గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ పర్యటన:ఎస్కార్టు లేదు, భద్రతపై ఫ్యాన్స్ ఫైర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులతో మాట్లాడేందుకు గురువారం విజయవాడకు చేరుకున్న జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు సరై భద్రక కల్పించలేదని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఉండవల్లి బయలుదేరిన పవన్ కళ్యాణ్ వాహనాలకు ఎస్కార్టును కేటాయించలేదని వారు విమర్శించారు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఉండవల్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రజలు, అభిమానులు అత్యుత్యాహంతో ఆయనను చుట్టుముట్టారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Fans Upset with pawan kalyan security at undavalli village

పవన్ ఉండవల్లికి చేరుకోవడంతో అభిమానులు, ప్రజలు పవన్ పవన్ అంటూ కేకలు వేశారు. సభలో పోలీసు బందోబస్తు లేకపోవడంతో తోపులాట జరిగింది. పవన్ కళ్యాణ్ ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు. తొలుత ఉండవల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రైతులో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు రాజధాని రోడ్ల కోసం భూములిచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తమకున్న ఇబ్బందులను వెల్లడించారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.... రైతుల బాధ వినేందుకే వచ్చానని, ప్రజలు కన్నీళ్లు పెడితే రాజధానికి మంచిది కాదన్నారు.

ఒక్క గ్రామం కన్నీళ్లు పెడితే... ఆ శోకం రాజధానికి తగులుతుందన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణతో రైతుల తరపున మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రబాలెం, బేతపూడి, తుళ్లూరు గ్రామాలకు చేరుకుని అక్కిడ రైతులను కలుస్తారు. వారి సమస్యసలను అడిగి తెలుసుకుంటారు.

English summary
Fans Upset with pawan kalyan security at undavalli village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X