిని కప్పి మట్టితో పూడ్చివేశాడు. ఫోన్‌ ఆధారంగా మేడ్చల్‌లోని గురుప్రసాద్‌ భూమిని కనుగొన్న పోలీసులకు ప్లాటులో మట్టితో పూడ్చిన గొయ్యి కనిపించడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారులను దారుణంగా హతమార్చిన కసాయి తండ్రి తీరును అందరు చీదరించుకుంటున్నారు. పిల్లలేమి చేశారని ప్రశ్నిస్తున్నారు. భార్యభర్తల గొడవలో అమాయక చిన్నారులు బలయ్యాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుహాసిని

సుహాసిని

చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడకు చిన్నారుల తల్లి సుహాసిని, కుటుంబ సభ్యులు వచ్చారు. వారు తీవ్రంగా రోదించారు.

సుహాసిని

సుహాసిని

చిన్నారుల తల్లి సుహాసిని మాట్లాడుతూ పథకం ప్రకారం తన పిల్లలను తన భర్త హత్యచేశాడని తనను కూడా హత్య చేయడానికి పథకం పన్నాడని తనను పిలిచినా వెళ్లలేదని తెలిపారు.

సుహాసిని

సుహాసిని

తన పిల్లలులేని జీవితం తనకు వద్దంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. గురుప్రసాద్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని తెలిపారు.

సుహాసిని

సుహాసిని

అనుమానం రాకుండా పిల్లలను హతమార్చాడని, ఆ రోజు తనను కూడా రమ్మంటే తాను వెళ్లలేదని గురుప్రసాద్ భార్య సుహాసిని పేర్కొన్నారు

సుహాసిని

సుహాసిని

నివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వచ్చి ఆలయానికి వెళ్తామని చెప్పాడని, పిల్లల గురించి అడిగితే ఏమీ చెప్పలేదని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు ఫోన్ చేసి గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పారని తెలిపారు. అయితే, తన పిల్లలు బతికే ఉంటారని ఆశపడ్డానని, కానీ అతను చంపేశాడని కన్నీరుమున్నీరయ్యారు.

English summary
Photos of Suhasini wife of Guru Prasad cries after seeing her children at Gandhi mortury.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X