వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లో తెలంగాణ మిస్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడి నెలలు గడుస్తున్నా, ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా ఇప్పటి వరకు హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో తెలంగాణ కనిపించడం లేదు. 29వ రాష్ట్రంగా తెలంగాణ చోటు చేసుకోవాల్సి ఉంది. కానీ 28 రాష్ట్రాలను మాత్రమే ఆ వెబ్‌సైట్ చూపుతోంది.

నిజానికి, రాష్ట్ర విభజన ప్రక్రియను సాగించింది హోం మంత్రిత్వ శాఖనే. అయినా, తెలంగాణ రాష్ట్రమే మనుగడలో లేనట్లుగా వెబ్‌సైట్లో చూపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భారత చిత్రపటంలో రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ అని శోధిస్తే కూడా ఫలితం కనిపించడం లేదు.

Telangana missing from the Home Ministry website

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిగా హోం శాఖలను ఏర్పాటు చేసుకున్నాయి. రెండు రాష్ట్రాలకు విడివిడిగా డిజిపిలున్నారు. పోలీసు అమరవీరుల స్మారకదినోత్సవాన్ని వేర్వేరుగా నిర్వహించుకున్నాయి. పైగా, తెలంగాణ పోలీసు శాఖ ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఆప్‌ను ప్రారంభించింది.

అదృశ్యమైన వాహనాలను గుర్తించడానికి ఆ యాప్ పనికి వస్తుంది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఎపి పోలీసు వెబ్‌సైట్‌నే వాడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆన్‌లైన్ సేవలకు ఎపి పోలీస్ వెబ్‌సైట్‌నే ఇంకా వాడుకుంటున్నారు.

English summary
The website of the Ministry of Home Affairs, which actually initiated the process of bifurcation of Andhra Pradesh that led to the birth of India’s 29th state, seems to be unaware of the bifurcation. Telangana does not even exist on the website of the Ministry of Home Affairs even months after its formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X