వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందెశ్రీ జయ జయహే తెలంగాణపై కెసిఆర్ కన్నెర్ర?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయం తెలంగాణ రాష్ట్ర గీతం అవుతుందని అందరూ భావించారు. అయినట్లే అయింది. కానీ, లోపలి రాజకీయాలు దానికి అడ్డం పడ్డాయి. తెలంగాణవ్యాప్తంగా ఆ గేయం ఎంతో ప్రజాదరణ పొందింది. ఉద్యమ కాలంలో కూడా అది తెలంగాణను ఓ ఊపు ఊపింది. ఆ గేయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కన్నెర్ర చేసినట్లు చెబుతున్నారు.

అయితే, జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో ఆ గేయాన్ని ఆలపించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ గీతం మాత్రమే ఆలపించాలని ఆయన సూచించినట్లు సమాచారం. పది జిల్లాల ప్రస్తావన మాత్రమే ఉందని, కెసిఆర్ మరో పది జిల్ాలలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, అందువల్ల జయ జయహే తెలంగాణ అసంపూర్ణ గీతం అవుతుందని వాదిస్తున్నారు.

Formation Day fete: Bar on popular Telangana song

నిజానికి, జయ జయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం అవుతుందనే అపారమైన నమ్మకంతో కొన్ని పాఠ్యపుస్తకాల్లో దాన్ని ప్రచురించారు కూడా. కెసిఆర్ చుట్టూ ఉన్న బ్రాహ్మణ లాబీ దళిత కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాట జాతీయ గీతం కాకుండా అడ్డుకున్నారనే వాదన వినిపిస్తోంది.

అయితే, కెసిఆర్‌ను ఓ లాబీ అడ్డుకోగలదా అనేది ప్రశ్న. లోలోపల ఏదో జరిగినట్లు ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే అయినా దాని గురించి మాట్లాడడానికి చాలా మంది ఇష్టపడడం లేదు.

English summary
The popular Jaya Jaya he Telangana will not be sung during the Telangana Formation Day functions on June 2 and the week-long celebrations that will follow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X