చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజాపై దాడి: సాక్షి చానెల్ ప్రసారాల నిలిపివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi channel telecast stopped
చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరిలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. నగరి శాసనసభ్యురాలు రోజాపై దాడి చేశారనే ఆరోపణతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు నగరిలో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సమయంలో నగరిలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసుల వైఖరికి నిరసనగా శాసనసభ్యురాలు రోజా, పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్, శాసనసభ్యులు నారాయణ స్వామి, అమర్నాథ్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళా శాసనసభ్యురాలని కూడా చూడకుండా రోజాపై దాడికి దిగడం దారుణమని వైయస్సార్ కాగ్రెసు నాయకులు విమర్శిస్తున్నారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసులు తమ బాధ్యతను విస్మరించడం దురదృష్టకరమని వారంటున్నారు. ఈ సంఘటనతో నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

English summary

 Sakshi TV channel telecast has been stopped at Nagari in Chittoor district as YSR Congress leaders staged dharna protesting against attack on local MLA Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X