వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిలదీస్తారని: కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టకపోవడం వెనుక!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడక పోవడానికి మీడియా భయమనే కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి! ఢిల్లీలో రెండురోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్ కలిశారు. అయితే, మీడియా సమావేశం నిర్వహించకుండా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

తన భేటీ వివరాలను మీడియాకు చెప్పక పోవడం వెనుక కారణాలు ఉన్నాయని వినికిడి. ఈసారి ఢిల్లీలో మీడియా ప్రతినిధులు నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాన్ని ఊహించి కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించకుండా వెళ్లిపోయారంటున్నారు.

 Why KCR not talk with media?

శనివారం ప్రధానిని కలసేందుకు వెళ్లాల్సిన సమయంలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల నిషేధంపై మీడియా ప్రతినిధులు కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేశారు. దీంతో ఆయన వెనుక ద్వారం గుండా ప్రధానిని కలవడానికి వెళ్లారు. ఆ తర్వాత రోజు అంటే ఆదివారం కూడా ఢిల్లీ మీడియా ప్రతినిధులు కేసీఆర్ ఢిల్లీ నివాసం ముందు వరుసగా రెండో రోజు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఢిల్లీ మీడియా ప్రతినిధులును పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇది ఇబ్బందికరంగా పరిమణించిందంటున్నారు. వీరికి జాతీయ మీడియా ప్రతినిధులు కూడా తమ మద్దతు తెలిపారు. రాజ్‌దీప్ సర్ధేశాయ్ వంటి మీడియా లెజెండ్స్ కూడా టీవీ ఛానళ్ల నిషేధాన్ని, జర్నలిస్ట్‌ల అరెస్ట్‌ను ఖండించారు.

దీంతో విలేకరుల సమావేశం నిర్వహిస్తే.. విలేకరులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారని, జాతీయ పత్రికా ప్రతినిధులు కూడా నిషేధం విషయాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారని సమాచారం రావడంతో కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించకుండానే వెళ్లిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary

 Why Telangana CM K Chandrasekhar Rao not talk with media?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X