సరే అన్నందుకు నటి చార్మీని ముట్టుకోబోయాడు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి చార్మీ పట్ల ఓ గెస్ట్ కొంత అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది! చార్మీ ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ గెస్ట్ తనతో ఫోటో దిగాల్సిందిగా చార్మీని కోరాడు. అందుకు ఆమె అంగీకరించారు. అయితే, అతను ఫోటో దిగే సమయంలో ఆమెను తాకే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె విసురుకున్నారు.

దీని పైన ప్రముఖ ఆంగ్ల పత్రిక డీసీతో చార్మీ మాట్లాడారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వయస్సు 16 లేదా 17 ఉంటుందని చెప్పారు. అతను తనతో ఫోటో దిగుతానంటే సరేనన్నానని, దాంతో అతను తన పక్కకు వచ్చి నిలబడ్డాడని, అయితే, అతను తనను తగని పద్ధతిలో ముట్టుకునే ప్రయత్నం చేశాడని వాపోయారు.

Guest misbehaves with Heroine

దీంతో తాను అతనిని తోసేశానని, అక్కడ తన సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇలా చేశాడని తెలిపారు. దీంతో మరో అభిమాని అతని చెంప చెళ్లు మనిపించాడు. దీనిపై చార్మీ మాట్లాడుతూ.. అతను చెంప దెబ్బ తిన్నప్పటికీ నవ్వుతూనే ఉన్నాడని, దీంతో అతను సైకోగా భావించామని తెలిపారు. అప్పుడు తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందన్నారు.

అతను చాలా యంగ్ అని, అలాంటి వ్యక్తి అలా చేస్తాడని తాను ఊహించలేదన్నారు. ఇది తనకు గుణపాఠంగా మారిందని, దీంతో తాను మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని, ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు డిస్టెస్ మెయింటెన్ చేస్తున్నానని చెప్పారు. అలాంటి సంఘటన తనకు ఎదురవుతుందని తాను ఎప్పుడు ఊహించలేదన్నారు.

English summary
Guest misbehaves with Heroine
Please Wait while comments are loading...