వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోయెం ట్వీట్: అమితాబ్‌కు రూ. కోటికి లీగల్ నోటీస్

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫొటోను లేదా వ్యాఖ్యను మనం షేర్‌ చేస్తుంటాం. కానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చిక్కుల్లో పడిన విషయం గమనిస్తే ఆ విషయంలో మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని అనిపించకమానందు.

వెనకా ముందులు ఆలోచించకుండా అలాంటి పని చేసి బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ చిక్కుల్లో పడ్డారు. వికాస్‌ దూబే అన్న వ్యక్తి పంపిన ‘కోర్ట్‌ మి కుత్తా' అనే పద్యం అమితాబ్‌కు బాగా నచ్చేసింది. దాంతో వికాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్‌ పెట్టాడు. ఆయన పంపిన పద్యాన్ని షేర్‌ చేశాడు. దానికి అద్భుత స్పందన వచ్చింది.

Big B served with Rs 1 crore legal notice for 'copyright abuse'

దాన్ని 1.72 లక్షల మంది లైక్‌ చేశారు. 16 వేల మంది దానిని షేర్‌ చేశారు. వేలాదిమంది దానిపై కామెంట్‌ చేశారు. అయితే, వాస్తవానికి ఆ పద్యాన్ని రాసింది మహర్షి దయానంద్‌ యూనివర్సిటీలో యువజన వ్యవహారాల శాఖ డైరెక్టర్‌, హర్యానా కవి జగ్‌బీర్‌ రాథీ. దాంతో ఆయన విద్యార్థి ఒకరు జగ్‌బీర్‌కు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు.

వెంటనే, ఆ పద్యం తనదని, తన పద్యానికి మీరు క్రెడిట్‌ మరెవరికో ఇచ్చారంటూ అమితాబ్‌ టైమ్‌లైన్‌ మీద జగ్‌బీర్‌ పోస్ట్‌ పెట్టారు. అయితే, తన తప్పును సరిదిద్దుకోవడానికి బదులుగా అమితాబ్‌ ఆయన పోస్ట్‌ను తొలగించేశారు. దాంతో, సోషల్‌ మీడియాలో కాపీరైట్‌ చట్టాన్ని అమితాబ్‌ ఉల్లంఘించారని, ఆయన తనకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ జగ్‌బీర్‌ పరువు నష్టం దావా వేశారు. అమితాబ్‌కు నోటీసు పంపించారు.

English summary
Bollywood superstar Amitabh Bachchan is facing a Rs 1-crore legal action for a copyright violation on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X